Mutual Funds: రిటైర్ అయ్యే నాటికి మీకు రూ.5 కోట్లు కావాలా...అయితే ఇలా చేయండి...

(ప్రతీకాత్మక చిత్రం)

వ్యాపారాలు, స్టార్టప్‌ల కోసం 45 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేయాలనుకున్న వారికి ఎలాంటి పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.

  • Share this:
దీర్ఘకాలంలో అందే రాబడి కోసం చేసే పెట్టుబడుల్లో మ్యూచువల్ ఫండ్స్ మంచి ఫలితాలను ఇస్తాయి. రిటైర్‌మెంట్‌ను దృష్టి పెట్టుకొని వీటిల్లో పెట్టుబడులు చేయడం మంచి విషయమని నిపుణులు చెబుతున్నారు. మొదటిసారి ఉద్యోగంలో చేరినప్పటి నుంచే.. వ్యాపారాలు, స్టార్టప్‌ల కోసం 45 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేయాలనుకున్న వారికి ఎలాంటి పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.
కొత్తగా ఉద్యోగంలో చేరిన సుమన్ అనే వ్యక్తి.. రిటైర్‌మెంట్‌ తరువాత చేయాల్సిన వ్యాపారానికి పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నాడు అనుకుందాం. సుమారు రూ.1 నుంచి 1.35 లక్షల జీతం అతడికి వస్తుందనుకుందాం. ఇప్పటికే సుమన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో రూ.15 లక్షలు సిప్‌ చేశాడు. ప్రస్తుత మార్కెట్ రేటు, పరిస్థితుల ప్రకారం.. హోమ్‌ లోన్‌ లోన్ రూ.40 లక్షలు, దీనికి వడ్డీ 7.15 శాతం అనుకుందాం. ఈ ఖర్చులన్నీ పోనూ, రూ.5 కోట్ల రిటైర్‌మెంట్ కార్పస్‌ కూడబెట్టుకోవడానికి అతడి ముందున్న మార్గాలేంటో చూద్దాం.

సుమన్ తన హోమ్‌ లోన్‌ను 15 ఏళ్లలో తిరిగి చెల్లించాలనుకుంటే.. అతడు సుమారు రూ.36,289 ఈఎంఐ చెల్లించాలి. జీతంలో నెలవారీ ఖర్చులు 30 శాతం వరకు ఉన్నాయి అనుకుంటే.. అతడు ప్రతి నెలా రూ.58,711 మిగిల్చే అవకాశం ఉంది. ఇందులో ప్రతి నెలా రూ.11,000 చొప్పున ఐదు వేర్వేరు మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేయవచ్చు. వీటి ద్వారా అతడు సంవత్సరానికి 12 శాతం రాబడిని ఊహిస్తే.. రూ.2.75 కోట్లు కార్పస్ ఫండ్ జమ చేయవచ్చు. ఒకవేళ రాబడి పది శాతం ఉంటే.. 45 సంవత్సరాలు వచ్చే వరకు అతడు సిప్‌ల ద్వారా చేసిన పెట్టుబడుల నుంచి రూ.2.28 కోట్లు సంపాదించవచ్చు.

ప్రస్తుతం అతడు చేసిన రూ.15 లక్షల ప్రస్తుత మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు 12 శాతం రాబడి వస్తే.. ఈ మొత్తం రూ.90 లక్షలకు చేరుకుంటుంది. ఇకవేళ 10 శాతం రాబడి మాత్రమే వస్తే.. కార్పస్ రూ.66.80 లక్షలకు పెరుగుతుంది. ఈ మొత్తం చూస్తే.. 45 సంవత్సరాలు వచ్చేసరికి సుమన్ సేకరించగలిగే మొత్తం రూ.3.65 కోట్లు (12 శాతం రాబడి) లేదా రూ.2.95 కోట్లు (10 శాతం రాబడి) వరకు ఉంటుంది. అతడి జీతం ప్రకారం చూస్తే.. 45 ఏళ్లలో రూ.5 కోట్లు కార్పస్ కూడబెట్టే అవకాశం లేదు.

కానీ మ్యూచువల్ ఫండ్‌ల నుంచి వచ్చే రిటర్న్‌ 15 శాతంగా ఉంటే, సుమన్ రూ.5 కోట్ల కార్పస్‌ ఫండ్‌ను కూడబెట్టడం సాధ్యమవుతుంది. ఈ లెక్కన అతడి సిప్ రూ.3.72 కోట్లకు పెరుగుతుంది. ప్రస్తుత మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు రూ.1.40 కోట్లకు పెరుగుతాయి. ఒకవేళ సుమన్ ప్రతి సంవత్సరం SIP మొత్తాన్ని 10 శాతం పెంచుకుంటూ పోతే, తన లక్ష్యాన్ని సాధించగలడు. ఈ రెండింట్లో.. మొదటి ఆప్షన్‌ ద్వారా కార్పస్ ఫండ్ జమ అయ్యే అవకాశం చాలా తక్కువ. కానీ అతడు పెట్టుబడులను ప్రతి సంవత్సరం 10 శాతం పెంచలేకపోతే, తన పదవీ విరమణ వయసు టార్గెట్‌ను 48 ఏళ్లుగా పెట్టుకోవాలి. ఈ సందర్భంలో సుమన్ రూ.5 కోట్ల కార్పస్‌ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు.
Published by:Krishna Adithya
First published: