WANT TO KNOW FREE COVER LIMIT ON GROUP TERM INSURANCE POLICY CLICK HERE FOR FULL DETAILS PRV GH
Group Term Insurance: గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారా.. ఇందులో ఫ్రీ కవర్ లిమిట్ గురించి తెలుసుకోండి..
(ప్రతీకాత్మక చిత్రం)
కంపెనీలు అందించే జీవిత, ఆరోగ్య బీమా పథకాల్లో ఉద్యోగులకు ఎన్నో కీలక ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. ఒకే పాలసీ కింద పెద్ద సమూహానికి వీటి ద్వారా బీమా కవరేజ్ అందించవచ్చు. అయితే గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఫ్రీ కవర్ లిమిట్ (FCL) ఒక కీలక అంశం.
కంపెనీలు అందించే జీవిత, ఆరోగ్య బీమా పథకాల్లో (Insurance scheme) ఉద్యోగులకు ఎన్నో కీలక ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. ఒకే పాలసీ కింద పెద్ద సమూహానికి వీటి ద్వారా బీమా కవరేజ్(Insurance coverage) అందించవచ్చు. గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఫ్రీ కవర్ లిమిట్ (FCL) ఒక కీలక అంశం. వైద్య పరీక్షల ప్రస్తావన లేకుండా కొంత మంది ఉద్యోగుల బృందానికి అందించే బీమా మొత్తాన్ని ఫ్రీ కవర్ లిమిట్ అంటారు. గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ (Group Term life insurance)లో గ్రూప్‌గా ఒక పాలసీని సంవత్సర కాలానికి జారీ చేస్తారు. ప్రతి సంవత్సరం దీన్ని సంస్థ రెన్యువల్ చేసుకోవచ్చు. ఉద్యోగులు, యజమానితో కూడిన గ్రూప్ అయితే పాలసీని (policy) సంస్థ పేరు మీద జారీ చేస్తారు. సంస్థే పాలసీ నిర్వహణను చూసుకుంటుంది. గ్రూప్ పాలసీలో ఉద్యోగుల చేరికలు, తొలగింపుల వ్యవహారమంతా కంపెనీయే (Company) చూసుకుంటుంది. ఉద్యోగుల కోసం ప్రీమియం మొత్తాన్ని సంస్థ చెల్లిస్తుంది. ఉద్యోగ హాదాను బట్టి బీమా కవరేజీ ఉంటుంది.
* ఫ్రీ కవర్ లిమిట్ అంటే ఏంటి?
తక్కువ ఖర్చుతో పెద్ద సంఖ్యలో వ్యక్తులకు కవరేజ్ అందించడం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ (Term Life Insurance) ప్రధాన ఉద్దేశం. FCL అనేది ఉద్యోగుల ఆరోగ్య పరీక్షల ప్రస్తావన లేకుండా లేదా వారు మంచి ఆరోగ్యంతో ఉన్నారనే రుజువుతో సంబంధం లేకుండా అందించే హామీపూరిత మొత్తంగా చెప్పుకోవచ్చు. గ్రూప్ సభ్యుల సగటు వయస్సు, సభ్యుల సంఖ్య, పెరుగుదల రేటు, గతంలోని మరణాలు ఏమైనా అందుబాటులో ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకొని దీన్ని లెక్కిస్తారు. ఉదాహరణకు 65 సంవత్సరాల్లోపు 1000 మంది ఉద్యోగులు ఉంటే, బీమా సంస్థ (Insurance company) రూ.50 లక్షల మేరకు FCL అందించవచ్చు.
* FCL ఎలా పనిచేస్తుంది?
FCL అంటే ఉచితంగా లైఫ్ ఇన్సూరెన్స్ (Free life Insurance) అందించడం కాదు. గ్రూప్‌లోని సభ్యులకు హామీపూరిత మొత్తం FCL కంటే తక్కువ ఉండి, వారు చురుగ్గా పనిచేసే స్థితిలో ఉంటే, వారికి ఎటువంటి అండర్ రైటింగ్ అవసరాలు లేకుండా బీమా అందిస్తారు. FCL కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు కొన్ని అండర్ రైటింగ్ పరిమితులు అనుసరించాల్సి ఉంటుంది.
* టాప్ అప్ ప్లాన్స్
గ్రూప్ ఇన్సూరెన్స్ (Group Insurance)తో పాటు కొన్నికంపెనీలు తమ ఉద్యోగులకు అదనపు కవరేజీ కూడా అందిస్తుంటాయి. ఆ అదనపు కవరేజ్ అన్నది ఆప్షనల్. దాన్ని టాప్ అప్ కవర్ అంటారు. సాధారణంగా అలాంటి టాప్ అప్ కవర్స్‌కు FCL అందించరు. అలాంటి సందర్భాల్లో మంచి ఆరోగ్యంతో ఉన్నట్టు డిక్లరేషన్, ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు, లేదా వైద్య పరీక్షలు ఉంటాయి. గ్రూప్ లైప్ కవర్స్ పొందడం చాలా సులభం. కానీ మీ కోసం స్వతంత్ర, వ్యక్తిగత టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
వ్యక్తిగత టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ (Personal Term Life Insurance policy)లో ఆ పాలసీ వ్యవధి కాలమంతా అదే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే గ్రూప్ పాలసీలో అయితే ప్రీమియం (premium) ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. కొవిడ్-19 కారణంగా మరణాలు పెరగడంతో గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాలు పెరుగుతున్నాయి. అంతే కాదు FCL రేట్ల విషయంలో రీఇన్సూరర్లు, ఇన్సూరర్లు చాలా మితంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి, మీ ప్రస్తుత బీమాను పరిగణనలోకి తీసుకొని మీ కుటుంబ ఆర్థిక భధ్రత కోసం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీ కోసం తీసుకోవడం మంచిది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.