IRCTC Rules: ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ ఇవే...

IRCTC Ticket Cancellation Rules | ఐఆర్‌సీటీసీలో బుక్ చేసిన టికెట్లను చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఇందుకోసం టికెట్ హోల్డర్స్ ఆన్‌లైన్ టీడీఆర్ ఫైలింగ్ చేయాలి.

news18-telugu
Updated: May 30, 2019, 2:11 PM IST
IRCTC Rules: ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ ఇవే...
IRCTC Rules: ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ ఇవే... (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు తరచూ రైలులో ప్రయాణిస్తుంటారా? మరి మీకు టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ ఎంత వరకు తెలుసు? రైలు టికెట్ క్యాన్సిల్ చేసే సమయంలో నిబంధనల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే రీఫండ్ విషయంలో ఇబ్బందులు రావొచ్చు. అందుకే రైల్వే టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ తెలుసుకోవడం మంచిది. కౌంటర్‌లో బుకింగ్ కన్నా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్స్‌పై టికెట్లు బుక్ చేసుకునేవారే ఎక్కువ. అందుకే రైల్వే క్యాన్సలేషన్ రూల్స్‌పై ఐఆర్‌సీటీసీ అవగాహన కల్పిస్తోంది. ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ ఆన్‌లైన్ ద్వారా వస్తుంది. టికెట్ క్యాన్సలేషన్, రీఫండ్ విషయంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలివే.

Read this: IRCTC: రైలు టికెట్ కన్ఫామ్ కావాలా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి

చార్ట్ ప్రిపరేషన్ కన్నా ముందు టికెట్ క్యాన్సలేషన్



చార్ట్ ప్రిపేర్ చేయడం కన్నా ముందే మీరు టికెట్ క్యాన్సిల్ చేయాలంటే www.irctc.co.in లేదా ఐఆర్‌సీటీసీ యాప్ ఓపెన్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత "Booked Tickets" సెక్షన్‌లో టికెట్ క్యాన్సిల్ చేయొచ్చు. టికెట్ సక్సెస్‌ఫుల్‌గా క్యాన్సిల్ చేసిన తర్వాత రీఫండ్ ప్రక్రియ మొదలవుతుంది. మీరు టికెట్ బుకింగ్ సమయంలో పేమెంట్ ఏ ప్లాట్‌ఫామ్ ద్వారా చేశారో అదే ప్లాట్‌ఫామ్‌లోకి రీఫండ్ వస్తుంది. అంటే బ్యాంక్ అకౌంట్ ద్వారా చేస్తే అకౌంట్‌లోకి, వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేస్తే వ్యాలెట్‌లోకి రీఫండ్ వస్తుంది. రైలు బయల్దేరే సమయానికన్నా 48 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఏసీ ఫస్ట్ క్లాస్/ఎగ్జిక్యూటీవ్ క్లాస్‌కు రూ.240, ఏసీ 2 టైర్/ఫస్ట్ క్లాస్ బుకింగ్స్‌కు రూ.200, ఏసీ 3 టైర్/ఏసీ చైర్ కార్/ఏసీ 3 ఎకానమీ క్లాస్ బుకింగ్స్‌కు రూ.180, స్లీపర్ క్లాస్ బుకింగ్స్‌కు రూ.120, సెకండ్ క్లాస్ బుకింగ్స్‌కు రూ.60 క్యాన్సలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు నుంచి 12 గంటల వరకు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఫేర్‌లో 25 శాతం క్యాన్సలేషన్ ఛార్జీ ఉంటుంది. చార్ట్ ప్రిపేర్ చేయడానికి 12 గంటల ముందు నుంచి 4 గంటల ముందు వరకు 50 శాతం క్యాన్సలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి.



Read this: IRCTC-SBI offer: ఫ్రీగా రైలు టికెట్... 10% క్యాష్‌బ్యాక్... ఆఫర్ ఇలా పొందండి

చార్ట్ ప్రిపరేషన్ తర్వాత టికెట్ క్యాన్సలేషన్


ఐఆర్‌సీటీసీలో బుక్ చేసిన టికెట్లను చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఇందుకోసం టికెట్ హోల్డర్స్ ఆన్‌లైన్ టీడీఆర్ ఫైలింగ్ చేయాలి. ఒక్కసారి టీడీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఐఆర్‌సీటీసీలో ట్రాక్ చేయొచ్చు. మీకు రిజర్వేషన్ కన్ఫామ్ అయిన తర్వాత రైలు బయల్దేరే సమయానికి నాలుగు గంటల లోపు ఇ-టికెట్ క్యాన్సిల్ చేయకపోయినా, టీడీఆర్ ఫైల్ చేయకపోయినా రీఫండ్ వర్తించదు. టికెట్ ఆర్ఏసీలో ఉంటే రైలు బయల్దేరే సమయానికి 30 నిమిషాల ముందు ఇ-టికెట్ క్యాన్సిల్ చేయకపోయినా, టీడీఆర్ ఫైల్ చేయకపోయినా రీఫండ్ వర్తించదు. ఒకరికన్నా ఎక్కువ ప్రయాణికులు ఉండి, కొందరికి టికెట్ కన్ఫామ్ అయి, ఇంకొందరికి ఆర్ఏసీ ఉన్న పరిస్థితుల్లో కన్ఫామ్ అయిన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ వస్తుంది. అయితే రైలు బయల్దేరే సమయానికి 30 నిమిషాల ముంది టికెట్ క్యాన్సిల్ చేయాలి.OPPO Reno: 'ఒప్పో రెనో' 10x జూమ్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

IRCTC: రైలులో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్‌సీటీసీ

PAN Card: మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేయండి ఇలా

Business Loan: ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల లోన్... పొందండి ఇలా
First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>