Home Loan: హోం లోన్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే బోలెడు లాభాలు

కనీసం 15-20 ఏళ్ల పాటు దీర్ఘకాలం వాయిదాలు (EMI) చెల్లించాల్సిన గృహ రుణం (home loan) బరువు తగ్గించుకునే ఉపాయాలు (ideas) చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది గృహ రుణం బదిలీ అంటే హోం లోన్ స్విచ్చింగ్ (switching) అంటారు.

news18-telugu
Updated: November 26, 2020, 11:42 AM IST
Home Loan: హోం లోన్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే బోలెడు లాభాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కనీసం 15-20 ఏళ్ల పాటు దీర్ఘకాలం వాయిదాలు (EMI) చెల్లించాల్సిన గృహ రుణం (home loan) బరువు తగ్గించుకునే ఉపాయాలు (ideas) చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది గృహ రుణం బదిలీ అంటే హోం లోన్ స్విచ్చింగ్ (switching) అంటారు. బోలెడంత పరిశోధన చేసి విచారించి మీరు ఏదో బ్యాంకులో హోం లోన్ తీసుకున్నారనుకోండి, సవరణలో భాగంగా మరో బ్యాంకులో హోం లోన్ పై తక్కువ వడ్డీ రేటు (interest rate)ఆఫర్ చేస్తుంటే బాధపడాల్సిన పనేమీ లేదు. జస్ట్ ఓ 15 రోజులపాటు మీరు ఓపిక చేసుకుని కొన్ని ఫార్మాలిటీలు పూర్తి చేయగలిగితే తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుకు మీ హోం లోన్ ను బదిలీ (transfer) చేసేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా పక్కా పేపర్ వర్కు ఉండేలా చూసుకోవటమే. ఇలా చేస్తే లక్షల్లో వడ్డీ చెల్లింపులను మీరు ఆదా చేసుకుని, త్వరగా హోం లోన్ తీర్చేసుకోవచ్చన్నమాట.

బ్యాంకు వడ్డీ రేట్లపై అవగాహన

ఇలా చేయాలంటే ముందు బ్యాంకు వడ్డీ రేట్లు, దీర్ఘ కాల రుణాలపై వసూలు చేసే వడ్డీలపై మీకు పూర్తి సమాచారం, అవగాహన ఉండితీరాల్సిందే. దీంతోపాటు అసలు ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటు వసూలు చేస్తోంది వంటి సంపూర్ణ సమాచారం ముందు సేకరించండి. అలాగే ఇలా లోన్ స్విచ్ చేసుకోవాలంటే పూర్తీ చేయాల్సిన ఫార్మాలిటీలు కూడా తెలుసుకోవాలి. హోం లోను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ అంటే అర్థం పాత లోన్ ఖాతాను పూర్తిగా ముగించి, కొత్తగా మరో బ్యాంకులో లోన్ తీసుకోవటం అని అర్థం. కొత్తగా మీరు తీసుకున్న లోన్ మొత్తాన్ని సులభ వాయిదాల్లో చెల్లిస్తూ పోతారు. కేవలం 0.75 శాతం వడ్డీ తగ్గినా 10-20 ఏళ్లపాటు చెల్లించే హోం లోన్ ఈఎంఐల్లో మీకు లక్షల రూపాయాల భారం తగ్గుతుందంటే ఈ నిర్ణయం మంచిదేగా.

నో అబ్జెక్షన్ సర్టిఫికేట్
ఇందుకు మీరు హోం లోన్ తీసుకున్న పాత బ్యాంకులో నో అబ్జెక్షన్ (NOC) తీసుకోవాలి. దీంతోపాటు మీరు బ్యాంకుకు ఎంత మొత్తం బాకీ ఉన్నారన్న వివరాలు కూడా బ్యాంకు వారు ఇస్తారు. మీరు లోన్ తీసుకోవాలనుకున్న బ్యాంక్ బ్రాంచ్ లో ఈ లోన్ అకౌంట్ స్టేట్మెంట్స్, రిజిస్టర్డ్ అగ్రీమెంట్ వంటివి సమర్పిస్తే, పాత రుణం తీరిపోయినట్టే. అప్పుడు మీకు కొత్త హోం లోన్ వస్తుంది. ఈ లోన్ మొత్తాన్ని పాత బ్యాంకుకు కట్టేస్తే, కొత్త ఈఎంఐలు మరో బ్యాంక్ (bank) లో మొదలవుతాయి.

ఫీజుల వాయింపు తప్పదు
ఇలా చేసే క్రమంలో కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీ, లీగల్ ఫీ, స్టాంప్ డ్యూటీ (stamp duty), ఎస్టిమేషన్ చార్జెస్ వంటి చాలా రకాల ఫీజులుంటాయి. కానీ తక్కువ వడ్డీ రేటుకే హోం లోన్ అందించే బ్యాంకుకు మారడం వల్ల మీకు వడ్డీ భారం తగ్గి, ఈఎంఐలు కలిసివస్తాయి. ఇలా హోం లోన్ ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్ కు మార్చుకోవాలంటే లోన్ తీసుకున్న మొదటి 1-5 సంవత్సరాల్లోనే మారటం మంచి నిర్ణయం. ఈ కారణంగా మీకు కనీసం 10-15 ఏళ్ల పాటు వడ్డీ బరువు తగ్గి, మంచి ఆర్థిక ఊరట లభిస్తుంది. ఇలాంటప్పుడు ఫీజులు భారం మోసినా వచ్చే నష్టం ఏం లేదు.

ఇదే బెస్ట్ టైం
హోం లోన్ తీసుకునేందుకు ఇదే అత్యుత్తమ సమయం. ఎందుకంటే ఇటు ప్రభుత్వ బ్యాంకులు అటు ప్రైవేటు బ్యాంకులు అన్నీ అత్యల్ప వడ్డీ వసూలు చేస్తూ హోం లోన్లు ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం 6.9-9శాతం మధ్య హోం లోన్ వడ్డీ ఉండటం ఊరిస్తున్న అంశం. గత 15 ఏళ్లలో ఇంత తక్కువ వడ్డీకి హోం లోన్లు ఎన్నడూ లభించకపోవటంతో కారుచౌకగా సొంత ఇంటి కలను సాకారం చేసుకునే సువర్ణావకాశం లభిస్తోంది.
Published by: Sumanth Kanukula
First published: November 26, 2020, 11:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading