Home /News /business /

WANT TO BUY TWO WHEELER ON LOAN CHECK TO INTEREST RATES OFFERED BY BANKS AK GH

Two wheeler loan: లోన్ తీసుకొని బైక్ కొనాలనుకుంటున్నారా ? తక్కువ వడ్డీ‌తో లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కాలంలో చాలామంది అప్పు చేసైనా ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అటువంటి వారికోసం కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే టూ-వీలర్ లోన్స్ అందిస్తున్నాయి.

బైకు లేదా స్కూటర్ కొనాలని ఎవరికుండదు చెప్పండి? కానీ పూర్తి మొత్తం చెల్లించి బైక్ కొనుగోలు చేసేంత ఆర్థిక స్తోమత చాలామందికి ఉండదు. అయితే కరోనా కాలంలో చాలామంది అప్పు చేసైనా ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అటువంటి వారికోసం కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే టూ-వీలర్ లోన్స్ అందిస్తున్నాయి. అవేంటో చూద్దాం!

టూ-వీలర్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. వివిధ బ్యాంకుల ఆఫర్‌లను క్షుణ్నంగా పరిశీలించి.. ఆ తర్వాత మీ అవసరాలకు తగిన లోన్ తీసుకోవాలి. మీకు వర్తించే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ ఛార్జీలు తదితర సమాచారం తెలుసుకున్న తర్వాతే రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేగంగా రుణాలు పొందాలంటే ముందుగా మీ ప్రస్తుత బ్యాంకు నుంచి మీకు ఏదైనా ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా డాక్యుమెంట్స్ సమర్పించాలని అడుగుతుంది. ఏజ్ లేదా ఐడెంటిటీ ప్రూఫ్, ఇన్ కమ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇలా రకరకాల పత్రాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ గురించి ముందస్తుగానే తెలుసుకొని.. వాటిని ఏర్పాటు చేసుకోవడం వల్ల లోన్ ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకునే అర్హత ఉన్నప్పటికీ.. మీరు కట్టగలిగినంత రుణం మాత్రమే తీసుకోండి. అలాగే ప్రతి నెల కట్టాల్సిన ఇన్‌స్టాల్‌మెంట్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోండి.

ద్విచక్ర వాహనాల రుణాలను తక్కువ వడ్డీ రేట్లకు అందిస్తోన్న టాప్ 10 బ్యాంకులు.. మూడేళ్ల లోపు తిరిగి చెల్లించేలా ఉన్న ఈఏంఐలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1. Central Bank of India - వార్షిక వడ్డీ రేటు 7.25%.. EMI - రూ.3,099 (మూడేళ్ల లోపు చెల్లించాలి)

2. Bank of India - వడ్డీ రేటు 7.35%.. EMI - రూ.3,104

3. UCO Bank - వడ్డీ రేటు 7.45%.. EMI - రూ.3,108

4. Punjab National Bank - వడ్డీ రేటు 8.70%.. EMI - రూ.3,166

5. Jammu & Kashmir Bank - వడ్డీ రేటు 8.70%.. EMI - రూ.3,166

6. Punjab & Sind Bank - వడ్డీ రేటు 8.80%.. EMI - రూ.3,171

7. Canara Bank - వడ్డీ రేటు 9.00%.. EMI - రూ.3,180

8. Axis Bank - వడ్డీ రేటు 9.00%.. EMI - రూ.3,180

9. ICICI Bank - వడ్డీ రేటు 9.50%.. EMI - రూ.3,203

10. IDBI Bank - వడ్డీ రేటు 9.80%.. EMI - రూ.3, 217

పైన పేర్కొన్న వడ్డీ రేట్లు మీ వయస్సు, ఆదాయం, క్రెడిట్ స్కోర్, రుణ మొత్తం, బ్యాంకు నిబంధనలు ఆధారంగా మారే అవకాశం ఉంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Bank loans, Two wheeler

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు