LIC Policy: ఎల్ఐసీ పాలసీ సరెండర్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

LIC Policy Surrender | మూడేళ్లు పూర్తి ప్రీమియమ్స్ చెల్లించిన వారికే సరెండర్ వ్యాల్యూ వర్తిస్తుంది. అంటే మూడేళ్లు పూర్తి ప్రీమియం చెల్లించినవారు పాలసీ సరెండర్ చేస్తే వచ్చే మొత్తాన్నే సరెండర్ వ్యాల్యూ అంటారు.

news18-telugu
Updated: July 21, 2019, 10:20 AM IST
LIC Policy: ఎల్ఐసీ పాలసీ సరెండర్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
LIC Policy: ఎల్ఐసీ పాలసీ సరెండర్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు ఎల్ఐసీ పాలసీ తీసుకున్నారా? కొన్నాళ్లు ప్రీమియం చెల్లించి వదిలేశారా? లేదా ఇప్పుడు ఉన్న పాలసీని కొనసాగించడం ఇష్టం లేదా? అలాంటి పాలసీ సరెండర్ చేయొచ్చు. కనీసం మూడేళ్లు ప్రీమియం చెల్లించిన పాలసీలను సరెండర్ చేసే అవకాశం కల్పిస్తోంది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. పాలసీ సరెండర్ చేస్తే పెయిడ్ అప్ వ్యాల్యూ, సరెండర్ వ్యాల్యూ అని రెండు అంశాలు ఉంటాయి. పాలసీ సరెండర్ చేసేముందు వీటి గురించి తెలుసుకోవడం మంచిది. మూడేళ్లలోపే పాలసీ సరెండర్ చేస్తే ఎలాంటి సరెండర్ వ్యాల్యూ వర్తించదు. అందుకే పాలసీ సరెండర్ చేయకూడదని చెబుతుంటారు నిపుణులు. మూడేళ్లు పూర్తి ప్రీమియమ్స్ చెల్లించిన వారికే సరెండర్ వ్యాల్యూ వర్తిస్తుంది. అంటే మూడేళ్లు పూర్తి ప్రీమియం చెల్లించినవారు పాలసీ సరెండర్ చేస్తే వచ్చే మొత్తాన్నే సరెండర్ వ్యాల్యూ అంటారు.

పాలసీ సరెండర్ చేసేముందు ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మీరు 30 ఏళ్ల వయస్సులో 20 ఏళ్లకు రూ.5,00,000 ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకుంటే ప్రీమియం సుమారు రూ.27,000 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మీరు 20 ఏళ్లపాటు ఇదే ప్రీమియం చెల్లిస్తే చాలు. అదే మీరు మూడేళ్లు ప్రీమియం చెల్లించి, పాలసీ సరెండర్ చేసి, మరో రెండేళ్ల తర్వాత అదే పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కారణం మీ వయస్సే. అంటే మీరు 35 ఏళ్ల వయస్సులో 20 ఏళ్లకు రూ.5,00,000 ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకుంటే ప్రీమియం సుమారు రూ.30,000 వరకు చెల్లించాల్సి రావొచ్చు. అంటే మీ వయస్సు పెరిగితే ప్రీమియం కూడా పెరుగుతుంది. అందుకే పాలసీ సరెండర్ చేసే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది.

మీరు ఒక్కసారి పాలసీ సరెండర్ చేసినట్టైతే ఇక మీ పేరు మీద ఆ పాలసీ లేనట్టే. సరెండర్ చేసినప్పుడు మీరు చెల్లించిన మొత్తం తిరిగి రాదు. అందులో కొంత శాతం మాత్రమే వస్తుంది. సరెండర్ వ్యాల్యూ ఎంత అన్నది ప్రతీ పాలసీ బాండ్‌లో వివరిస్తుంది ఎల్ఐసీ. మీరు మూడేళ్ల తర్వాత మీ పాలసీని సరెండర్ చేస్తే అప్పటివరకు చెల్లించిన ప్రీమియంలో మీకు వచ్చేది 30 శాతమే. ఆ పాలసీ సరెండర్ వ్యాల్యూ అంతే. మళ్లీ ఇది మొదటి ఏడాది ప్రీమియంకు వర్తించదు. ఉదాహరణకు ఓ వ్యక్తి ఏడాదికి రూ.50,000 ప్రీమియం చొప్పున నాలుగేళ్లు చెల్లించారనుకుందాం. ఇప్పటివరకు చెల్లించిన ప్రీమియం రూ.2,00,000. పాలసీ సరెండర్ చేయాలనుకుంటే మొదటి ఏడాది ప్రీమియంను మినహాయించి సరెండర్ వ్యాల్యూ లెక్కిస్తారు. అంటే రూ.1,50,000 ప్రీమియంలో 30% అంటే రూ.45,000. పాలసీ సరెండర్ చేస్తే వచ్చేది రూ.45,000 మాత్రమే. అంటే రూ.2,00,000 ప్రీమియం, ట్యాక్సులు, టాప్ అప్స్ చెల్లిస్తే సరెండర్ చేసినప్పుడు రూ.45,000 వస్తాయి. మూడేళ్లు దాటి చెల్లించిన పాలసీలకు స్పెషల్ సరెండర్ వ్యాల్యూ ఉంటుంది. దాంట్లో మీకు 30 శాతం కన్నా ఎక్కువ రావచ్చు. మీరు మూడేళ్లు దాటి ఎన్నేళ్లు ఎక్కువ ప్రీమియం చెల్లిస్తే సరెండర్ వ్యాల్యూ అంత పెరుగుతుంది. ఏదేమైనా పాలసీ సరెండర్ చేస్తే నష్టపోక తప్పదు. రిస్క్ కవర్ కూడా ఉండదు.

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Save Battery: మీ ఫోన్ బ్యాటరీ ఆదా చేయడానికి ఈ టిప్స్ పాటించండిAadhaar-PAN: ఆధార్, పాన్ కార్డులో పేర్లు వేర్వేరుగా ఉన్నాయా? ఇలా చేయండి

Discount: ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే స్విగ్గీ, జొమాటోలో డిస్కౌంట్
Published by: Santhosh Kumar S
First published: July 21, 2019, 10:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading