హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Rules: మీ రైలు టికెట్‌ను ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు... రూల్స్ ఇవే

IRCTC Rules: మీ రైలు టికెట్‌ను ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు... రూల్స్ ఇవే

IRCTC Rules: మీ రైలు టికెట్‌ను ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు... రూల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Rules: మీ రైలు టికెట్‌ను ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు... రూల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Rules | మీకు కన్ఫామ్ అయిన రైలు టికెట్‌ను మరొకరి పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ (Train Ticket Transfer) చేయొచ్చు. మీ బదులు మీ టికెట్‌పై వాళ్లు రైలు ప్రయాణం చేయొచ్చు. కానీ ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

పండుగకు ఊరెళ్దామని ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించారా? అనుకోని కారణాల వల్ల మీ రైలు ప్రయాణం వాయిదా పడిందా? అయితే మీకు కన్ఫామ్ అయిన ట్రైన్ టికెట్‌ను క్యాన్సిల్ చేయకుండా మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. దీనివల్ల మీరు ట్రైన్ టికెట్ క్యాన్సలేషన్ ఛార్జీలు (Train Ticket Cancellation Charges) చెల్లించాల్సిన అవసరం లేదు. మీ టికెట్ ట్రాన్స్‌ఫర్ చేసి, మళ్లీ మీరు ప్రయాణించాలనుకున్నప్పుడు కొత్తగా బుక్ చేసుకుంటే సరిపోతుంది. అయితే కన్ఫామ్ అయిన ట్రైన్ టికెట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడానికి (Transfer Train Ticket) కొన్ని నియమనిబంధనలు ఉంటాయి. వాటికి అనుగుణంగానే టికెట్ బదిలీ చేయాలి. ఈ రూల్స్‌ని భారతీయ రైల్వే (Indian Railways) వివరించింది.

ట్రైన్ టికెట్ ట్రాన్స్‌ఫర్ రూల్స్

రైలు టికెట్లను ఇతరులకు బదిలీ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరికంటే వారికి మీ ట్రైన్ టికెట్ ట్రాన్స్‌ఫర్ చేయలేరు. కేవలం కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే మీ ట్రైన్ టికెట్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. భర్త, భార్య, తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి... ఇలా వీరికి మాత్రమే మీకు కన్ఫామ్ అయిన ట్రైన్ టికెట్ ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా రైలు బయల్దేరడానికన్నా 24 గంటల ముందే భారతీయ రైల్వేకు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రైల్వే అధికారులు టికెట్ పైన ఉన్న మీ పేరును కొట్టేసి, మీరు ఎవరికి బదిలీ చేస్తున్నారో వారి పేరును యాడ్ చేస్తారు.

New Rules: క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... అక్టోబర్ 1 నుంచి నాలుగు కొత్త రూల్స్

కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ట్రైన్ టికెట్ ట్రాన్స్‌ఫర్ వర్తిస్తుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి విధినిర్వహణలో భాగంగా ఎక్కడికైనా వెళ్లేందుకు రైలు టికెట్ బుక్ చేస్తే, ఆ టికెట్‌ను మరో ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ చేయొచ్చు. గుర్తింపు పొందిన విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు కూడా ఇతర విద్యార్థులకు టికెట్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అయితే సదరు విద్యాసంస్థకు చెందిన అధిపతి లేదా ప్రిన్సిపాల్ 48 గంటల కన్నా ముందే రిక్వెస్ట్ పంపాలి. ఎన్‌సీసీ క్యాడెట్స్ కూడా 24 గంటల కన్నా ముందు ఇతర క్యాడెట్స్‌కు టికెట్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

Train Tickets: దసరా ట్రైన్‌లో టికెట్ కన్ఫామ్ అయిందా? వాట్సప్‌లో చెక్ చేయండిలా

ట్రైన్ టికెట్ ట్రాన్స్‌ఫర్ ఎలా చేయాలి

ముందుగా ట్రైన్ టికెట్‌ను ప్రింట్ తీసుకోవాలి. మీరు ఎవరికి టికెట్ ట్రాన్స్‌ఫర్ చేయాలో వారి ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ లాంటి ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డ్ తీసుకోవాలి. మీకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌లో రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి ఫామ్ పూర్తి చేయాలి. రైల్వే అధికారులు వివరాలు చెక్ చేసిన తర్వాత రూల్స్ ప్రకారం టికెట్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కన్ఫామ్ అయిన ట్రైన్ టికెట్‌ను కేవలం ఒక్కసారి మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అంటే మీరు ఒక్కసారి టికెట్ ట్రాన్స్‌ఫర్ చేశారంటే ఇక అందులో ఎలాంటి మార్పులు చేయడానికి కుదరదు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Indian Railways, IRCTC, Train tickets

ఉత్తమ కథలు