ఇండియాలో బంగారం ఎక్కువగా వినియోగిస్తారు. కేవలం ఆభరణాలు, అలంకరణ వస్తువుగానే చూడకుండా.. ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా భావిస్తారు. ప్రస్తుతం టెక్నాలజీ తీసుకొచ్చిన మార్పులతో పెట్టుబడులు చేసే విధానం పూర్తిగా మారిపోయింది. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫిజికల్ గోల్డ్ మాత్రమే కొనాల్సిన అవసరం లేదు. డిజిటల్ గోల్డ్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందుకు ఇన్వెస్ట్‌మెంట్‌ల కాలపరిమితి, ప్రయోజనాలను బట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGB) లేదా మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు కేటాయించిన ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ETF)లో పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే ఈ రెండు ఆప్షన్‌లలో ఏది ఎక్కువ రాబడి, ప్రయోజనాలు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దీర్ఘకాలిక పెట్టుబడి, పన్ను ప్రయోజనాలను పొందాలని చూస్తున్న వ్యక్తులకు సావరిన్ గోల్డ్ బాండ్(SGB)లు మంచి ఆప్షన్ అని నిపుణులు సూచిస్తున్నారు. SGBలకు భారత ప్రభుత్వం హామీ ఉంటుంది. వీటిని గ్రాముల బంగారంలో సూచిస్తారు. ఫిజికల్ గోల్డ్ ప్రత్యామ్నాయంగా చేసే ఈ పెట్టుబడులపై సంవత్సరానికి 2.5 శాతం చొప్పున రాబడి లభిస్తుంది. SGBల విలువ బాండ్ కొనుగోలు చేసిన రోజున ఉన్న ఫిజికల్ గోల్డ్ ధరపై అంతర్లీనంగా ముడిపడి ఉంటుంది. ఈ బాండ్‌లు ఎనిమిదేళ్ల కాలానికి జారీ అవుతాయి.
Hallmark Gold: హాల్‌మార్క్ ఉన్నా, అవి ఒరిజినల్ నగలేనా? ఇలా గుర్తించండి
అయితే రిడెంప్షన్ ఎంపికలు ఐదో సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయి. ఇవి RBI బైబ్యాక్ విండోను ఓపెన్ చేయడంపై ఆధారపడుతాయి. స్థిరమైన వడ్డీ రేటును పొందుతూ బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తులకు SGBలలో పెట్టుబడి అనుకూలం. SGBలు ప్రభుత్వం హామీతో చాలా సురక్షితమైనవి. అయితే వీటిపై లభించే ఆదాయంపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీపై బాండ్‌లను రీడీమ్ చేస్తే పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. SGBలు తక్కువ లిక్విడిటీని కలిగి ఉంటాయి.
మరోవైపు గోల్డ్ ఈటీఎఫ్‌లు మరింత లిక్విడిటీని చూపుతాయి. మ్యూచువల్ ఫండ్ హౌస్‌ల ద్వారా వీటిలో ఎలక్ట్రానిక్ రూపంలో పెట్టుబడులు పెట్టవచ్చు. బంగారం ఫిజికల్‌గా డెలివరీ తీసుకోకుండా బులియన్ మార్కెట్లో వ్యాపారం చేయడానికి పెట్టుబడుదారులకు అవకాశం కల్పిస్తుంది. ఈ విధంగా గోల్డ్ ఈటీఎఫ్‌లు షేర్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అందించే సౌలభ్యాన్ని బంగారం పెట్టుబడులను సులభం చేస్తాయి.
Vande Metro Trains: పేదల కోసం వందే మెట్రో ట్రైన్స్... భారతీయ రైల్వే కొత్త ప్లాన్
ఈటీఎఫ్‌లను కొనుగోలు చేసిన 2.5 సంవత్సరాలలోపు విక్రయిస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్(STCG) ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఈ వ్యవధి తర్వాత విక్రయిస్తే 20 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ (LTCG) ట్యాక్స్ విధిస్తారు. తమ పెట్టుబడులలో లిక్విడిటీ నుంచి లాభం పొందాలనుకునే వారు, ట్రేడింగ్ ఫ్లెక్సిబిలిటీ ఆశించే వారు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold jewellery, Gold Prices, Sovereign Gold Bond Scheme