Credit Card: క్రెడిట్ కార్డ్ వాడట్లేదా? క్యాన్సిల్ చేయండి ఇలా

Credit Card | మీరు క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేసినా మీ క్రెడిట్ స్కోర్‌పై కొంత ప్రభావం పడుతుంది. అయితే మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేట్ ఎంత? ఎంత కాలంగా కార్డులు వాడుతున్నారు? అన్న అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది.

news18-telugu
Updated: May 31, 2019, 5:20 PM IST
Credit Card: క్రెడిట్ కార్డ్ వాడట్లేదా? క్యాన్సిల్ చేయండి ఇలా
Credit Card: క్రెడిట్ కార్డ్ వాడట్లేదా? క్యాన్సిల్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 31, 2019, 5:20 PM IST
మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? చాలాకాలంగా వాడట్లేదా? ఇక భవిష్యత్తులో కూడా వాడాల్సిన అవసరం రాదా? అయితే వెంటనే మీ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేయండి. లేకపోతే మీకు ఇబ్బందులు తప్పవు. కార్డు వాడకపోయినా మీరు చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఇటీవల బ్యాంకులు పోటీపడి మరీ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని రెండు మూడు క్రెడిట్ కార్డులు తీసుకునేవాళ్లు ఉన్నారు. అయితే జేబులో మూడు క్రెడిట్ కార్డులు ఉన్నా ఒక కార్డునే వాడుతుంటారు. మిగతా కార్డుల్ని స్పేర్‌‌లో పెట్టుకుంటారు. అయితే ఎన్ని క్రెడిట్ కార్డులు ఉంటే అన్నింటికీ వార్షిక ఫీజు చెల్లించాలి. అన్నీ వాడుకుంటే పర్లేదు. కానీ వాడని కార్డుకు కూడా వార్షిక ఫీజు చెల్లించడం అనవసరం. అయితే క్రెడిట్ కార్డు వాడకుండా అలాగే వదిలేసేవాళ్లు ఉంటారు. వార్షిక ఫీజు కూడా చెల్లించరు. దీంతో డిఫాల్ట్ అవుతారు. క్రెడిట్ స్కోర్‌పై అది ప్రభావం చూపిస్తుంది. వార్షిక ఫీజు చెల్లించకపోవడం వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. అందుకే వాడని క్రెడిట్ కార్డులు ఉంటే క్యాన్సిల్ చేయడం మంచిది.

Read this: Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేయడం ఎలా?



మీరు క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేయాలని నిర్ణయించుకుంటే బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి. క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేయమని చెప్పండి. మీరు బ్యాంకుకు వెళ్లి నేరుగా లేఖ రాసి కూడా మీ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేశాం కదా క్యాన్సిల్ అయిపోతుందిలే అనుకోవద్దు. మీరు మరోసారి కాల్ చేసి ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో కనుక్కోండి. మీ క్రెడిట్ కార్డ్ క్యాన్సలేషన్ ప్రక్రియ పూర్తైనట్టయితే... కార్డు క్యాన్సిల్ చేసినట్టు బ్యాంకు నుంచి లెటర్ తీసుకోండి. భవిష్యత్తులో లావాదేవీల్లో ఏదైనా తేడా ఉంటే ఉపయోగపడుతుంది. మీరు క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేసినా మీ క్రెడిట్ స్కోర్‌పై కొంత ప్రభావం పడుతుంది. అయితే మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేట్ ఎంత? ఎంత కాలంగా కార్డులు వాడుతున్నారు? అన్న అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేస్తే అప్పటివరకు ఉన్న రివార్డ్ పాయింట్స్ అన్నీ పోతాయి. అందుకే క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేసే ముందే రివార్డ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని రీడీమ్ చేసుకోవడం మర్చిపోవద్దు.



Read this: ఆన్‌లైన్‌లో చెప్పులు కొంటున్నారా? ఈ 11 జాగ్రత్తలు తప్పనిసరి

మీ దగ్గర ప్రస్తుతం ఉన్న కార్డును క్యాన్సిల్ చేసి అదే బ్యాంకు నుంచి మరో కొత్త కార్డ్ తీసుకోవాలనుకుంటే పాత కార్డును క్యాన్సిల్ చేయొద్దు. బ్యాంకుకు కాల్ చేసి ఇప్పుడు ఉన్న కార్డును ఫలానా కార్డుకు అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పండి. మీరు కోరుకున్న కార్డుకు మీరు ఎలిజిబుల్ అయితే బ్యాంకు కార్డు అప్‌గ్రేడ్ చేస్తుంది. దీంతో మీకు కార్డ్ క్యాన్సలేషన్ అవసరం ఉండదు. కొత్త కార్డు రాగానే పాతది పనిచేయదు.

Black Shark 2: గేమింగ్ ఫోన్ 'బ్లాక్ షార్క్ 2' ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Tata Sky: టాటా స్కై రీజనల్ ప్యాక్స్ ధరలు మారాయి

Aadhaar Card: మీ మొబైల్ నెంబర్‌తో ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

IRCTC: గోవాలో బస్ ట్రిప్... జస్ట్ రూ.400 మాత్రమే
First published: May 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...