ITR filing 2019: ఐటీఆర్ ఫైల్ చేయలేదా? ఈ 5 వెబ్‌సైట్స్ ట్రై చేయండి

Income Tax Returns | హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లాంటి బ్యాంకులు ఇలాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఐటీఆర్ ఫైలింగ్‌ సేవల్ని అందిస్తున్నాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా సులువుగా ఇ-ఫైలింగ్ చేయొచ్చు.

news18-telugu
Updated: August 29, 2019, 2:43 PM IST
ITR filing 2019: ఐటీఆర్ ఫైల్ చేయలేదా? ఈ 5 వెబ్‌సైట్స్ ట్రై చేయండి
ITR filing 2019: ఐటీఆర్ ఫైల్ చేయలేదా? ఈ 5 వెబ్‌సైట్స్ ట్రై చేయండి (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 29, 2019, 2:43 PM IST
మీరు ఇంకా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా? 2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి గడువు ముంచుకొచ్చేస్తోంది. డెడ్‌లైన్ దాటిన తర్వాత 2019 డిసెంబర్ 31 లోపు రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.5,000 జరిమానా చెల్లించాలి. డిసెంబర్ 31 తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.10,000 జరిమానా చెల్లించాలి. టెక్నాలజీ పెరిగిపోవడంతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం కూడా సులువైపోయింది. ప్రభుత్వ వెబ్‌సైట్ మాత్రమే కాదు... ప్రైవేట్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్స్‌పై ఐటీఆర్, జీఎస్‌టీ రిటర్న్స్ ఇ-ఫైలింగ్ చేయొచ్చు. మరి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఉపయోగపడే వెబ్‌సైట్స్ ఏవో తెలుసుకోండి.

1. Income Tax website: ఆదాయపు పన్ను శాఖకు చెందిన incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. ఆదాయపు పన్ను సంబంధిత సేవలన్నీ ఈ పోర్టల్‌లో పొందొచ్చు. మొదటిసారి ఇ-ఫైలింగ్ చేస్తున్నటైతే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫామ్ 16 (అందుబాటులో ఉంటే), పెట్టుబడుల వివరాలు ఉండాలి.

2. ClearTax: బెంగళూరుకు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఇది. ఇందులో మీరు ఐటీఆర్, జీఎస్‌టీ రిటర్న్స్ ఇ-ఫైల్ చేయొచ్చు. ఈ వెబ్‌సైట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ సేవల్నీ అందిస్తుంది. ఫామ్ 16 ఉన్నవారు ఆ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేస్తే చాలు ఐటీ రిటర్న్స్ ఇ-ఫైలింగ్ చాలా సులువు. చివర్లో మీకు అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఐటీ రిటర్న్స్ ఇ-ఫైలింగ్‌కు కేవలం 7 నిమిషాలు పడుతుందని క్లియర్‌ట్యాక్స్ వెబ్‌సైట్ చెబుతోంది.

3. myITreturn: 2006 సంవత్సరంలో ఆదాయపు పన్ను శాఖలో రిజిస్టరైన ఇ-రిటర్న్ ప్లాట్‌ఫామ్ ఇది. స్కోరీడోవ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. వేతనం, పెట్టుబడులు, లాభాలు, ఆదాయం లాంటి వివరాలతో ఐటీఆర్ ఇ-ఫైల్ చేయొచ్చు. ఇంగ్లీష్‌తో పాటు 9 భారతీయ భాషల్లో సేవలు లభిస్తాయి.



4. TaxSpanner: ట్యాక్స్ స్పానర్ 2007 లో న్యూ ఢిల్లీ, బెంగళూరులో ప్రారంభమైన సంస్థ ఇది. ఇది కూడా ఆదాయపు పన్ను శాఖలో రిజిస్టైరైంది. ఇందులో మీరు ఫామ్ 16 అప్‌లోడ్ చేస్తే ఐటీఆర్ ఫైల్ చేయడానికి కావాల్సిన సమాచారాన్ని స్కాన్ చేస్తుంది. మీరు ఎంచుకునే ప్యాకేజీని బట్టి నిపుణుల సేవలు లభిస్తాయి.

5. Paisabazaar: పాలసీబజార్ గ్రూప్‌కు చెందిన సంస్థ పైసాబజార్ కూడా ఉచితంగా ఐటీఆర్ ఇ-ఫైలింగ్ సేవల్ని అందిస్తోంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది ఈ వెబ్‌సైట్. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో నిపుణుల సలహాలు కూడా పొందొచ్చు.

ఇవే కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లాంటి బ్యాంకులు ఇలాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఐటీఆర్ ఫైలింగ్‌ సేవల్ని అందిస్తున్నాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా సులువుగా ఇ-ఫైలింగ్ చేయొచ్చు. ఇ-ఫైల్ ఐటీఆర్, అప్‌లోడ్ రిటర్న్, ట్యాక్స్ క్యాలిక్యులేటర్, ఇ-పే ట్యాక్స్, ఇ-వెరిఫై రిటర్న్స్ లాంటి సేవలు పొందొచ్చు.
Loading...
Revolt: మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బైక్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

August Smartphones: ఆగస్ట్‌లో రిలీజైన 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే... ఫీచర్స్ తెలుసుకోండి

Revolt: నెలకు రూ.2999 చెల్లించి ఈ బైక్ సొంతం చేసుకోవచ్చు

IRCTC: హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే
First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...