Home /News /business /

Car Loan: కార్ లోన్ తీసుకోవాలా? ఈ బ్యాంకుల్లో వడ్డీ రేటు తక్కువ

Car Loan: కార్ లోన్ తీసుకోవాలా? ఈ బ్యాంకుల్లో వడ్డీ రేటు తక్కువ

Car Loan: కార్ లోన్ తీసుకోవాలా? ఈ బ్యాంకుల్లో వడ్డీ రేటు తక్కువ
(ప్రతీకాత్మక చిత్రం)

Car Loan: కార్ లోన్ తీసుకోవాలా? ఈ బ్యాంకుల్లో వడ్డీ రేటు తక్కువ (ప్రతీకాత్మక చిత్రం)

Car Loan | మీరు కొత్త కార్ కొనాలని అనుకుంటున్నారా? అనేక బ్యాంకులు తక్కువ వడ్డీకే కార్ లోన్ ఇస్తున్నాయి. మరి ఏ బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేట్లు (Car Loan Interest Rates) తక్కువగా ఉన్నాయో తెలుసుకోండి.

    ఒకప్పుడు కారును విలాసవంతమైన వస్తువుగా భావించేవారు. కారును కొనుగోలు చేయడాన్ని కొందరు జీవితకాల లక్ష్యంగా పెట్టుకునేవారు. ఇందుకు ఒకేసారి భారీ మొత్తంలో డబ్బును వెచ్చించేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆలోచనా విధానం సైతం మారింది. ప్రస్తుతం కారును చాలామంది ఒక అవసరంగా భావిస్తున్నారు. దీంతో ఇటీవల కార్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి వివిధ బ్యాంకులు ప్రత్యేకంగా కార్ లోన్ (Car Loan) సైతం అందిస్తున్నాయి. అయితే కొత్త టెక్నాలజీ, పరిమిత వనరులతో కార్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో దాచుకున్న సేవింగ్స్‌ నిధులతో మాత్రమే కారును కొనుగోలు చేయడం కష్టతరంగా మారింది. అందువల్ల కొత్త, సెకండ్ హ్యాండ్ కార్ల (Second Hand Car) కొనుగోలుకు బ్యాంకులు ఫైనాన్సింగ్ సదుపాయం కల్పిస్తున్నాయి.

    కార్‌ లోన్‌ ప్రయోజనాలు


    కారు కొనుగోలుకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం వల్ల ప్రజల బడ్జెట్ ప్రణాళికలు దెబ్బతింటాయి. దీంతోపాటు లిక్విడ్ క్యాష్‌తో భారీ కొనుగోళ్లు చేపట్టడం వల్ల ఆదాయపు పన్ను శాఖ వర్గాల దృష్టిలో పడవచ్చు. కార్‌ లోన్‌లను ఎంచుకోవడం వల్ల ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కస్టమర్లు తీసుకున్న కార్‌ లోన్‌‌ను ఈఎంఐ రూపంలో నిర్ణీత వ్యవధిలో బ్యాంకులకు తిరిగి చెల్లించవచ్చు. దీనివల్ల ప్రస్తుత, భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకున్న నిధులను వినియోగించకుండానే కారును సొంతం చేసుకోవచ్చు. దీనికి తోడు కార్‌ లోన్‌ పొందడానికి ఆస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం కూడా లేదు.

    Health Insurance: సీనియర్ సిటిజన్లకు మొదటి రోజు నుంచే కవరేజ్... ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కొత్త పథకం

    కార్‌ లోన్‌‌ రీపేమెంట్ సైకిల్‌ను కచ్చితంగా పాటించడం ద్వారా క్రెడిట్ హిస్టరీని మెరుగుపరచుకోవచ్చు. మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్నవారు భవిష్యత్తులో మరిన్ని రకాల లోన్లను సులభంగా పొందవచ్చు. అందువల్ల కార్‌ లోన్‌లు సొంత కారును కొనుగోలు చేయడానికి చాలా సురక్షితమైన, నిర్దిష్ట మార్గంగా చెప్పుకోవచ్చు.

