Save Money: రూ.1 కోటి పొదుపు చేయడానికి 6 స్టెప్స్

Save Money | రిస్క్ ఎక్కువగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే నెలకు రూ.500-రూ.1000 ప్లాన్స్ ఎంచుకోండి. ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నా రిస్క్ ఎంతుంటుందో ముందే అంచనా వేయండి.

news18-telugu
Updated: March 16, 2019, 9:14 AM IST
Save Money: రూ.1 కోటి పొదుపు చేయడానికి 6 స్టెప్స్
Save Money: రూ.1 కోటి పొదుపు చేయడానికి 6 స్టెప్స్
  • Share this:
డబ్బు సంపాదించడం ఎవరికి ఇష్టం ఉండదు? డబ్బు సంపాదించడం, పొదుపు చేయడం ఓ కళ. మరి మీరూ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అతి తక్కువ సమయంలో రూ. 1 కోటి పొదుపు చేయాలనుకుంటున్నారా? ఫైనాన్షియల్ ప్లానింగ్ చక్కగా చేసుకుంటే ఇది సాధ్యమే. 20 ఏళ్ల వయస్సు నుంచే డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే మంచిదని చెబుతుంటారు నిపుణులు. కారణం... అప్పటికీ పెళ్లి జరగదు కాబట్టి కుటుంబ బాధ్యతలు పెద్దగా ఉండవు. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయొచ్చు. పొదుపు కూడా చేయొచ్చు. యువతీయువకులు తమ సంపాదనలో 30-50% పొదుపు చేయడం మంచిది. పొదుపు చేయగా మిగిలిన డబ్బు తోనే నెలవారీ ఖర్చులు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు ప్లాన్ చేసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ పొదుపు చేయాలంటే ఈ 6 స్టెప్స్ ఫాలో అవండి.

Read this: YouTube Music: మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్... యూట్యూబ్ మ్యూజిక్ వచ్చేసింది

save money, money saving tips, investment plans, tax saving, personal finance, financial tips, డబ్బు పొదుపు, డబ్బు ఆదాకు మార్గాలు, సేవ్ మనీ, మనీ సేవింగ్ టిప్స్, ఇన్వెస్ట్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్
(ప్రతీకాత్మక చిత్రం)


1. రిస్క్ ఉన్న చోట ఇన్వెస్ట్ చేయొద్దు




అప్పుడప్పుడే సంపాదన మొదలుపెట్టే యువతీయువకులు తమ సంపాదనను పెట్టుబడిగా పెట్టేందుకు వేర్వేరు మార్గాలు ఎంచుకుంటారు. రిటర్న్స్ ఎక్కువగా ఉండాలని దూకుడుగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. స్టాక్ మార్కెట్, బిట్ కాయిన్స్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోయినవాళ్లు ఉన్నారు. మీరూ అలాంటి తప్పులు చేయకుండా సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, ఈఎల్ఎస్ఎస్ లాంటివి ఎంచుకోవాలి. మొత్తం ఒకే స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయకుండా రెండు మూడు రిస్క్ లేని ఆప్షన్స్ ఎంచుకోవాలి. రిస్క్ ఎక్కువగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే నెలకు రూ.500-రూ.1000 ప్లాన్స్ ఎంచుకోండి. ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నా రిస్క్ ఎంతుంటుందో ముందే అంచనా వేయండి.

Read this: Alert: కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తున్నారా? మోసపోతారు జాగ్రత్త

save money, money saving tips, investment plans, tax saving, personal finance, financial tips, డబ్బు పొదుపు, డబ్బు ఆదాకు మార్గాలు, సేవ్ మనీ, మనీ సేవింగ్ టిప్స్, ఇన్వెస్ట్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్
(ప్రతీకాత్మక చిత్రం)
Loading...

2. ఖర్చుల విషయంలో జాగ్రత్త


అసలు పొదుపు ఎప్పుడు మొదలుపెట్టాలి? ఎలా మొదలుపెట్టాలి? ఉద్యోగం వచ్చిన తర్వాతా... లేక ముందే పొదుపు చేయాలా? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్స్ గోల్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇలా అనేక అనుమానాలుంటాయి. కొత్తగా సంపాదన మొదలుపెట్టినప్పుడు చేతిలో డబ్బులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువగానే ఖర్చులు చేస్తారు. అయితే మొదటి రోజు నుంచే ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. మీరు పొదుపు చేసే ప్రతీ రూపాయి మీ సంపాదనతో సమానం. మీ సంపాదనలో 50 శాతమే మీ ఖర్చులకు ఉపయోగించాలి. 20 శాతం షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్‌ అంటే అవసరానికి చేతికి డబ్బులు అందేలా పొదుపు చేయాలి. మిగతా 30 శాతం లాంగ్ టర్మ్ గోల్స్ అంటే పిల్లలు, వారి చదువులు, రిటైర్మెంట్, ఆస్తుల్లాంటి వాటికి ఇన్వెస్ట్ చేయాలి.

