హోమ్ /వార్తలు /బిజినెస్ /

PAN Card: పాన్ కార్డ్ అడ్రస్ మార్చాలా? ఆధార్ కార్డుతో చేయొచ్చు

PAN Card: పాన్ కార్డ్ అడ్రస్ మార్చాలా? ఆధార్ కార్డుతో చేయొచ్చు

PAN Card: పాన్ కార్డ్ అడ్రస్ మార్చాలా? ఆధార్ కార్డుతో చేయొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

PAN Card: పాన్ కార్డ్ అడ్రస్ మార్చాలా? ఆధార్ కార్డుతో చేయొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

PAN Card | పాన్ కార్డ్ అడ్రస్ మార్చే ప్రాసెస్ (PAN Card Address Change) చాలా సింపుల్ అయిపోయింది. ఆధార్ కార్డ్ ఉంటే చాలు మీ స్మార్ట్‌ఫోన్‌లోనే సింపుల్ స్టెప్స్‌తో పాన్ కార్డ్ అడ్రస్ మార్చవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

గతంలో పాన్ కార్డులో అడ్రస్ మార్చాలంటే ప్రాసెస్ కాస్త పెద్దగా ఉండేది. పాన్ కార్డ్ (PAN Card) సేవల్ని అందించే ఏజెంట్ దగ్గరకు వెళ్లి అప్లికేషన్ ఇవ్వడం, అడ్రస్ మారడం కోసం కొన్ని రోజుల పాటు ఎదురుచూడటం తప్పేది కాదు. కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఆధార్ కార్డ్ (Aadhaar Card) ఉంటే చాలు. ఆధార్ డేటా ద్వారా పాన్ కార్డులో అడ్రస్‌ని సులువుగా మార్చేయొచ్చు. అంటే పాన్ కార్డులో ఒక అడ్రస్, ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంటే, ఆధార్‌లో ఉన్న అడ్రస్‌నే పాన్ కార్డుకు అప్‌డేట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ ఆన్‌లైన్‌లో సులువుగా జరిగిపోతుంది. మరి మీ ఆధార్ కార్డును ఉపయోగించి పాన్ కార్డులోని అడ్రస్‌ని ఎలా మార్చాలో తెలుసుకోండి.

పాన్ కార్డ్ అడ్రస్ మార్చండి ఇలా

Step 1- ముందుగా యూటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్‌కు చెందిన పోర్టల్ https://www.utiitsl.com/ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో PAN Card Services పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

Step 3- అందులో Facility for address update in PAN database through eKYC mode పైన క్లిక్ చేయాలి.

Step 4- ఆ తర్వాత మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ , మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.

Step 5- అడ్రస్ అప్‌డేట్‌లో రెండు ఆప్షన్స్ వస్తాయి. Aadhaar Base e-KYC Address Update లేదా Digilocker Address Update ఆప్షన్స్‌లో ఒకటి సెలెక్ట్ చేయాలి.

Step 6- క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

IRCTC Booking: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్... ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఛార్జీలు

మీరు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం మీ పాన్ కార్డ్ అడ్రస్ మారుతుంది. మీ యూఐడీఏఐ లేదా డిజీలాకర్‌లో ఉన్న అడ్రస్ పాన్ కార్డులో అప్‌డేట్ అవుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆధార్ బేస్ ఇ-కేవైసీ ద్వారా అడ్రస్ అప్‌డేట్ చేయాలనుకుంటే మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి. మరి మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Rs 1 Crore Returns: నెలకూ రూ.300 పొదుపుతో కోటీశ్వరులు కావొచ్చు ఇలా

డిజీలాకర్ సర్వీస్ ద్వారా కూడా పాన్ కార్డ్ అడ్రస్ మార్చవచ్చు. ఆధార్ ఆథెంటికేషన్ కోసం యూఐడీఏఐ దగ్గర మీరు రిజిస్టర్డ్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ప్రాసెస్ పూర్తవుతుంది. ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ చేయనట్టైతే మీకు ఈ సర్వీస్ ఉపయోగపడదు.

అంటే మీరు ఆధార్ ద్వారా మీ పాన్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ చేయాలనుకుంటే పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ కావాలి. దీంతో పాటు యూఐడీఏఐ దగ్గర మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలి. అప్పుడే ఈ ప్రాసెస్ విజయవంతం అవుతుంది. ఒకవేళ యూఐడీఏఐ రికార్డ్స్ ప్రకారం అడ్రస్ అప్‌డేట్ చేయకూడదనుకుంటే నేరుగా ఆదాయపు పన్ను శాఖకు అడ్రస్ మార్పు కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

First published:

Tags: Aadhaar Card, AADHAR, PAN, PAN card

ఉత్తమ కథలు