    వడ్డీ రేట్ల పరిస్థితి ఏంటి?


    కస్టమర్లు తమ అవసరాన్ని బట్టి కొత్త లేదా ఉపయోగించిన (సెకండ్ హ్యాండ్) కారును ఎంచుకోవచ్చు. చాలా మంది కొత్త కార్ల కొనుగోలు కోసమే లోన్ తీసుకుంటారు. ఇలా తీసుకున్న లోన్‌ను EMIల రూపంలో వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కార్ లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి బ్యాంకులు 1-8 సంవత్సరాల రీపేమెంట్ గడువును అందిస్తున్నాయి. ఇతర లోన్‌లతో పోల్చినప్పుడు కార్‌ లోన్‌లను సులభంగా, తక్కువ డాక్యుమెంటేషన్‌తో పొందవచ్చు. వాహనం ఆన్-రోడ్ ధరలో 100 శాతం వరకు లోన్‌ పొందవచ్చు.

    ఇతర డెట్ ఇన్‌స్ట్రుమెంట్ల మాదిరిగానే కార్ లోన్ వడ్డీ రేట్లు కూడా RBI నిర్దేశించిన బేస్ రేటుతో అనుసంధానమై ఉంటాయి. అయితే వడ్డీ రేట్లు బ్యాంకులను బట్టి మారుతుంటాయి. లోన్ అమౌంట్, కాలవ్యవధి, క్రెడిట్ హిస్టరీ వంటి అంశాలు కార్ లోన్ వడ్డీ రేటును ప్రభావితం చేస్తాయి. దీనికి తోడు ఫిక్స్‌డ్ వడ్డీ రేటు వర్తించే లోన్లు, వడ్డీ రేట్లు తరచుగా మారే ఫ్లోటింగ్ ఇంట్రస్ట్ రేట్లను బ్యాంకులు అమలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 7-10 శాతం వరకు వడ్డీతో లోన్లు ఆఫర్ చేస్తున్నాయి. వీటికి ప్రాసెసింగ్ ఫీజులు అదనం.

    LIC Premium: ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడానికి డబ్బులు లేవా? ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్

    కార్ లోన్ వడ్డీ రేట్ల వివరాలు


    కొన్ని భారతీయ బ్యాంకులు ఏడాదికి 7 శాతం నుంచి ప్రారంభమవుతున్న కార్‌ లోన్‌ వడ్డీరేటుతో.. 8 ఏళ్ల గడువుతో ఫైనాన్స్ ఆప్షన్లను అందిస్తున్నాయి. ఈ జాబితాలో అతి తక్కువ వడ్డీ రేట్లను అందిస్తోన్న బ్యాంకులు, లోన్లపై విధిస్తున్న ప్రాసెసింగ్ ఫీజులను పోల్చి చూద్దాం.

    బ్యాంక్ ఆఫ్ బరోడా


    బ్యాంక్ ఆఫ్ బరోడా అతి తక్కువగా.. కేవలం 7 శాతం వడ్డీతోనే కార్‌ లోన్‌‌ను అందిస్తోంది. దీనికి రూ.1,500 (ప్లస్ GST) వరకు ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది.

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


    SBI కార్ లోన్ వడ్డీ రేటు 7.20 శాతం నుంచి ప్రారంభమవుతుంది. కొత్త కారు కొనుగోలుకు లోన్ తీసుకునే వారి నుంచి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయరు. అయితే ఈ ఆఫర్ 2022 జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

    కెనరా బ్యాంక్


    కెనరా బ్యాంక్ సైతం ఏడాదికి 7.30 శాతం వడ్డీరేటుతో కార్‌ లోన్‌లు అందిస్తోంది. అయితే లోన్ మొత్తంపై 0.25 శాతాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తోంది. ఈ మొత్తం కనిష్టంగా రూ.1,000 నుంచి రూ.5,000 మధ్య ఉంటుంది.