Read this: Facebook: మీ ఫేస్‌బుక్ ఎక్కడెక్కడ లాగిన్ చేశారో తెలుసా? హ్యాక్ అయితే ఇలా చేయండి

save money, money saving tips, investment plans, tax saving, personal finance, financial tips, డబ్బు పొదుపు, డబ్బు ఆదాకు మార్గాలు, సేవ్ మనీ, మనీ సేవింగ్ టిప్స్, ఇన్వెస్ట్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్
(ప్రతీకాత్మక చిత్రం)

3. ఫైనాన్షియల్ ప్లానింగ్ తప్పనిసరి


నెలకు 50 శాతం ఖర్చు మాత్రమే చేసి మిగతా 50 శాతం పొదుపు చేయాలంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ తప్పనిసరి. ఓ ఆరు నెలల పాటు మీరు ఉద్యోగం చేయకపోయినా మీ ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. రిస్క్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ కూడా తప్పనిసరి.

4. మీ ఆదాయాన్ని బట్టి ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి


ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలన్న సందేహాలు కూడా ఉంటాయి. మీ ఆదాయం పెరిగినప్పుడు విలాసాలకు ఖర్చు చేయకుండా పెరిగిన ఆదాయాన్ని పెట్టుబడిగా మార్చాలి. ప్రతీ ఏడాది ఇంక్రిమెంట్ ఉంటుంది కాబట్టి అందులోంచి కొంత ఇన్వెస్ట్‌మెంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయండి. దీని ద్వారా మీ లక్ష్యాన్ని ఇంకా త్వరగా చేరుకోవచ్చు. ఇందుకోసం స్టెప్-అప్ సిప్ తీసుకోవడం మంచిది. స్టెప్-అప్ సిప్ ఎలా పనిచేస్తుందో ఈ చార్ట్ చూడండి.

save money, money saving tips, investment plans, tax saving, personal finance, financial tips, డబ్బు పొదుపు, డబ్బు ఆదాకు మార్గాలు, సేవ్ మనీ, మనీ సేవింగ్ టిప్స్, ఇన్వెస్ట్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్

5. ఎడ్యుకేషన్ లోన్ కట్టాలా? ఇన్వెస్ట్ చేయాలా?


ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదువు పూర్తి చేసేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే ఎడ్యుకేషన్ లోన్ చెల్లించేప్పుడు ఆదాయంలో చాలా భాగం ఈఎంఐకు వెళ్లిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో పొదుపు, ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కష్టం. అయితే ఎడ్యుకేషన్ లోన్ చెల్లించేందుకు రెండో ఆదాయ మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం. లేదా వార్షికంగా వచ్చే బోనస్‌తో ఎడ్యుకేషన్ లోన్ చెల్లించాలి.

save money, money saving tips, investment plans, tax saving, personal finance, financial tips, డబ్బు పొదుపు, డబ్బు ఆదాకు మార్గాలు, సేవ్ మనీ, మనీ సేవింగ్ టిప్స్, ఇన్వెస్ట్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్
(ప్రతీకాత్మక చిత్రం)

6. మీ రిటైర్‌మెంట్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ త్వరగా మొదలుపెట్టాలి


ఆదాయం వస్తున్నంత వరకు ఖర్చులకు ఇబ్బందే ఉండదు. కానీ ఒక్కసారి ఇన్‌కమ్ ఆగిపోతే ఇబ్బందులు తెలుస్తాయి. అందుకే రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాలం గడపాలంటే వీలైనంత ముందుగానే పొదుపు చేయడం మొదలుపెట్టాలి. ఉదాహరణకు నెలకు రూ.10,000 చొప్పున 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 12% చక్రవడ్డీ కింద రూ.1 కోటి రిటర్న్స్ వస్తాయి. అంటే 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు పొదుపు చేస్తే రూ.1 కోటి మీ అకౌంట్‌లో ఉంటుంది. అదే 30 ఏళ్ల వయస్సు నుంచి 30 ఏళ్ల పాటు పొదుపు చేస్తే రూ.3.5 కోట్లు మీ అకౌంట్‌లో ఉంటాయి. అంటే... 10 ఏళ్లు ముందుగా పొదుపు మొదలుపెట్టినందుకు అదనంగా రూ.2.5 కోట్లు మీవే.

Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్

ఇవి కూడా చదవండి:

SBI Doorstep Banking: ఇంటికి వచ్చి సేవలు అందించే ఎస్‌బీఐ సిబ్బంది

PAN Card: మీ దగ్గర రెండో పాన్ కార్డ్ ఉందా? ఇలా సరెండర్ చేయండి

GB WhatsApp: మీ జీబీ వాట్సప్ బ్లాక్ అయిందా? ఇలా చేయండి

RRB Level 1 Notification: రైల్వేలో 1,03,769 పోస్టులకు మొదలైన రిజిస్ట్రేషన్... ఇలా అప్లై చేయండి
First published: March 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...