Home /News /business /

WANT TO CHANGE YOUR SBI ACCOUNT TO OTHER BRANCH FOLLOW THESE SIMPLE STEPS TO DO ONLINE SS

SBI Branch Change Online: మీ ఎస్‍బీఐ అకౌంట్ వేరే బ్రాంచ్‌కు ఆన్‌లైన్‌లో మార్చుకోండి ఇలా

SBI Branch Change Online: మీ ఎస్‍బీఐ అకౌంట్ వేరే బ్రాంచ్‌కు ఆన్‌లైన్‌లో మార్చుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Branch Change Online: మీ ఎస్‍బీఐ అకౌంట్ వేరే బ్రాంచ్‌కు ఆన్‌లైన్‌లో మార్చుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI Branch Change Online | మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమరా? ఎస్‌బీఐ బ్యాంకులో అకౌంట్ ఉందా? మీ బ్యాంక్ అకౌంట్‌ను వేరే బ్రాంచ్‌కు మార్చుకోవాలనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లోనే చేయండి ఇలా.

    మీ ఎస్‌బీఐ అకౌంట్‌ను మరో బ్రాంచ్‌కు మార్చేందుకు మీరు బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కరోనా మహమ్మారి కాలంలో అసలు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే బ్యాంక్ అకౌంట్‌ను మీకు కావాల్సిన బ్రాంచ్‌కు సులువుగా మార్చుకోవచ్చు. ఇప్పటికే ప్రైవేట్ బ్యాంకులు తమ కస్టమర్లకు ఇలాంటి సేవల్ని అందిస్తున్నాయి. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ తమ కస్టమర్లకు ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్‌బీఐ కస్టమర్లు తమ బ్యాంక్ అకౌంట్‌ను వేరే బ్రాంచ్‌కు ఆన్‌లైన్‌లోనే మార్చుకోవచ్చు. దీనివల్ల కస్టమర్లకు చాలావరకు సమయం ఆదా అవుతుంది. బ్యాంక్ బ్రాంచ్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లోనే తమ అకౌంట్‌ను మరో బ్రాంచ్‌కు సులువుగా మార్చుకోవచ్చు.

    Card Transactions: క్రెడిట్, డెబిట్ కార్డుతో ఆన్‌లైన్ షాపింగ్ చేయలేకపోతున్నారా? ఇలా యాక్టివేట్ చేయండి

    Air Cooler: వేసవిలో ఎయిర్ కూలర్ కొంటున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి

    కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఎస్‌బీఐ ఈ సర్వీస్ ప్రారంభించింది. కస్టమర్లు యోనో ఎస్‌బీఐ, యోనో లైట్ యాప్‌లతో పాటు ఆన్‌లైన్ ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా తమ బ్యాంక్ అకౌంట్‌ను మరో బ్రాంచ్‌కు సింపుల్‌గా మార్చుకోవచ్చు. అయితే ఎస్‌బీఐ అకౌంట్‌ను మరో బ్రాంచ్‌కు మార్చేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీ అకౌంట్ మార్చే ప్రక్రియలో మీ అకౌంట్ నెంబర్, బ్రాంచ్ కోడ్ లాంటి వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి. అంతేకాదు ఎస్‌బీఐలో మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలి. ఓటీపీ పొందడానికి మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయడం తప్పనిసరి. ఇవన్నీ సరిగ్గా ఉంటే మీరు నిమిషాల్లో మీ ఎస్‌బీఐ అకౌంట్‌ను మరో బ్రాంచ్‌కు మార్చొచ్చు. మరి వేరే బ్రాంచ్‌కు ఎస్‌బీఐ అకౌంట్‌ను మార్చడానికి ఏఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి.

    Aadhaar Card: ఆధార్ నెంబర్ ఒక్క ఎస్ఎంఎస్‌తో లాక్ చేయండి ఇలా

    LIC Claims: కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చా?


    SBI Branch Change Online: మీ అకౌంట్ వేరే బ్రాంచ్‌కు మార్చేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి


    కస్టమర్లు ముందుగా https://www.onlinesbi.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    Personal Banking ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
    యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
    e-service ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత Transfer Savings Account పైన క్లిక్ చేయాలి.
    మీకు ఒకటి కన్నా ఎక్కువ ఎస్‌బీఐ అకౌంట్లు ఉంటే ఏ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ సెలెక్ట్ చేయాలి.
    ఆ తర్వాత మీరు ఏ బ్యాంకు బ్రాంచ్‌కు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేయాలి.
    వివరాలన్నీ ఓసారి సరిచూసుకొని Confirm బటన్ పైన క్లిక్ చేయాలి.
    మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
    ఓటీపీ ఎంటర్ చేసి Confirm బటన్ పైన క్లిక్ చేయాలి.
    కొన్ని రోజుల్లోనే మీ అకౌంట్ మీరు కోరుకున్న బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది.
    ఆ సమాచారం మీకు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా వస్తుంది.

    యోనో యాప్, యోనో లైట్ యాప్‌లో కూడా దాదాపు ఇదే పద్ధతిలో మీ ఎస్‌బీఐ అకౌంట్‌ను మరో బ్రాంచ్‌కు మార్చుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank, Bank account, BANK ACCOUNTS, Banking, Mobile Banking, Personal Finance, Sbi, State bank of india, Yono, Yono app

    తదుపరి వార్తలు