మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? మీ క్రెడిట్ లిమిట్ పెంచుతామని బ్యాంకు సిబ్బంది పదేపదే మీకు ఫోన్ చేస్తున్నారా? లిమిట్ పెంచుతున్నారు కదా అని ఓకే చెప్పేస్తున్నారా? ఒక్క నిమిషం. మీరు మీ క్రెడిట్ లిమిట్ పెంచుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం మంచిది. లిమిట్ పెంచడం బాగానే ఉంటుంది కానీ... ఆ తర్వాత మెయింటైన్ చేయడం మీ ఆర్థిక క్రమశిక్షణకు సవాల్‌గా మారుతుంది. బ్యాంకులు మీ ప్రొఫైల్, మీరు తిరిగి చెల్లించిన తీరు, మీకు ఉన్న అప్పులు లెక్కేసి క్రెడిట్ లిమిట్ పెంచుతామని ఆఫర్ చేస్తుంటాయి. అయితే క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం వల్ల లాభాలున్నాయి. నష్టాలు కూడా ఉంటాయి. అవన్నీ తెలుసుకొని యెస్ అంటేనే మీకు మంచిది.
Read this: WhatsApp 2019 Features: ఈ ఏడాది వాట్సప్‌లో ఆకట్టుకుంటున్న 12 ఫీచర్లు ఇవే...
మీకు అవసరం లేదనుకుంటే క్రెడిట్ లిమిట్ పెంచుకోకూడదు. ఉదాహరణకు మీ జీతం నెలకు రూ.30 వేలు ఉంటే దానికి రెండుమూడు రెట్లు క్రెడిట్ లిమిట్ ఉంటే చాలు. మీకు అంతకన్నా ఎక్కువ లిమిట్ ఉంటే ఇబ్బందుల్లో పడేది మీరే. క్రెడిట్ లిమిట్ ఉంది కదా అని మొదట వాడేస్తారు. ఆ తర్వాత బిల్లులు చెల్లించలేక అప్పులపాలవుతారు. అందుకే మీ క్రెడిట్ లిమిట్ చాలా ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. ముందు మీకు క్రెడిట్ కార్డు ద్వారా నెలకు ఎంత అవసరమో మీకు ఓ అవగాహన ఉండాలి. నెలకు రూ.20 వేలు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తారంటే మీ క్రెడిట్ లిమిట్ రూ.60-రూ.70 వేలు ఉంటే చాలు. ఒకవేళ మీకు అంతకన్నా ఎక్కువ అవసరం అనుకుంటే క్రెడిట్ లిమిట్ పెంచమని బ్యాంకును కోరొచ్చు.
Read this: SBI Schemes: ఎస్‌బీఐలో డబ్బులు దాచుకుంటారా? ఎక్కువ వడ్డీ ఇచ్చే స్కీమ్స్ ఇవే...
బ్యాంకులు మీ యుటిలైజేషన్ రేషియోని పరిశీలిస్తాయి. అంటే మీకు ఇచ్చిన క్రెడిట్ లిమిట్‌లో ఎంత వాడుతున్నారన్నది ముఖ్యం. మీకు రూ.1 లక్ష క్రెడిట్ లిమిట్ ఉంటే అందులో 30-40 శాతం అంటే రూ.30-40 వేల మధ్య వాడితే మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. మీ యుటిలైజేషన్ రేషియో పెరిగితే ఆ ప్రభావం క్రెడిట్ స్కోర్‌పై పడుతుంది. మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ఎక్కువగా ఉంటే క్రెడిట్ లిమిట్ పెంచుకోవచ్చు. దీని ద్వారా మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో తగ్గుతుంది. క్రెడిట్ స్కోర్ పెంచుకోవడం వల్ల ఇదీ లాభమే.
మీకు జీతం పెరిగినప్పుడు కూడా క్రెడిట్ లిమిట్ పెంచుకోవచ్చు. అయితే బ్యాంకులు క్రెడిట్ లిమిట్ పెంచుతామని అడిగినప్పుడు మీరు ఓకే చెప్పొచ్చు. అదే మీరు రిక్వెస్ట్ చేస్తే బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తాయి. ఆ సమయంలో మీ రిక్వెస్ట్ రిజెక్ట్ అయితే అది క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది. అందుకే మీరు క్రెడిట్ లిమిట్ పెంచమని రిక్వెస్ట్ చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలి. క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉండటం మీ రీపేమెంట్ తీరును ప్రతిబింబిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటేనే బ్యాంకులు మీ క్రెడిట్ లిమిట్ పెంచుతాయన్న విషయం గుర్తుంచుకోండి. అందుకే మీ క్రెడిట్ స్కోర్ తగ్గకుండా క్రెడిట్ కార్డ్ మెయింటైన్ చేయడం తప్పనిసరి.
Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...
ఇవి కూడా చదవండి:
PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ చేయడానికి మార్చి 31 డెడ్‌లైన్
Post Office Internet Banking: పోస్ట్ ఆఫీస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలా వాడుకోవాలి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit cards, Personal Finance