హోమ్ /వార్తలు /బిజినెస్ /

Term insurance: రూ.1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ప్రీమియం ఎంతంటే...

Term insurance: రూ.1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ప్రీమియం ఎంతంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Term Insurance | మీరు కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నీ పోటాపోటీగా టర్మ్ పాలసీలను అందిస్తున్నాయి. ఏ కంపెనీ అతి తక్కువ ప్రీమియం ఆఫర్ చేస్తోందో తెలుసుకోండి.

కరోనా తరువాత ఇన్సూరెన్స్ పాలసీల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. సంపాదించే కుటుంబ పెద్ద అనుకోని సందర్భాల్లో మరణించినప్పుడు.. ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తాయి టర్మ్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) పాలసీలు. వైద్య ఖర్చులను హెల్త్ పాలసీలు కవర్ చేస్తాయి. కరోనా పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన ప్రజలు టర్మ్ ఇన్సూరెన్స్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆరోగ్య బీమా (Health Insurance) లేదా జీవిత బీమా అయినా.. పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవడానికి తగిన మొత్తంలో బీమా పొందాలి. అంటే పాలసీని ఎంచుకున్నప్పుడు, తగిన కవరేజీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

అయితే ఈ బీమా చేసిన మొత్తం అనేది వ్యక్తులను బట్టి మారుతుంది. ఆర్థిక లక్ష్యాలు, ఆదాయం, పాలసీదారులపై ఆధారపడిన వారి సంఖ్య.. వంటి అంశాల ఆధారంగా బీమా మొత్తాన్ని వ్యక్తులు నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా లైఫ్ పాలసీల విషయంలో.. ఒక వ్యక్తి ప్రస్తుత వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు విలువైన లైఫ్ కవర్ ఉండాలనే నిబంధన ఉంటుంది. పాలసీదారుల వాస్తవ అవసరాలను బట్టి అధిక కవరేజీని ఎంచుకోవచ్చు.

PAN Card: పాన్ కార్డ్ మర్చిపోయారా? మీ ఆధార్ నెంబర్‌తో సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయొచ్చు ఇలా

వ్యక్తుల వయసు పెరిగే కొద్దీ, జీవిత బీమా పాలసీ ప్రీమియం ధరలు పెరుగుతాయి. అందువల్ల తక్కువ వయసులోనే వీలైనంత త్వరగా లైఫ్ పాలసీని ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకునే సమయంలో, అనేక ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అవసరాల ఆధారంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఎండోమెంట్ ప్లాన్, యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP), చైల్డ్ ప్లాన్, హోల్ లైఫ్ పాలసీ, రిటైర్మెంట్ ప్లాన్ మొదలైనవాటిలో ఏదో ఒకదాన్ని ఒకటి ఎంచుకోవచ్చు.

ఇన్సూరెన్స్ రకాన్ని ఫైనల్ చేసిన తర్వాత, వాటికి సంబంధించి ఉత్తమ ఆఫర్‌ల కోసం అందుబాటులో ఉన్న ఆప్షన్లను పోల్చాలి. చౌకైన ప్రీమియంతో లభించే ప్లాన్‌ను ఎంచుకోవడం అనేది ఎల్లప్పుడూ బెస్ట్ ఆప్షన్ కాకపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో, అవసరమైన యాడ్-ఆన్‌లు.. వంటి కీలక విషయాలను పాలసీదారులు పరిగణనలోకి తీసుకోవాలి. జీవిత బీమా పాలసీకి ఇతర ప్రయోజనాలు సైతం ఉన్నాయి. పాలసీ ప్రీమియంలపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒక సంవత్సరంలో 1.5 లక్షలు ఇలా సేవ్ చేసుకోవచ్చు.

Credit Card Charges: మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో ఈ 6 ఛార్జీల గురించి మీకు తెలుసా?

రూ. 1 కోటి కవరేజీ కోసం ఎంత ప్రీమియం చెల్లించాలి?


ఢిల్లీలో నివసిస్తున్న 30 ఏళ్ల పెళ్లికాని, స్మోకింగ్ అలవాటు లేని మగ వ్యక్తి.. నెలవారీ జీతం పొందుతూ సంవత్సరానికి రూ. 7 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. అతడు 30 ఏళ్ల కాలవ్యవధికి ప్రాథమిక టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకుంటే.. రూ.1 కోటి కవరేజీకి ఎంత ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలో తెలుసుకుందాం. అయితే ఒక పాలసీదారులు చెల్లించాల్సిన అసలు ప్రీమియం మొత్తం అనేది వారి వయసు, లింగం, పాలసీ రకం, ఆదాయం, ఎంచుకున్న సమ్ అష్యూర్డ్ యాడ్-ఆన్స్.. వంటి వాటి ఆధారంగా మారవచ్చు.

బీమా కంపెనీ పేరు రూ. 1 కోటి హామీ మొత్తానికి చెల్లించాల్సిన ప్రీమియం


1. మ్యాక్స్ లైఫ్- స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్ రూ. 10,208

2. HDFC లైఫ్- Click2ProtectLife పాలసీ రూ. 11,712

3. TATA AIA – సంపూర్ణ రక్ష సుప్రీం ప్లాన్ రూ 10,738

4. ఎక్సైడ్ లైఫ్ ఎలైట్ టర్మ్ ప్లాన్ రూ. 8,347

5. Canara HSBC OBC లైఫ్ ఇన్సూరెన్స్-(iSELECTSTAR) రూ 9,596

6. BajajAllianz- Smart Protect రూ. 9,770

7. ఏగాన్ లైఫ్ – iTerm రూ 7,441

8. ICICI ప్రుడెన్షియల్ లైఫ్ (iProtect Smart లైఫ్) రూ 12,174

9. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ – డిజిషీల్డ్ ప్లాన్ రూ. 9,742

10. భారతి AXA లైఫ్- ప్రీమియర్ ప్రొటెక్ట్ ప్లాన్ రూ. 10,384

First published:

Tags: Insurance, Life Insurance, Personal Finance

ఉత్తమ కథలు