Aadhaar Franchise: ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్‌కు దరఖాస్తు చేసుకోండి ఇలా

Aadhaar Card Franchise | ఆధార్ ఫ్రాంఛైజ్ కోసం ప్రభుత్వ గుర్తింపు పొందిన కామన్ సర్వీస్ సెంటర్-CSC రిజిస్ట్రేషన్ పొందాలి. CSC రిజిస్ట్రేషన్ కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

news18-telugu
Updated: June 4, 2019, 3:45 PM IST
Aadhaar Franchise: ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్‌కు దరఖాస్తు చేసుకోండి ఇలా
Aadhaar Franchise: ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్‌కు దరఖాస్తు చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 4, 2019, 3:45 PM IST
ఆధార్ కార్డ్... ప్రతీ ఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్ ఇది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI జారీ చేసే ఆధార్ కార్డ్ ఐడీ ప్రూఫ్‌గా మాత్రమే కాదు... ప్రభుత్వ పథకాలకు కావాల్సిన ముఖ్యమైన ప్రూఫ్‌గా మారింది. కొత్త ఆధార్‌ తీసుకోవాలన్నా, ఇప్పుడు ఉన్న ఆధార్‌లోనే ఏవైనా మార్పులు చేయాలన్నా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాల్సిందే. UIDAI నియమనిబంధనలకు అనుగుణంగా ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లు నడుచుకుంటాయి. ఈ ఎన్‌రోల్‌మెంట్ ఏజెన్సీలను రిజిస్ట్రార్లు నియమిస్తారు. పౌరుల బయోమెట్రిక్, డెమొగ్రఫిక్ డేటా సేకరిస్తుంటాయి. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లు ఉన్నాయి.

Read this: Aadhaar: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? మార్చేయండి ఇలా...

Aadhaar card franchise, aadhar card agency registration, aadhar card center registration, aadhaar enrollment agency registration online, csc aadhar center registration, aadhar card enrollment agency list, how to get aadhar card franchise, ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్, ఆధార్ కార్డ్ ఏజెన్సీ, ఆధార్ కార్డ్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్, ఆధార్ ఫ్రాంఛైజ్ దరఖాస్తు, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ దరఖాస్తు
(image: REUTERS)


Aadhaar Franchise: ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్ పొందండి ఇలా




మీరు కూడా ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్ పొందాలనుకుంటున్నారా? మీరు ఉంటున్న ప్రాంతంలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? ఇందుకోసం ముందుగా మీరు UIDAI నిర్వహించే సూపర్‌వైజర్ లేదా ఆపరేటర్ సర్టిఫికేషన్ ఆన్‌లైన్ ఎగ్జామ్ పాస్ కావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష పాసైన తర్వాత మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, ఆధార్ బయోమెట్రిక్స్ వెరిఫికేషన్ చేయడానికి ఆథరైజేషన్ లభిస్తుంది. ఆ తర్వాత మీరు ప్రభుత్వ గుర్తింపు పొందిన కామన్ సర్వీస్ సెంటర్-CSC రిజిస్ట్రేషన్ పొందాలి. CSC రిజిస్ట్రేషన్ కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Read this: Aadhaar Card: మీ మొబైల్ నెంబర్‌తో ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

Aadhaar card franchise, aadhar card agency registration, aadhar card center registration, aadhaar enrollment agency registration online, csc aadhar center registration, aadhar card enrollment agency list, how to get aadhar card franchise, ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్, ఆధార్ కార్డ్ ఏజెన్సీ, ఆధార్ కార్డ్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్, ఆధార్ ఫ్రాంఛైజ్ దరఖాస్తు, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ దరఖాస్తు
ప్రతీకాత్మక చిత్రం


CSC అధికారిక వెబ్‌సైట్ https://www.csc.gov.in/ ఓపెన్ చేసిన తర్వాత ‘Interested to become a CSC’ లింక్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. CSC రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత ఆధార్ ఫ్రాంఛైజ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్ ఏర్పాటు చేయడానికి ఆఫీస్ గది కావాలి. సొంత గది అయినా అద్దెకు తీసుకున్నా పర్లేదు. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్, వెబ్‌క్యామ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐరిస్ స్కానర్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్, పవర్ స్టాండ్‌బై ఉండాలి. ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్ నిర్వహించేవారికి ఒక ఆధార్ కార్డుపై రూ.35 ఆదాయం లభిస్తుంది.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

Health Tips: సైకిల్ తొక్కితే వచ్చే 10 లాభాలు ఇవే... తెలుసుకోండి

PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్‌కి పాన్ కార్డు అవసరమో తెలుసా?

Credit Card: క్రెడిట్ కార్డ్ వాడట్లేదా? క్యాన్సిల్ చేయండి ఇలా
First published: June 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...