Home /News /business /

WANT TO BUY NEW CAR KNOW WHICH BANK OFFERS LOWER INTEREST RATES FOR CAR LOANS SS

Car Loan: కొత్త కార్ కొంటారా? అతి తక్కువ ఈఎంఐతో లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే

Car Loan: కొత్త కార్ కొంటారా? అతి తక్కువ ఈఎంఐతో లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Car Loan: కొత్త కార్ కొంటారా? అతి తక్కువ ఈఎంఐతో లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Car Loan EMI | మీరు కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? కార్ లోన్ (Car Loan) తీసుకొని ఇంటికి కొత్త వాహనం తీసుకురావాలని అనుకుంటున్నారా? బ్యాంకులు అతి తక్కువ వడ్డీకే కార్ లోన్ అందిస్తున్నాయి.

    కొత్త కార్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. తక్కువ ఈఎంఐతో (Car Loan EMI) మీ డ్రీమ్ కార్ సొంతం చేసుకోవచ్చు. గత రెండేళ్లుగా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కార్ లోన్ వడ్డీ రేట్లు (Car Loan Interest Rates) దిగొచ్చాయి. దీంతో కస్టమర్లు అతి తక్కువ వడ్డీకే రుణాలు పొందగలుగుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్... ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులన్నీ పోటాపోటీగా తక్కువ వడ్డీకే వాహన రుణాలు అందిస్తున్నాయి. రూ.10 లక్షల కారును ఈఎంఐ ద్వారా తీసుకోవాలంటే నెలకు ఈఎంఐ చెల్లించాలి? వడ్డీ రేటు ఎంత? ఏ బ్యాంకులో వడ్డీ తక్కువగా ఉంటుంది? తెలుసుకోండి.

    పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.10,00,000 కార్ లోన్ తీసుకుంటే 6.65 శాతం వడ్డీ చెల్లించాలి. ఏడేళ్ల టెన్యూర్ ఎంచుకుంటే రూ.14,922 ఈఎంఐ చెల్లించాలి. ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో 6.8 శాతం వడ్డీ ఉంటుంది. ఏడేళ్ల టెన్యూర్‌కు రూ.14,995 ఈఎంఐ చెల్లించాలి. బ్యాంక్ ఆఫ్ ఇండియా వాహన రుణాలకు 6.85 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ఏడేళ్ల టెన్యూర్‌కు రూ.15,019 ఈఎంఐ చెల్లించాలి.

    IRCTC Tour: ఐఆర్‌సీటీసీ 'టెంపుల్ రన్' ప్యాకేజీ... హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్

    ఇండియన్ బ్యాంకులో రూ.10,00,000 కార్ లోన్ తీసుకుంటే 6.9 శాతం వడ్డీ వసూలు చేస్తోంది బ్యాంకు. ఏడేళ్ల టెన్యూర్‌కు రూ.15,044 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 7 శాతం వడ్డీ ఛార్జ్ చేస్తోంది. ఏడేళ్ల టెన్యూర్ ఎంచుకుంటే రూ.15,093 ఈఎంఐ చెల్లించాలి. ఇక అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.25 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ఈ లెక్కన ఏడేళ్ల టెన్యూర్‌కు రూ.15,215 ఈఎంఐ చెల్లించాలి.

    Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌తో రూ.14 లక్షల రిటర్న్స్... ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా

    ప్రైవేట్ బ్యాంకుల్లో కార్ లోన్ వివరాలు చూస్తే యాక్సిస్ బ్యాంక్ 7.45 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ఏడేళ్ల టెన్యూర్‌తో రూ.10,00,000 లోన్ తీసుకుంటే రూ.15,314 ఈఎంఐ చెల్లించాలి. ఐసీఐసీఐ బ్యాంకులో 7.50 శాతం వడ్డీ చెల్లించాలి. ఈ లెక్కన ఏడేళ్ల టెన్యూర్‌కు రూ.15,338 ఈఎంఐ చెల్లించాలి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 6.95 వడ్డీ చెల్లించాలి. ఈ లెక్కన రూ.15,068 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

    ప్రైవేట్ బ్యాంకులతో పోటీపడి మరీ ప్రభుత్వ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీకే వాహన రుణాలు అందిస్తుండటం విశేషం. ప్రైవేట్ బ్యాంకుల్లో ఏడు శాతం పైనే వడ్డీ రేట్లు ఉన్నాయి. కార్ లోన్‌కు అప్లై చేస్తే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. బ్యాంకును బట్టి ప్రాసెసింగ్ ఫీజులో మార్పులు ఉంటాయి. గరిష్టంగా రూ.5,000 వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank loan, Car loans, Personal Finance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు