WANT TO OPEN MULTIPLE BANK ACCOUNTS IS ANY CHANCE TO OPEN MULTIPLE ACCOUNTS KNOW FULL DETAILS HERE GH VB
Multiple Saving Accounts: మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ తెరవాలనుకుంటున్నారా.. అయితే వీటిపై ఓ లుక్కేయండి!
ప్రతీకాత్మక చిత్రం
ఇటీవల కాలంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు విస్తృతమయ్యాయి. వివిధ బ్యాంకుల్లో మల్టిపుల్ సేవింగ్ ఖాతాలను తెరవడానికి కస్టమర్లకు అవకాశం ఉంది. మల్టిపుల్ సేవింగ్ అకౌంట్స్ ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ఇటీవల కాలంలో డిజిటల్ బ్యాంకింగ్(Digital Banking) సేవలు విస్తృతమయ్యాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచే ఆన్లైన్(Online) ద్వారా లేదా మొబైల్ యాప్‌ల(Mobile App) ద్వారా ఆర్థిక లావాదేవీలను నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు. అంతేకాకుండా పొదుపు ఖాతాలను కూడా ఈజీగా తెరవ గలుగుతారు. ఒక వ్యక్తి సేవింగ్ అకౌంట్స్(Saving Accounts) కోసం ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీడియో ద్వారా KYCని పూర్తి చేసి నిమిషాల వ్యవధిలో ఖాతాను తెరవవచ్చు. ఈ సౌలభ్యం కారణంగా వివిధ బ్యాంకుల్లో మల్టిపుల్(Multiple) సేవింగ్ ఖాతాలను తెరవడానికి కస్టమర్లకు అవకాశం ఉంది. మల్టిపుల్ సేవింగ్ అకౌంట్స్(Accounts) ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రోత్సాహకాలు- ప్రయోజనాలు
మల్టిపుల్ లాకర్స్, ఇన్సూరెన్స్, ప్రీమియం డెబిట్ కార్డ్‌లు వంటి ఫీచర్లను ఒక ఖతాదారుడు ఉపయోగించుకోవడానికి కూడా చాలా బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. అదనంగా ఖాతాదారులు యుటిలిటీ చెల్లింపులు, షాపింగ్, EMIలు చెల్లించినప్పుడు రివార్డ్‌లు, డిస్కౌంట్లను పొందుతారు. దీంతో మల్టిపుల్ ఖాతాలు ఉండటం వలన ఖర్చు చేసేటప్పుడు పొదుపును కూడా పెంచుకోవచ్చు.
ఈజీ యాక్సెస్
బ్యాంకులు ప్రతి నెలా ATMల నుండి ఉచిత విత్ డ్రాయల్ల సంఖ్యను పరిమితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్టిపుల్ అకౌంట్స్ ఇతర ATMల నుంచి లావాదేవీలు చేయడానికి, సంబంధిత ఛార్జీలపై ఆదా చేయడానికి అనుమతిస్తాయి. తరచుగా ATMలను ఉపయోగించే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రత్యేక లక్ష్యాలకు- అకౌంట్లు
విదేశీ ప్రయాణం, వాహనం కొనుగోలు, ఉన్నత విద్య వంటి లక్ష్యాలను చేరుకోవడానికి చాలా మంది వ్యక్తులు వివిధ పొదుపు ఖాతాలలో డబ్బును జమ చేస్తారు. కొందరు రోజువారీ ఖర్చుల కోసం కుటుంబ సభ్యులతో ఉమ్మడి ఖాతాలను తెరుస్తారు. మరికొంత మంది ఆకస్మిక లేదా అత్యవసర నిధిగా ప్రత్యేక ఖాతాను తెరుస్తుంటారు.
బ్యాంకింగ్ పార్టనర్ ప్రయోజనాలు
వివిధ ఆన్లైన్, ఇ-కామర్స్ పోర్టల్‌లు తమ కస్టమర్లకు ప్రత్యేకమైన డీల్‌లు, ఆఫర్లను అందించడానికి బ్యాంక్‌లతో టైఅప్ అవుతున్నాయి. వివిధ బ్యాంకుల్లో మల్టిపుల్ ఖాతాలతో ఆ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు.
భద్రత
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా షెడ్యూల్డ్ బ్యాంక్‌లో రూ. 5 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంది. ఖాతాదారులకు బీమా సొమ్ము చెల్లించడంలో బ్యాంకు విఫలమైనప్పుడు ఈ మొత్తాన్ని కార్పొరేషన్ కవర్ చేస్తుంది.
మల్టిపుల్ అకౌంట్స్- పరిమితులు
మల్టిపుల్ అకౌంట్స్‌తో ప్రయోజనాలతో పాటు కొన్ని పరిమితులు ఉంటాయి.
ఏఎంబీ అవసరం
ఖాతాదారులు ప్రతి ఖాతాలో సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) నిర్వహించాలి. లేకపోతే ఫైన్ పడే అవకాశం ఉంది. మల్టిపుల్ ఖాతాలను నిర్వహిస్తున్నప్పుడు AMBని నిర్వహించడం కొంత కష్టంగా ఉంటుంది.
వడ్డీ నష్టం
అన్ని బ్యాంకులు పొదుపు ఖాతాలపై ఒకే వడ్డీ రేటును అందించవు. మల్టిపుల్ పొదుపు ఖాతాలలో డబ్బును డిపాజిట్ చేయడం వలన, మిగిలిని పొదుపు ఖాతాలతో పోల్చితే వడ్డీ నష్టానికి దారితీయవచ్చు. డిపాజిట్ చేసిన మొత్తం నిర్దిష్ట పరిమాణంలో కంటే ఎక్కువగా ఉంటేనే చాలా బ్యాంకులు అధిక వడ్డీని అందిస్తాయి.
రుసుములు - ఛార్జీలు
పొదుపు ఖాతాలు ఉంటే నిర్దిష్ట వార్షిక రుసుములు, ATM ఛార్జీలు, లాకర్ ఫీజులు, నిర్వహణ రుసుము వంటి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. మల్టిపుల్ ఖాతాలు ఉన్నప్పుడు ఈ రుసుములు, ఛార్జీలు చెల్లించడం ద్వారా సంపాదించిన మొత్తం వడ్డీని కోల్పోయే అవకాశం ఉంది.
నిర్వహణ కష్టం
ఆర్థికంగా క్రమశిక్షణ లేని వారికి మల్టిపుల్ చెక్ బుక్‌లు, డెబిట్ కార్డ్‌లు, నెట్ బ్యాంకింగ్, యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు, AMBలను ప్రాసెస్ చేయడం గందరగోళానికి దారి తీయవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.