    యాక్సిస్ బ్యాంక్


    యాక్సిస్ బ్యాంక్ కార్ లోన్ వడ్డీ రేటు 7.45 శాతంగా ఉంది. లోన్‌పై కనిష్టంగా రూ.3,500, గరిష్టంగా రూ.7,000 ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది.

    Pension Scheme: నెలకు రూ.210 దాచుకుంటే రూ.5,000 పెన్షన్... స్కీమ్ వివరాలు ఇవే

    ఐసీఐసీఐ


    ICICI బ్యాంక్ కార్ లోన్ వడ్డీ రేటు 7.90 శాతం నుంచి ప్రారంభమవుతుంది. రుణ మొత్తంలో 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజును బ్యాంకు వసూలు చేస్తుంది.

    ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్


    ఈ బ్యాంకు సైతం ఎనిమిది శాతం లోపు వడ్డీ రేట్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. కార్ లోన్లపై ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ 7.55 శాతం వడ్డీరేటును విధిస్తోంది.

    HDFC


    హెచ్‌డీఎఫ్‌డీ బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేట్లు 7.95 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి.

    కరూర్ వైశ్యా బ్యాంక్


    ఈ బ్యాంకులో కార్ లోన్లపై వడ్డీ 7.8 శాతం నుంచి ప్రారంభమవుతుంది.

    IDBI బ్యాంక్


    ఐడీబీఐ బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేట్లు 7.35 శాతం (ఫ్లోటింగ్ రేట్లు) నుంచి ప్రారంభమవుతున్నాయి.

    పంజాబ్ నేషనల్ బ్యాంక్


    పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్ లోన్ వడ్డీ రేట్లు అతి తక్కువగా 6.90 శాతం నుంచే ఉన్నాయి.

    Airtel 1.5GB Data Plan: రోజూ 1.5జీబీ డేటా వాడుతున్నారా? ఎయిర్‌టెల్ లేటెస్ట్ ప్లాన్స్ ఇవే

    యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


    ఈ బ్యాంకు కార్ లోన్లపై విధిస్తున్న వడ్డీరేట్లు 7.40 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి.

    గమనిక: ఈ వడ్డీరేట్లు 2021 నవంబర్ 8 నాటికి అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు కార్ లోన్‌ను ఎంచుకోవాలని భావించినప్పుడు సంబంధిత బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వడ్డీ రేట్ల వివరాలు తెలుసుకోవడం మంచిది.

    2021లో అందుబాటులో ఉన్న ఉత్తమ కార్ లోన్ ప్రొడక్ట్స్.. వాటిని అందించే బ్యాంకుల జాబితా..

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- లగ్జరీ కార్ల లోన్‌కు బెస్ట్ ఆప్షన్


    లగ్జరీ కారును కొనుగోలు చేసేవారికి హెచ్‌డీఎఫ్‌డీ బ్యాంకు తక్కువ వడ్డీతో లోన్లు అందిస్తోంది. ఈ బ్యాంకు 7.95 శాతం వడ్డీతో కార్ లోన్లు అందిస్తోంది. వాయిదాలు చెల్లించే రుణ వ్యవధి 84 నెలల వరకు ఉంటుంది. గరిష్ట రుణ మొత్తం రూ. 3 కోట్ల వరకు ఉండటం మరో విశేషం. కొన్ని రకాల మోడళ్ల ఆన్‌ రోడ్ ధరలపై 100 శాతం ఫైనాన్స్ ఆప్షన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తోంది.

    ICICI బ్యాంక్- ఆన్‌ రోడ్ ఫైనాన్సింగ్‌


    ఎక్కువ మొత్తంలో ఆన్‌ రోడ్ ఫైనాన్సింగ్‌ పొందాలనుకునే వారికి ఐసీఐసీఐ బ్యాంక్ కార్ లోన్ ఉత్తమమైనది. బ్యాంకు కార్‌ లోన్ వడ్డీ రేటు 7.90% నుంచి ప్రారంభమవుతుంది. 84 నెలల రీపేమెంట్ గడువు ఆప్షన్‌ను కస్టమర్లు ఎంచుకోవచ్చు. వాహన ధరలపై 100 శాతం ఫైనాన్స్‌ను బ్యాంకు అందిస్తుంది. కానీ కారు మోడల్, ధర, కస్టమర్ ప్రొఫైల్ వంటి వాటిపై ఆధారపడి రుణం మొత్తం మారవచ్చు. ప్రీ-క్వాలిఫైడ్, ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్‌లు ఈ ఆఫర్‌ పొందవచ్చు.

    Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌తో రిస్క్ లేకుండా లక్షాధికారి కావొచ్చు... పొదుపు చేయండి ఇలా

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఇన్‌కమ్ ప్రూఫ్ లేనివారికి..


    ఎలాంటి ఇన్‌కమ్ ప్రూఫ్‌ లేని ప్రొఫెషనల్స్, రైతులు ఎస్‌బీఐ నుంచి కార్‌ లోన్ తీసుకోవచ్చు. ఈ బ్యాంకు వడ్డీ రేటు 7.20% నుంచి ప్రారంభమవుతుంది. లోన్ ఆప్షన్ 84 నెలల పాటు ఉంటుంది. ఆన్-రోడ్ ధరలో 90% వరకు ఫైనాన్స్ పొందవచ్చు.

    యాక్సిస్ బ్యాంక్- చిన్న మొత్తంలో లోన్


    తక్కువ మొత్తంలో కార్ లోన్ కావాలనుకునే వారు యాక్సిస్ బ్యాంక్‌ను ఎంచుకోవచ్చు. యాక్సిస్ కార్ లోన్ వడ్డీ రేటు 7.45% నుంచి ప్రారంభమవుతుంది. కస్టమర్లు 96 నెలల వరకు లోన్ రీపేమెంట్ పీరియడ్‌ను ఎంచుకోవచ్చు. ఆన్-రోడ్ ధరలో 100% వరకు లోన్ పొందవచ్చు. కొన్ని మోడళ్లపై రూ.1 లక్ష వరకు లోన్ పొందవచ్చు.

    ఫెడరల్ బ్యాంక్- వ్యక్తిగత ప్రమాద బీమా ఆఫర్


    ఫెడరల్ బ్యాంక్ కార్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారు ఉచిత ప్రమాద బీమా ఆఫర్‌ను పొందవచ్చు. కార్ లోన్ వడ్డీ రేట్లు 8.50% నుంచి ప్రారంభమవుతాయి. రుణ వ్యవధి 84 నెలల వరకు ఉంటుంది. వాహనం ఎక్స్-షోరూమ్ ధరలో 100% వరకు లోన్ తీసుకోవచ్చు.

    కెనరా బ్యాంక్ - పాత, కొత్త కార్లకు లోన్


    ఈ బ్యాంకు సెకండ్ హ్యాండ్ కార్లతో పాటు కొత్త కార్లపై అతి తక్కువ వడ్డీతో లోన్ అందిస్తోంది. కెనరా బ్యాంక్ కార్ లోన్ వడ్డీ రేటు 7.30% వద్ద ప్రారంభమవుతుంది. కస్టమర్లు 84 నెలల వరకు లోన్ రీపేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. వాహనాల ఆన్-రోడ్ ధరలో 90% వరకు లోన్ పొందవచ్చు. అదనంగా మహిళలకు తక్కువ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Auto News, Automobiles, Bank loan, Bank loans, CAR, Car loans, Cars

    తదుపరి వార్తలు