HOME »NEWS »BUSINESS »want to increase your credit card limit follow these 5 tips ss

Credit Card: క్రెడిట్ కార్డ్ ఉందా? లిమిట్ పెంచుకోండి ఇలా

Credit Card: క్రెడిట్ కార్డ్ ఉందా? లిమిట్ పెంచుకోండి ఇలా
Credit Card: క్రెడిట్ కార్డ్ ఉందా? లిమిట్ పెంచుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Credit Cart Limit Increase | క్రెడిట్ లిమిట్ పెంచేందుకు తగిన అర్హతలు ఉంటే నియమనిబంధనలన్నీ చదివి తెలుసుకోవాలి. ఏవైనా డాక్యుమెంట్స్ అవసరమైతే సబ్మిట్ చేసి క్రెడిట్ లిమిట్ పెంచుకోవచ్చు.

  • Share this:
    క్రెడిట్ కార్డ్... కాస్త సంపాదిస్తున్నవారందరికీ ఇప్పుడు అవసరం. అందుకే దేశంలో క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నవారి సంఖ్య పెరిగిపోతోందని లెక్కలు చెబుతున్నాయి. ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే అనేక షరతులుండేవి. ఇప్పుడు బ్యాంకులు ఫోన్ చేసి మరీ క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తున్నాయి. అయితే బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇచ్చేప్పుడు మీ ఆదాయం, జాబ్, రీపేమెంట్ ఎలా చేస్తారు, క్రెడిట్ స్కోర్ ఎంత, ఎలా ఖర్చు చేస్తుంటారు అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని మీకు క్రెడిట్ లిమిట్‌ను నిర్ణయిస్తాయి బ్యాంకులు. మొదటిసారి క్రెడిట్ కార్డ్ ఇచ్చేప్పుడు లిమిట్ తక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత పేమెంట్ ట్రాక్ రికార్డ్‌ను బట్టి క్రెడిట్ లిమిట్ పెంచుతుంటాయి బ్యాంకులు. అయితే మీ ఖర్చులు పెరిగినప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలనుకుంటే మీరే నేరుగా బ్యాంకును సంప్రదించొచ్చు. మరి మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరగడానికి ఏఏ మార్గాలు ఉన్నాయో తెలుసుకోండి.

    1. కస్టమర్ కేర్: మీరు క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలనుకుంటే కస్టమర్ కేర్‌కు కాల్ చేయొచ్చు. మీ వివరాలు చెప్పి క్రెడిట్ లిమిట్ పెంచడానికి గల అవకాశాలను అడిగి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఆదాయం పెరిగినట్టైతే అందుకు తగ్గ ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. వాటితో పాటు సాలరీ స్లిప్స్, ఫామ్ 16 లాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి. వాటి ఆధారంగా మీ క్రెడిట్ లిమిట్ పెంచడంపై బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి.



    2. ఆన్‌లైన్: మీ క్రెడిట్ లిమిట్ పెరిగే అవకాశం ఉందో లేదో ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. మీ బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ వివరాలతో లాగిన్ కావాలి. ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ సెక్షన్‌లో క్రెడిట్ లిమిట్‌కు అవకాశం ఉందేమో చూడాలి. ఒకవేళ క్రెడిట్ లిమిట్ పెంచేందుకు తగిన అర్హతలు ఉంటే నియమనిబంధనలన్నీ చదివి తెలుసుకోవాలి. ఏవైనా డాక్యుమెంట్స్ అవసరమైతే సబ్మిట్ చేసి క్రెడిట్ లిమిట్ పెంచుకోవచ్చు.

    3. బ్యాంక్: మీరు క్రెడిట్ కార్డ్ సరిగ్గా వాడుతూ, బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నటైతే బ్యాంకులే కొంతకాలం తర్వాత క్రెడిట్ లిమిట్ పెంచేందుకు ఆఫర్ ఇస్తుంటాయి. కాల్, ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా బ్యాంకులు మిమ్మల్ని సంప్రదిస్తాయి. మీ క్రెడిట్ లిమిట్ పెంచే అవకాశం ఉందని చెప్తాయి. ఆ సమయంలో మీ క్రెడిట్ లిమిట్ పెంచడం అవసరం అనుకుంటే ఆఫర్ యాక్సెప్ట్ చేయొచ్చు.

    4. కార్డ్ అప్‌గ్రేడేషన్: ఇప్పుడు మీరు వాడుతున్న కార్డుపై క్రెడిట్ లిమిట్ పెరిగే ఛాన్స్ లేదంటే మీరు కొత్త కార్డ్ తీసుకోవడం ద్వారా క్రెడిట్ లిమిట్ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఉన్న బ్యాంక్‌లో కార్డ్ అప్‌గ్రేడేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్న కార్డుకన్నా కాస్త బెటర్ కార్డ్ ఎంచుకోవడం ద్వారా లిమిట్ పెరుగుతుంది. కార్డ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి. అయితే యాన్యువల్ ఫీజు కూడా కాస్త పెరుగుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి.

    5. ఇతర బ్యాంకులు: మీరు ఒక క్రెడిట్ కార్డ్ వాడుతున్నట్టైతే ఇతర బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డులు సులువుగా మంజూరు చేస్తుంటాయి. అప్పటికే మీకు ఓ కార్డ్ ఉంది కాబట్టి మరో కార్డ్ ఇచ్చేందుకు పెద్దగా అడ్డంకులేమీ ఉండవు. ఇతర బ్యాంకులు ఇచ్చిన క్రెడిట్ కార్డుల ఆధారంగా కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తుంటాయి. ఒకవేళ మీకు ఎక్కువ లిమిట్ వస్తుందనుకుంటే కొత్త కార్డ్ తీసుకోవచ్చు. అయితే లిమిట్ విషయమై ముందే బ్యాంకు ప్రతినిధులతో హామీ తీసుకోవాలి.

    Mahatma Gandhi 150th Birthday: జాతిపిత అరుదైన 100 చిత్రాలు... మీరు చూశారా?



    ఇవి కూడా చదవండి:

    IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి నేపాల్ టూర్... ప్యాకేజీ ధర ఎంతో తెలుసుకోండి

    Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో టైమ్ డిపాజిట్ అకౌంట్‌... లాభాలేంటో తెలుసా?

    IRCTC: పండుగకు ఊరెళ్తున్నారా? ఈ టెక్నిక్‌తో రైలు టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ
    Published by:Santhosh Kumar S
    First published:October 02, 2019, 17:48 IST

    टॉप स्टोरीज