news18-telugu
Updated: September 21, 2020, 4:43 PM IST
Gold: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
బంగారం.. అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. సంపాదించిన మొత్తంలో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని ఆశపడుతుంటారు. అయితే దీని ధర మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. అయితే గత ఏడాదిగా స్వర్ణం ధర ఆకాశాన్ని అంటుకుంటోంది. ఫలితంగా పెట్టుబడిదారులు అంతగా ఆసక్తి చూపించడంలేదు. ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తున్నవాళ్లు గణనీయమైన లాభాలతో నిష్క్రమించాలా అని ఆలోచిస్తుంటే.. నూతన పెట్టుబడుదారులు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. బుధవారం నాడు యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు 2023 వరకు వడ్డీ రేట్లను దాదాపు సున్నాకి దగ్గరగా ఉంచుతుందని సంకేతాలు ఇచ్చింది. డాలర్ సూచిక బలహీనంగా ఉండి... అధిక ద్రవ్యోల్బణాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే బంగారం ధరలు దృఢంగా ఉండిపోతాయని లేదా పెరుగుతుందని చాలా మంది భావిస్తున్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్ దృష్టిలో ఉంచుకొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునే సంకేతాలను సూచిస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం
బంగారం ధరల్లో మార్పు ఎలా వచ్చాయి..
మే 2019 నుంచి స్వర్ణం ధరలు పెరగడం ప్రారంభించాయి. ఆ ఏడాదిలో 50 శాతం పైగా ధర పెరిగింది. ఔన్సుకు 1250 డాలర్ల నుంచి 1900 డాలర్ల వరకు పెరిగింది. భారత కరెన్సీలో 10 గ్రాముల బంగారం ధర 32 వేల రూపాయల నుంచి 52 వేల రూపాయల వరకు చేరుకుంది. దాదాపు 62 శాతం నమోదు చేసింది. రూపాయి విలువ క్షీణించడం వల్ల భారత పెట్టుడుదారుల రాబడిని ఆశిస్తున్నారు. డాలర్ పరంగా ఆగస్టు 7న ఔన్సు బంగారం ధర 2080 డాలర్లకు చేరుకుంది. కమొడిటీ ఎక్స్ ఛేంజ్ ఎంసీఎక్స్ ధరతో పోలిస్తే బంగారం దాదాపు 2 వేల రూపాయల ప్రీమియంతో వ్యాపారం చేయడంతో మార్కెట్లో 10 గ్రాముల ధరకు 58 వేల రూపాయలకు చేరుకుంది.
అప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 7 శాతం, భారత విపణిలో 10 శాతం వరకు తగ్గింది. ఈ కాలంలో రూపాయికి 2 రూపాయలకు పైగా వసూలు చేయడంతో భారత్ లో స్వర్ణం పతనం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ ధరల తగ్గినప్పటికీ భౌతిక బంగారంపై ప్రీమియం ఇప్పుడు అంతరించింది. దీపావళికి పసిడికి డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.
IPL 2020: హాట్‌స్టార్‌లో ఐపీఎల్ ఫ్రీగా చూడాలా? ఈ ఎయిర్టెల్, జియో ప్లాన్స్ రీఛార్జ్ చేయండి
Savings Schemes: ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్‌తో మీకు ఎంత లాభమో తెలుసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..
గత ఐదు నెలల్లో పెరుగుదలకు అతిపెద్ద కారణం కరోనా ప్రభావం. వ్యాపార వాణిజ్యాలతో పాటు ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్ ప్రభావం పడింది. ఆర్థిక మాంద్యం వల్ల ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ప్రతికూల వృద్ధి రెట్ల చుట్టూ ఉన్న ఆందోళనలు.. కేంద్ర బ్యాంకులు, పెట్టుబడిదారులను బంగారం వైపు నెట్టేలా చేశాయి. బంగారంతో విలోమ సంబంధం ఉన్న డాలర్ బలహీనత ధరల పెరుగుదలకు మరో కారణం. ఫెడ్ తో సహా కేంద్ర బ్యాంకుల రేట్లు తగ్గించి ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటానికి భారీ మొత్తంలో నూతన ద్రవ్యత్వాన్ని ప్రవేశపెట్టడంతో డాలర్ బలహీనపడింది, బంగారం ధర పెరిగింది. సంప్రదాయ ప్రకారం బంగారంపై పెట్టుబడి డిమాండ్ పెరుగుతున్న అనిశ్చితికి అనుగుణంగా పెరుగుతోంది. కాగితపు కరెన్సీ విస్తరణ సాధారణంగా బంగారం ధరలను పెంచుతుంది. గత రెండు సంవత్సరాలుగా చైనా, రష్యా దేశాల్లో ప్రముఖ కేంద్ర బ్యాంకులు కొనుగోళ్ల ద్వారా అధిక ధరలను మద్దతు ఇస్తున్నాయి. బంగారం స్వయంగా ఆర్థిక విలువను ఉత్పత్తి చేయకపోగా.. ద్రవ్యోల్బణం ఆర్థిక అనిశ్చితులకు వ్యతిరేకంగా ఉండటానికి ఇది సామర్థవంతమైన సాధనం.

