ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌తో పన్ను ఆదా... ఎలా?

పన్ను ఆదా చేయడం విషయంలో చాలామంది ముందు నుంచి సరిగ్గా ప్లాన్ చేసుకోరు. మార్చి వచ్చేసరికి కంగారుపడుతుంటారు. మీరు సరిగ్గా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ తప్పులు చేయొద్దు. హడావుడిగా ఏదో ఓ ఫండ్‌ ఎంచుకోవద్దు. అందుకే ముందే కాస్త ఆచితూచి పెట్టుబడి పెట్టడం మంచిది.

news18-telugu
Updated: January 3, 2019, 5:54 PM IST
ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌తో పన్ను ఆదా... ఎలా?
పన్ను ఆదా చేయడం విషయంలో చాలామంది ముందు నుంచి సరిగ్గా ప్లాన్ చేసుకోరు. మార్చి వచ్చేసరికి కంగారుపడుతుంటారు. మీరు సరిగ్గా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ తప్పులు చేయొద్దు. హడావుడిగా ఏదో ఓ ఫండ్‌ ఎంచుకోవద్దు. అందుకే ముందే కాస్త ఆచితూచి పెట్టుబడి పెట్టడం మంచిది.
  • Share this:
పన్ను ఆదా చేయడం ఓ పెద్ద సవాల్. ఎన్ని రకాలుగా లెక్కలేసినా ఎంతోకొంత పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్) లాంటి ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ ట్యాక్స్‌పేయర్స్‌ని ఆదుకుంటూ ఉంటాయి. ఇటీవల వీటికి డిమాండ్ పెరుగుతోంది. దీర్ఘకాలంలో వీటిపై రెండు అంకెల లాభాలు పొందే అవకాశం ఉంటుంది. పన్ను ఆదా చేయడానికి ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్‌ ఎందుకు ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం

ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో గత ఐదేళ్లలో వార్షికంగా 11.2 శాతం వృద్ధి కనిపించింది. చాలామంది ఇన్వెస్టర్లు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2018 ఏప్రిల్ 30 వరకు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా లెక్కలు చూస్తే రూ.85,804 కోట్లు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టినట్టు తేలింది. అంతకుముందు ఏడాది అది రూ.63,799 కోట్లు మాత్రమే. పీపీఎఫ్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ లాంటి వాటితో పోలిస్తే ఈఎల్ఎస్ఎస్‌లో రిటర్న్స్ కూడా అధికమే. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మీరు దీర్ఘకాలంలో రెండంకెల రిటర్న్స్ ఆశిస్తే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ట్రై చేయొచ్చు.

చివరి నిమిషంలో కంగారు వద్దు
పన్ను ఆదా చేయడం విషయంలో చాలామంది ముందు నుంచి సరిగ్గా ప్లాన్ చేసుకోరు. మార్చి వచ్చేసరికి కంగారుపడుతుంటారు. మీరు సరిగ్గా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ తప్పులు చేయొద్దు. హడావుడిగా ఏదో ఓ ఫండ్‌ ఎంచుకోవద్దు. అందుకే ముందే కాస్త ఆచితూచి పెట్టుబడి పెట్టడం మంచిది.

సిప్ ఎంచుకోవచ్చు
ఆర్థిక సంవత్సరం చివర్లో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడం కన్నా ముందు నుంచే సిస్టమెటి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) ఎంచుకోవడం మంచిది. ప్రతీ నెల కొంత డబ్బును పొదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఏడాది ముందుగానే మొదలుపెడితే మీ చేతిలో చాలా సమయం కూడా ఉంటుంది.

సరైన పథకం ఎంచుకోండి
దీర్ఘకాలం పెట్టుబడి పెట్టి, సంపద సృష్టించాలనుకుంటే మీరు కాస్త పరిశోధన చేసి మంచి స్కీమ్ ఎంచుకోవడం మంచిది. ఏ ఫండ్ అయినా గత ప్రదర్శనను పరిశీలించాలి. గత ప్రదర్శనలాగే భవిష్యత్తులో ఉన్నా లేకపోయినా ఈ అంశాన్ని విస్మరించొద్దు. పెట్టుబడి వ్యూహం, పోర్ట్‌ఫోలియో కూర్పు ఎలా ఉందో చూడాలి. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ఫండ్ ఎంపిక చేసుకోవాలి.

అస్థిరత నుంచి ప్రయోజనం
మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు జంకుతుంటారు. మీరు మంచి స్కీమ్ తీసుకోవడానికి ఇదే మంచి సమయం అన్నది నిపుణుల అభిప్రాయం.

ఇవి కూడా చదవండి:

2019లో ట్యాక్స్ సేవింగ్ ఐడియాలు ఇవే... ఇప్పుడే జాగ్రత్తపడండి

2018లో మారిన పర్సనల్ ట్యాక్స్ రూల్స్ ఇవే... తెలుసుకోండి

IRCTC వెబ్‌సైట్ మారింది... కొత్త ఫీచర్లు ఇవే

మ్యూచువల్ ఫండ్ తీసుకుంటున్నారా? ఈ 5 అంశాలు పరిశీలించండి
Published by: Santhosh Kumar S
First published: January 1, 2019, 12:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading