హోమ్ /వార్తలు /బిజినెస్ /

Starlink: త్వరలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్.. ప్రీ రిజర్వేషన్ కోసం ఇలా చేయండి..

Starlink: త్వరలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్.. ప్రీ రిజర్వేషన్ కోసం ఇలా చేయండి..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌లు 2022 నుంచి భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్పీడ్‌టెస్ట్ యాప్ సంస్థ ఓక్లా.. స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ వేగంపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఇంకా చదవండి ...

భారతదేశంలో మరో కొత్తరకం ఇంటర్నెట్ ప్రొవైడర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్‌ కల్పించే సంస్థలను మనం చూశాం. త్వరలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు సైతం అందుబాటులోకి రానున్నాయి. స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌లు 2022 నుంచి భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్పీడ్‌టెస్ట్ యాప్ సంస్థ ఓక్లా.. స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ వేగంపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ స్పీడ్.. వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌తో సమానంగా ఉందని ఓక్లా వెల్లడించింది. కొన్ని దేశాలలో వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ సగటులతో పోలిస్తే.. స్టార్‌లింక్ ఇంటర్నెట్ స్పీడ్ అధికంగా ఉందని ఓక్లా డేటా సూచిస్తోంది.

కొత్త ఉపగ్రహాలతో పాటు నెట్‌వర్క్‌ల ఆప్టిమైజేషన్‌ల ద్వారా ప్రపంచంలోని ప్రతిమూలకూ స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడానికి స్టార్‌లింక్ సంస్థ శరవేగంగా పనిచేస్తోంది. దీన్నిబట్టి త్వరలోనే భారతదేశంలో స్టార్‌లింక్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ఒక్క జులై నెలలోనే స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను 20 వేలు మంది తీసుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య 90,000 దాటింది. ఈ నేపథ్యంలో ఓక్లా డేటా కంపెనీ.. స్టార్‌లింక్ స్పీడ్ కు సంబంధించిన డేటా విడుదల చేసింది.

అయితే స్పీడ్‌టెస్ట్ ఇంటెలిజెన్స్ ప్రకారం.. యూఎస్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సగటు డౌన్‌లోడ్ వేగం 97.23Mbps కాగా.. అప్‌లోడ్ వేగం 13.89Mbps గా ఉంది. యూఎస్‌లో వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సగటు డౌన్‌లోడ్ వేగం 115.22Mbps కాగా.. అప్‌లోడ్‌ల వేగం 17.18Mbps. దీన్నిబట్టి శాటిలైట్, వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ల వేగం దాదాపు సమానంగా ఉందని తెలుస్తోంది.

గ్లోబల్ శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ అయిన హ్యూస్‌నెట్ సగటు డౌన్‌లోడ్ వేగం 19.73Mbps కాగా.. వయాశాట్ డౌన్‌లోడ్ వేగం 18.13Mbps మాత్రమే ఉండటం గమనార్హం. అమెరికా కాకుండా ఇతర దేశాల్లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ ఇంకా ఎక్కువగా ఉందట. భారతదేశంలో అందుబాటులోకి రాకముందే.. వినియోగదారులందరికీ 300Mbps వేగంతో ఇంటర్నెట్ సేవలు అందిస్తామని కంపెనీ హామీ ఇవ్వడం శుభవార్తగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో వంటి హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు 30Mbps - 1Gbps స్పీడ్‌ల మధ్య మాత్రమే ప్లాన్‌లను అందిస్తున్నాయి.

నెల రోజుల క్రితమే ఎలాన్ మస్క్ సొంత కంపెనీ అయిన స్టార్‌లింక్ 5 వారాల్లో గ్లోబల్ సాటిలైట్ కవరేజీని పూర్తి చేస్తామని తెలిపింది. ఈ గడువు త్వరలోనే పూర్తి కానుంది. 2022నాటికి యూజర్లకు 300Mbps వేగంతో.. 25ms లేటెన్సీతో సేవలు అందిస్తామని స్టార్‌లింక్ వెల్లడించింది. ప్రస్తుతం స్టార్‌లింక్ యూజర్లు 50Mbps- 150Mbps వేగంతో 20ms వరకు లేటెన్సీని ఆస్వాదిస్తున్నారు. స్టార్‌లింక్ కనెక్షన్ తీసుకోవాలనుకునే ఇండియన్స్ కోసం ప్రీ-రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయులు 99 డాలర్లు (రూ. 7,300) చెల్లించి స్టార్‌లింక్ ఇంటర్నెట్ కనెక్షన్‌ని రిజర్వు చేయొచ్చు.

First published:

Tags: Business

ఉత్తమ కథలు