ప్రతీకాత్మక చిత్రం
ధరలు మరింత పెరుగుతాయా..
కమొడిటీ ట్రేడర్స్, నిపుణుల్లో బంగారం బలంగా ఉండవచ్చని విస్తృత భావం ఉంది. ఇందుకు కారణం పెరుగుతున్న కోవిడ్-19 కేసుల వల్ల రాబోయే మూడేళ్లలో వడ్డీ రేట్లను తక్కువగా ఉంచడంపై ఫెడ్ సంకేతమిచ్చింది. ఈ రెండు కారకాలు కోవిడ్-19కి ఇంకా వైద్య పరిష్కారం కనుగోనలేకపోవడం, సున్నాకి దగ్గరగా ఉంచాలని ఫెడ్ తీసుకున్న నిర్ణయం బంగారం ధరలను దృఢంగా ఉంచడానికి సిద్ధంగా ఉన్నాయి. కోవిడ్ కు వైద్య పరిష్కారం బంగారం దొరికిన తర్వాత గోల్డ్ సేల్స్ అమ్మకాల ఒత్తిడి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే కొంతమంది విశ్లేషకులు బంగారం ప్రస్తుత స్థాయిల నుంచి చాలా పైకి వెళ్లకపోవచ్చు. రెండు నెలల క్రితం డాలర్ కుప్పకూలిపోతుంది ప్రజలు భావించారని అయితే బంగారం తగ్గిందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ జమాల్ మెక్లై చెప్పారు. ఇప్పుడు ఇది దిగి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం డాలర్ ప్రాథమిక సంక్షోభం ఉంటే బంగారం ధర పెరుగుతుంది.
LPG Subsidy: గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాలేదా? ఎలా చెక్ చేయాలంటే
SBI UPI Transfer: యూపీఐ ట్రాన్స్ఫర్ ఫెయిలై డబ్బులు డెబిట్ అయితే ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం
బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా..
ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి పెట్టడం అంత సరైన సమయం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ధరలు ఎక్కువగా ఉన్నాయి. నిపుణులు అభిప్రాయం ప్రకారం బంగారాన్ని సమయానుకూలంగా కొనుగోలు చేయాలని చెబుతున్నారు. ఫైనాన్షియ ప్లానర్ల ప్రకారం పెట్టుబడుదారులు వారి ఆస్తి కేటాయింపుల మొత్తంలో 5 నుంచి 10 శాతం మధ్య ఉండాలని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా నెలవారీ లేదా త్రైమాసిక పద్ధతిలో బంగారంపై పెట్టుబడి చేయడం మంచిది. ఈ సమయంలో లంప్ సమ్ విధానం ఇన్వెస్ట్ చేయకపోవడమే ఉత్తమం. ఆర్థిక సలహాదారులు అభిప్రాయం ప్రకారం బంగారాన్ని షార్ట్ టర్మ్ ఎస్సెట్ గా గోల్డ్ ను ఇన్వెస్ట్ చేయాలని చెబుతున్నారు.
బంగారమనేది వారసత్వ ఆస్తిగా పరిగణించవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏ ధరపై కొనుగోలు చేస్తున్నారనేదే ముఖ్యం. అయితే ప్రజలు పెట్టుబడుదారుల్లా వ్యవహరించి దీర్ఘాకాలిక ఆస్తిని కొనుగోలు చేస్తున్నప్పుడు వారు వ్యాపారుల్లా భావిస్తారని సీఎఫ్ఏ ఆర్థిక సలహాదారులు అమర్ పండిట్ అన్నారు. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల చిన్న పొదుపుపై, డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించాయి. చాలా మంది విశ్లేషకు బంగారాన్ని 10 గ్రాములకి 50 వేల చొప్పున ప్రారంభించవచ్చని వాదించారు. డిసెంబరు 2021 నాటికి ఇది ఔన్సుకు 1900 డాలర్లు.. భారత కరెన్సీలో 10 గ్రాములకు 65 వేల రూపాయలుగా ఉంది. ఔన్సుకు 2400 డాలర్లు పెట్టుబడి పెట్టాలి.
Published by:
Santhosh Kumar S
First published:
September 21, 2020, 4:41 PM IST