Aadhaar: పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చండి ఇలా...

Aadhaar Name Change | పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటి పేరు మారుతుంది. మరి అలాంటి సందర్భంలో ఆధార్ కార్డులో పేరు మార్చడం అవసరమా? అన్న అనుమానాలు చాలామందిలో ఉంటాయి.

news18-telugu
Updated: August 27, 2019, 3:47 PM IST
Aadhaar: పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చండి ఇలా...
Aadhaar: పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చండి ఇలా... (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆధార్ కార్డ్... భారతదేశంలోని పౌరులందరికీ ముఖ్యమైన డాక్యుమెంట్. ప్రతీ పనిలో ఆధార్ అవసరం అవుతోంది. ఆధార్ ఐడీ చూపించాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అవుతోంది. ఒకవేళ ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే సమస్యగా మారుతోంది. అందుకే ఆధార్ కార్డులో ఏ చిన్న తప్పు ఉన్నా వెంటనే సరిచేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు సామాన్యులు. పెళ్లి జరిగే సందర్భంలో అమ్మాయిల పేర్లు మార్చడం భారతదేశంలో వస్తున్న ఆనవాయితీ. పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటి పేరు మారుతుంది. మరి అలాంటి సందర్భంలో ఆధార్ కార్డులో పేరు మార్చడం అవసరమా? అన్న అనుమానాలు చాలామందిలో ఉంటాయి. పెళ్లి తర్వాత అమ్మాయిలు ఆధార్ కార్డులో తమ పేరు మార్చుకోవచ్చు. ఇదేమీ పెద్ద కష్టమైన విషయం కాదు. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డులో పేరు మార్చడం సులువే. ఎలాగో తెలుసుకోండి.

Aadhaar: ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డులో పేరు మార్చండి ఇలా...



ముందుగా మీరు మీ ఆధార్ నెంబర్‌తో ఆన్‌లైన్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్‌లో లాగిన్ కావాలి.
మీ మార్చాలనుకుంటున్న పేరు, ఇంటిపేరు ఎంటర్ చేయాలి.
ఆధార్ పేరు మార్చడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.ఈ మొత్తం ప్రాసెస్‌కు మీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Aadhaar: ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డులో పేరు మార్చండి ఇలా...


ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డులో పేరు మార్చడానికి మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి.
ఆధార్ పేరు మార్చడానికి కావాల్సిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి.
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ సిబ్బంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి మీకు తిరిగిచ్చేస్తారు.
ఆధార్‌లో పేరు, ఇంటిపేరు ఎలా మార్చాలో సిబ్బందికి వివరించాలి.
అవసరమైతే మీ బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయాలి.
ఈ ప్రాసెస్‌కు మీరు రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా ఆధార్ కార్డులో మీ పేరు మార్చడానికి 90 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత UIDAI వెబ్‌సైట్‌లో Aadhaar డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Motorola One Action: మోటోరోలా వన్ యాక్షన్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Traffic Fines: సెప్టెంబర్ 1 నుంచి మారే ట్రాఫిక్ ఫైన్స్ ఇవే...

LIC Jeevan Amar: రూ.10,800 ప్రీమియంతో రూ.1 కోటి బీమా... ఎల్ఐసీ కొత్త పాలసీ వివరాలివే

IRCTC: రైలు గంట ఆలస్యంగా వస్తే క్యాష్‌బ్యాక్... ఐఆర్‌సీటీసీ ఆఫర్
First published: August 27, 2019, 3:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading