Home /News /business /

WANT TO MIMIC RAKESH JHUNJHUNWALAS PORTFOLIO RETURNS USE THIS SIMPLE INVESTMENT LOGIC GH VB

Investment: స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, లాజిక్స్ ఏంటి..? తెలుసుకోండి..

rakesh jhunjhunwala (file)

rakesh jhunjhunwala (file)

ఇండియన్‌ బిగ్‌బుల్‌, వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న ఝున్‌ఝున్‌వాలా కళ్లు చెదిరే లాభాలు సంపాదించేందుకు కొన్ని పెట్టుబడి సూత్రాలు పాటిస్తారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్‌(Stock Market) ద్వారా పెద్ద మొత్తంలో సంపద సృష్టించాలని ప్రతి ట్రేడర్ కలలు కంటుంటాడు. రూ.వేల పెట్టుబడితో రూ.వేల కోట్లు సంపాదించిన సక్సెస్‌ఫుల్(Successful) ఇన్వెస్టర్ల రహస్యం ఏంటో తెలుసుకోవాలని తపనపడుతుంటారు. ముఖ్యంగా మన భారతదేశంలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.5 వేలతో రూ.40 వేలకు పైగా కోట్లు సంపాదించిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala) సక్సెస్ మంత్ర ఏంటో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఇండియన్‌ బిగ్‌బుల్‌, వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న ఝున్‌ఝున్‌వాలా కళ్లు చెదిరే లాభాలు సంపాదించేందుకు కొన్ని పెట్టుబడి సూత్రాలు పాటిస్తారు. ఆ సూత్రాలు ఏంటి? ఆయన అనుసరిస్తున్న సింపుల్ లాజిక్(Logic) ఏంటి? ఆయన పోర్ట్‌ఫోలియో రిటర్న్‌లు ఎలా ఉన్నాయి? పోర్ట్‌ఫోలియోని అనుకరించి లాభాలు ఎలా పొందాలి? వంటి విషయాలు చూద్దాం.

ముంబైకి చెందిన స్టాక్ ట్రేడర్, దలాల్ స్ట్రీట్‌లో బాగా ప్రసిద్ధి చెందిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియో రిటర్న్‌లను చూడటం ద్వారా సామాన్య ట్రేడర్ కి ఒక ఐడియా కచ్చితంగా వస్తుంది. అతని పోర్ట్‌ఫోలియో పరిశీలిస్తే మనం అతను దాదాపు అన్ని రంగాల్లో ఇన్వెస్ట్ చేసినట్టు గమనించొచ్చు.

పోర్ట్‌ఫోలియోలో లిమిటెడ్ స్టాక్‌లు
వాల్యూ పరంగా చూస్తే ఝున్‌ఝున్‌వాలా 15 స్టాక్స్‌లోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. ఎంతలా అంటే ఈ స్టాక్స్‌లోనే సుమారు 60 శాతానికి పైగా తన ఆస్తిని పెట్టుబడి పెట్టారు.

వైవిధ్యం
ఐటీ, ఎఫ్ఎంసీజీ (FMCG), బీఎఫ్ఎస్ఐ (BFSI) కమోడిటీస్, ఫార్మా, ఆటో మొదలైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియోని వైవిధ్యభరితంగా ఝున్‌ఝున్‌వాలా మార్చారు. క్యాపిటల్ ను ఇలా అన్ని రంగాల్లో విస్తరించడం ద్వారా రిస్క్ తక్కువగా ఉంటుంది.

lockdown : రేపట్నుంచే కఠిన ఆంక్షలు!.. నైట్ కర్ఫ్యూ, ఆన్‌లైన్ క్లాసులపై cm kcr నిర్దేశం నేడు


వ్యూహం ప్రకారం వెయిటేజీలు
ముందుగానే బాగా ఆలోచించి ఒక వ్యూహం ప్రకారం ఏ కంపెనీలు లాభాలు తెస్తాయో వాటిలో ఎక్కువ.. మిగతా వాటిలో తక్కువ ఇన్వెస్ట్ చేయడం.

