మీ దగ్గర అదనంగా ఉన్న డబ్బును ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ పొందాలనుకుంటున్నారా? మీ పిల్లల చదువులు, పెళ్లి, మీ రిటైర్మెంట్ ప్లానింగ్... ఇలా వేర్వేరు అవసరాలకు డబ్బు పొదుపు చేయాలనుకుంటున్నారా? ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అయితే మీరు ఎంచుకునే ఆప్షన్‌ను బట్టి రిస్క్ ఉంటుంది. రిటర్న్స్ ఉంటాయి. ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. రిటర్న్స్ ఎక్కువ లేకపోయినా పర్లేదు డబ్బు సేఫ్‌గా ఉండాలనుకుంటే అందకూ కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్, పొదుపు పథకాలు ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ ఎంచుకోవాలన్నా ముందుగా అవగాహన పెంచుకొని నిర్ణయం తీసుకోండి. మరి ఆ ఆప్షన్స్ ఏవో తెలుసుకోండి.
1. Stock Market: ఇటీవల స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారి సంక్ష పెరిగిపోయింది. ఇందులో రిస్క్ ఎక్కువ. అవగాహన లేకుండా పెట్టుబడి పెడితే రిటర్న్స్ కాదు కదా ఉన్న డబ్బు కూడా పోవడం ఖాయం. అందుకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ముందుగా మార్కెట్ గురించి నేర్చుకోవాలి.
Flipkart Big Diwali sale: మీ పాత ఫోన్ ఇస్తే సగం ధరకే iPhone SE కొనొచ్చు ఇలా
SBI ATM cash: ఏటీఎం విత్‌డ్రా లిమిట్ మారింది... మీ ఎస్బీఐ కార్డుతో ఎంత డ్రా చేయొచ్చంటే
2. Mutual Funds: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి రీసెర్చ్ చేసేంత టైమ్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్ అనే పేర్లతో రకరకాల ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి.
3. Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి అందరికీ తెలిసిందే. ఇందులో రిస్క్ ఏమీ ఉండదు. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ వస్తుంది. డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం రూ.5 లక్షల వరకు మీ ఎఫ్డీకి బీమా ఉంటుంది.
4. Gold: గతంలో బంగారంపై ఇన్వెస్ట్ చేసినవారికి ఇప్పుడు మంచి రిటర్న్స్ వస్తున్నాయి. కారణం ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడమే. బంగారంపై ఇన్వెస్ట్ చేసినవారికి ఎప్పటికైనా మంచి లాభాలు ఉంటాయంటారు. అలాగని ధర భారీగా పెరిగినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి గోల్డ్ బాండ్స్, ఫండ్స్, ఈటీఎఫ్, ఫిజికల్ గోల్డ్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి.
IRCTC: రొటీన్ లైఫ్ బోర్ కొట్టేసిందా? ఐఆర్సీటీసీ అండమాన్ టూర్‌కు వెళ్లండిలా
Flipkart Big Diwali sale: రెడ్మీ నుంచి రియల్మీ వరకు... ఈ 12 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
5. RBI Bonds: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI నుంచి సేవింగ్స్ బాండ్స్ కొని మంచి వడ్డీ పొందొచ్చు. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ పేరుతో కొద్ది రోజుల క్రితం స్కీమ్ ప్రారంభించింది ఆర్బీఐ. ఇలాంటి బాండ్ల ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ కన్నా ఎక్కువ పొందొచ్చు.
6. Saving Schemes: నేషనల్ పెన్షన్ సిస్టమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, ప్రధాన మంత్రి వయవందన యోజన లాంటి సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలే. ఇందులో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందొచ్చు.
7. Real Estate: రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు. అయితే మీరు ప్రాపర్టీ కొనే ప్రాంతాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉండే ప్రాంతాల్లో భూమి, ప్లాట్ కొనడం ద్వారా మంచి రిటర్న్స్ పొందొచ్చు.