హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home Loan: హోమ్ లోన్ ఈ రకంగా తీసుకోవాలనుకుంటున్నారా ? లాభమెంత ? నష్టమెంత ?

Home Loan: హోమ్ లోన్ ఈ రకంగా తీసుకోవాలనుకుంటున్నారా ? లాభమెంత ? నష్టమెంత ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Home Loan: ఒకరికంటే ఎక్కువమంది కలిసి జాయింట్ హోమ్ లోన్‌ తీసుకోవచ్చు. దీనివల్ల కొన్ని లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి. జాయింట్ హోమ్ లోన్‌ వల్ల కలిగే లాభనష్టాలు ఉంటాయి.

కరోనా తరువాత సొంత ఇంటికోసం అన్వేషిస్తున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీతో హోమ్ లోన్లను(Home Loan) అందిస్తున్నాయి. ఈ క్రమంలో సరైన ఆస్తిని గుర్తించడం, హోమ్‌ లోన్ డౌన్ పేమెంట్ కోసం నిధులను సేకరించడం, ఇంటికి సంబంధించిన ఇతర విషయాలపై నిర్ణయాలు తీసుకోవడం వేగంగా జరిగిపోతాయి. అయితే చాలా మంది వ్యక్తులు తాము ఆశించిన మేరకు హోమ్‌ లోన్‌ను పొందలేరు. రుణదాతలు నిర్దేశించిన అర్హత ప్రమాణాల (ఎలిజిబిలిటీ స్టాండర్డ్స్‌) ప్రకారం లేని దరఖాస్తులను సంస్థలు తిరస్కరిస్తాయి. ఇలాంటప్పుడు కో అప్లికెంట్ లేదా సహ దరఖాస్తుదారుల వల్ల లబ్ధి పొందవచ్చు. ఒకరికంటే ఎక్కువమంది కలిసి జాయింట్ హోమ్ లోన్‌ తీసుకోవచ్చు. దీనివల్ల కొన్ని లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి. జాయింట్ హోమ్ లోన్‌ వల్ల కలిగే లాభనష్టాలను పరిశీలిద్దాం.

జాయింట్ హోమ్ లోన్‌తో లాభాలు

ఎక్కువ లోన్ పొందవచ్చు

ఇతరులతో కలిసి జాయింట్ హోమ్ లోన్ తీసుకున్నప్పుడు రుణ అర్హత (loan eligibility) పెరుగుతుంది. తగినంత ఆదాయం లేకపోవడం, తక్కువ క్రెడిట్ స్కోరు, క్రెడిట్ ప్రొఫైల్ సరిగ్గా లేకపోవడం, తక్కువ ఈఎమ్ఐ(EMI) ఆప్షన్ వంటి కారణాలతో కొన్నిసార్లు సంస్థలు హోమ్ లోన్ అప్లికేషన్‌ను తిరస్కరించవచ్చు. అలాంటి సందర్భాల్లో కో అప్లికెంట్ ద్వారా జాయింట్ హోమ్‌ లోన్ తీసుకోవచ్చు. సహ దరఖాస్తుదారుల ఆదాయ వనరులు, క్రెడిట్ ప్రొఫైల్‌ కారణంగా మొత్తం లోన్ అర్హత పెరుగుతుంది. సాధారణంగా కో అప్లికెంట్‌పై కూడా లోన్‌ తిరిగి చెల్లించే బాధ్యత సమానంగా ఉంటుంది. ఇది రుణదాతకు క్రెడిట్ రిస్క్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా హోమ్‌ లోన్‌ అవకాశాలు పెరుగుతాయి. ఈఎమ్ఐలను ఎంచుకునేటప్పుడు కో అప్లికెంట్ ఆదాయాన్ని కూడా రుణదాతలు పరిగణనలోకి తీసుకుంటాయి. అందువల్ల జాయింట్ హోమ్‌ లోన్‌లో పెద్ద మొత్తాన్ని లోన్ అమౌంట్‌గా పొందవచ్చు.

ఎక్కువ ట్యాక్స్ మినహాయింపు

సెక్షన్ 24b ప్రకారం హోమ్ లోన్‌ వడ్డీని తిరిగి చెల్లించేటప్పుడు రూ.2 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80C ప్రకారం అసలును తిరిగి చెల్లించేటప్పుడు ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. జాయింట్ హోమ్‌ లోన్‌ విషయంలో సహ దరఖాస్తుదారులు అందరూ విడివిడిగా ఈ ట్యాక్స్ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కో అప్లికెంట్‌గా ఉన్నవారు సంబంధిత ఆస్తికి సహ యజమానులుగా ఉంటేనే ఈ అదనపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.

మహిళలకు తక్కువ వడ్డీ

జాయింట్ హోమ్‌ లోన్‌లో భాగంగా ఉండే మహిళలకు తక్కువ వడ్డీరేట్లు వర్తిస్తాయి. చాలా సంస్థలు మహిళా సహ దరఖాస్తుదారులకు హోమ్ లోన్ వడ్డీ రేట్లపై రాయితీలను అందిస్తున్నాయి. మగవారితో పోలిస్తే వీరు 5 bps వరకు తక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు. దీనివల్ల మొత్తం వడ్డీ ఖర్చులు కొంత వరకు తగ్గుతాయి. అందువల్ల మహిళలతో కలిసి జాయింట్ హోమ్ లోన్ తీసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

జాయింట్ హోమ్ లోన్‌తో నష్టాలు

క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం

జాయింట్ హోమ్ లోన్‌ను సకాలంలో తిరిగి చెల్లించే బాధ్యత సహ దరఖాస్తుదారులు అందరిపై ఉంటుంది. చెల్లింపుల విషయంలో ఆలస్యమైనా, డిఫాల్ట్‌గా మారినా.. సహ దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. దీంతో వీరు భవిష్యత్తులో ఇతర లోన్‌లు తీసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. క్రెడిట్ కార్డు అర్హతపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.

నియమాలతో ఇబ్బందులు

కొన్ని సంస్థలు జీవిత భాగస్వామి లేదా రక్తసంబంధీకులకు మాత్రమే జాయింట్ హోమ్ లోన్‌ను మంజూరు చేస్తాయి. ఈ విషయంలో వివిధ సంస్థలు విభిన్నమైన నియమ నిబంధనలు, షరతులు విధిస్తాయి. కొన్ని సంస్థలు తోబుట్టువులు లేదా అవివాహితులైన భాగస్వాములకు జాయింట్ హోమ్ లోన్‌ను తిరస్కరిస్తాయి. ఇది దరఖాస్తుదారులకు సమస్యగా మారుతుంది. దీంతోపాటు సంబంధిత ఆస్తికి సహ యాజమానులుగా ఉన్నవారు అందరూ కలిసి జాయింట్ హోమ్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

First published:

Tags: Home loan

ఉత్తమ కథలు