నష్టాలను తగ్గించండి, లాభాలను పెంచుకోండి
స్టాక్ మార్కెట్‌ అన్నాక కొన్ని నష్టాలను కలిగించే పెట్టుబడులు ఉంటాయి. కానీ అధిక రాబడి అందించే ఇన్వెస్ట్‌మెంట్లు వాటి కంటే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని గుర్తించి ఇన్వెస్ట్ చేయడం.

రిటర్న్ లెక్కింపు, పోలిక
ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియో (స్టార్ హెల్త్‌లో పెట్టుబడులు మినహా) మార్చి 29, 2019 - నవంబర్ 24, 2021 మధ్య దాదాపు 96 శాతం వెయిటెడ్ యావరేజ్ టోటల్ రిటర్న్స్ అందించింది. అదే కాలంలో నిఫ్టీ దాదాపు 50 శాతం రాబడిని అందించింది. పోర్ట్‌ఫోలియో చక్కగా ప్లాన్ చేయడం ద్వారానే ఈ స్థాయిలో రాబడి వచ్చిందని చెప్పొచ్చు.

ఝున్‌ఝున్‌వాలా డెట్ ఇండెక్స్ (Debt Index)లో పెట్టిన పెట్టుబడులకు మార్చి 29, 2019, మే 31, 2020 మధ్య లాభాలు దాదాపు 17 శాతంగా ఉన్నాయి. 30 శాతం పన్ను డిడక్ట్ చేస్తే, నికర రాబడి ~12 శాతంగా ఉంటుంది. జూన్ 2020 నుంచి నవంబర్ 24, 2021 వరకు నిఫ్టీ 77 శాతం రాబడిని ఇచ్చింది. మొత్తం మీద 98 శాతం ((1+12 శాతం)*77 శాతం) రాబడులు అందుకున్నారు. జనవరి 4, 2022కి రీకాలిబ్రేట్ చేస్తే రిటర్న్ ప్రొఫైల్ స్వల్పంగా మారుతుంది. ఈ తేదీ నాటికి, ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ రాబడి 104 శాతంగా ఉంటే.. వ్యక్తిగత పెట్టుబడిదారుడి రాబడి 102 శాతంగా ఉంటుంది.
ఇంకా చిన్న, పెద్ద కంపెనీల విషయానికొస్తే.. రాకేష్ పెట్టిన 26 లార్జ్ క్యాప్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లలో 17 స్కీమ్‌లు (రూ. 100 కోట్ల AUM కంటే ఎక్కువ) 77 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించాయి.

అదేవిధంగా గిల్ట్ ఫండ్ (డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్) కేటగిరీ కింద ఉన్న 16 స్కీమ్‌లలో 14 స్కీమ్‌లు అందించిన రిటర్న్స్ మార్చి 29, 2019, మే 31, 2020 మధ్య డెట్ ఇండెక్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఒక సాధారణ ట్రేడర్ ఒక ప్రక్రియను అనుసరించి, తమ ప్రూవెన్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీకే అట్టిపెట్టుకొని ఉంటే మార్కెట్‌ను అధిగమించడమే కాకుండా ప్రొఫెషనల్ పెట్టుబడిదారుతో సరి సమానంగా రాబడి అందుకోవచ్చు. ఈ అంశంపై ట్రేడింగ్ చేసేవారు అవగాహన పెంచుకోవాలి.

కీలక అంచనాలు
స్టార్ హెల్త్‌లో చేసిన పెట్టుబడులను లెక్కించలేదు. అలాగే, ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో మిగిలిన 40 శాతం రాబడి గురించి లేదా డెట్/ఈక్విటీ-సంబంధిత ఆస్తి కేటాయింపు గురించి లెక్కించలేదు. వాస్తవానికి ఈ పోలిక/ముగింపు ఝున్‌ఝున్‌వాలా విజయాన్ని ఏ విధంగానూ తక్కువ చేయదు. ఇండెక్స్ ఫండ్స్ వంటి సాంప్రదాయ పెట్టుబడి సాధనాల ద్వారా కూడా సామాన్య ఇన్వెస్టర్లు సింపుల్ లాజిక్ తో తమ పోర్ట్‌ఫోలియో/పెట్టుబడులపై రాబడిని సంపాదించవచ్చని ప్రోత్సహించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం.
Published by:Veera Babu
First published:

Tags: Stock Market

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు