Home /News /business /

WANT TO SELECT MUTUAL FUNDS WITH QUANTITATIVE FACTORS HERE ARE FOUR KEY RATIOS GH VB

Mutual Funds: మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలంటే.. కచ్చితంగా ఈ నాలుగు రేషియోలు తెలిసుండాలి.. అవేంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మ్యూచువల్ ఫండ్స్‌లో నేరుగా పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం, ఆ ఫండ్ గతంలో ప్రదర్శన, పనితీరును సరిపోల్చుకోవాలి. వీటి ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు సహాయపడేందుకు నాలుగు రేషియోలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

మ్యూచువల్ ఫండ్స్(Mutual funds)లో ఎన్నో పథకాలు ఉన్నాయి. ఇప్పటికే 1513 స్కీములు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ మరిన్ని జోడిస్తున్నారు. పెట్టుబడిదారులు(Investors) ఎంచుకోవడానికి చాలా ఆప్షన్లు(Options) ఉన్నాయి. వీటిని మార్గనిర్దేశం చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు(Advisers), డిస్ట్రిబ్యూటర్లు(Distributers) లాంటి ఎంతోమంది ఉన్నారు. కానీ మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో నేరుగా పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం, ఆ ఫండ్ గతంలో ప్రదర్శన, పనితీరును(Performance) సరిపోల్చుకోవాలి. వీటి ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు సహాయపడేందుకు నాలుగు రేషియోలు(Ratios) ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Multibagger Stocks: 2022లో ఈ రెండు స్టాక్స్‌తో అధిక రాబడులు.. షేర్ ఇండియా నిపుణుల జోస్యం..


స్టాండర్డ్ డీవియేషన్ (Standard deviation)
ఫండ్ ఎంత అస్థిరంగా ఉంటుందో స్టాండర్డ్ డీవియేషన్ కొలుస్తుంది. సరళంగా చెప్పాలంటే సగటు రాబడి నుంచి ఫండ్ రాబడుల వ్యాప్తిని ఇది అంచనా వేస్తుంది. సంప్రదాయ పెట్టుబడుల్లో ఈ స్కీమ్ బాగా ఉపకరిస్తుంది. కానీ ఫండ్ మేనేజర్ మరీ సంప్రదాయవాదిగా ఉంటే, అది ఓవర్ డైవర్సిఫికేషన్ లేదా అండర్ పర్ఫార్మెన్స్‌కు దారితీయవచ్చు. స్టాక్ మార్కెట్లలో వివిధ దశల్లో ఫండ్ ఎంత అస్థిరంగా మారుతుందో అర్థం చేసుకోవడానికి వివిధ కాలాల్లో స్టాండర్డ్ డీవియేషన్ ను చెక్ చేయండి. సగటు రాబడి నుంచి ప్రతికూల, సానుకూల రాబడి రెండింటినీ గుడ్డిగా పరిగణనలోకి తీసుకోవడం వల్ల అస్థిరతలను వేరు చేయకపోవడం ఈ విధానంలో ప్రధాన లోపం.

షార్ప్ రేషియో (Sharpe ratio)
ఫండ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో షార్ప్ రేషియో ద్వారా తెలుసుకోవచ్చు. షార్ట్ డేటెడ్ ప్రభుత్వ ట్రెజరీ బిల్లు లాంటి పెట్టుబడుల నుంచి రిస్క్ ఫ్రీ రిటర్న్స్ పై ఫండ్ సృష్టించిన అదనపు రాబడిని ఇది పరిశీలిస్తుంది. మీ ఫండ్ అధిక షార్ప్ రేషియోలో ఉన్నట్లయితే రిస్క్ కు తగినట్లుగా రాబడి ఉంటుంది. మిడ్, స్మాల్ క్యాపిటల్ ఫండ్స్ ఈ షార్ప్ రేషియోలను కలిగి ఉంటాయి.

బీటా (Beta)
బెంచ్ మార్క్ ఇండెక్స్ లో మీ ఫండ్ ఎంత రిస్కీలో ఉందో తెలుసుకోవాలనుకుంటే బీటా రేషియో ఉపయోగపడుతుంది. ఇది ఇండెక్స్ కంటే ఎక్కువ అస్థిరంగా ఉంటుంది. ఇది 1 ఫండ్ అయితే బెంచ్ మార్క్ సూచీ మాదిరిగానే రిస్క్ ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ వంటి నిష్క్రియాత్మకంగా నిర్వహించే అన్ని ఫండ్స్ బీటా- 1 కలిగి ఉంటాయి. బీటా ఒకటి కంటే తక్కువగా ఉంటే ఫండ్ దాని బెంచ్‌మార్క్ ఇండెక్స్ కంటే తక్కువ అస్థిరతను కలిగి ఉందని అర్థం చేసుకోవాలి.

Scholarships: ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం యూజీసీ నాలుగు కొత్త స్కాలర్​షిప్స్​.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలివే..


పోర్ట్ ఫోలియో టర్నోవర్ (Portfolio turnover)
రెగ్యూలర్‌గా మీ ఫండ్ మేనేజర్ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తారు, విక్రయిస్తారు. అయితే వారు ఎక్కువగా క్రయ, విక్రయాలు చేస్తున్నారా లేదా ఎంపిక చేస్తూ అనుసరిస్తున్నారా అనే విషయం తెలుసుకోవాలి. పోర్ట్ ఫోలియో రేషియోను ఫండ్ మేనేజర్ ఏ విధంగా నిర్వహిస్తున్నారనేది పోర్ట్ ఫోలియో టర్నోవర్ రేషియో ద్వారా కొలుస్తారు. సాధారణంగా ఇది ఒక సంవత్సరం కాల వ్యవధికి ఉంటుంది. తక్కువ టర్నోవర్ రేషియో అంటే ఫండ్ మేనేజర్ బై అండ్ హోల్డ్ అనే వ్యూహాన్ని అనుసరిస్తారు. అధిక టర్నోవర్ రేషియోలో క్రమం తప్పకుండా లాభాలను తీసుకోడానికి ప్రాధాన్యత ఇస్తారు.
Published by:Veera Babu
First published:

Tags: Mutual Funds

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు