హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tatkal Ticket: ఈ టిప్స్‌తో తత్కాల్ టికెట్ ఈజీగా బుక్ చేయొచ్చు ఇలా

Tatkal Ticket: ఈ టిప్స్‌తో తత్కాల్ టికెట్ ఈజీగా బుక్ చేయొచ్చు ఇలా

Tatkal Ticket: ఈ టిప్స్‌తో తత్కాల్ టికెట్ ఈజీగా బుక్ చేయొచ్చు ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Tatkal Ticket: ఈ టిప్స్‌తో తత్కాల్ టికెట్ ఈజీగా బుక్ చేయొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Tatkal Ticket | తత్కాల్ పద్ధతిలో ట్రైన్ టికెట్ (Train Tickets) విజయవంతంగా బుక్ చేయడం ఓ సవాల్. అయితే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా తత్కాల్ టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ పెంచుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

చివరి నిమిషంలో జర్నీ ప్లాన్ చేసుకునేవారికి తత్కాల్ టికెట్స్ (Tatkal Tickets) ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. వారం పది రోజులు లేదా అంతకన్నా ముందు జర్నీ ప్లాన్ చేసుకునేవారు రైలు టికెట్లు సులువుగా రిజర్వేషన్ చేయొచ్చు. రద్దీ ఉంటే తప్ప వారికి ఈజీగానే బెర్తులు కన్ఫామ్ అవుతుంటాయి. కానీ చివరి నిమిషంలో జర్నీ ప్లాన్ చేసుకునేవారికి రైలు టికెట్లు (Train Tickets) అంత ఈజీగా దొరకవు. రిజర్వేషన్ చేయించినా టికెట్లు దొరుకుతాయన్న గ్యారెంటీ ఉండదు. చివరి నిమిషంలో ప్రయాణాలు ప్లాన్ చేసుకునేవారి కోసం తత్కాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతుంది భారతీయ రైల్వే (Indian Railways). వీటిని బుక్ చేయడానికి నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు పోటీపడుతుంటారు.ఏ రైలులో అయినా ఐఆర్‌సీటీసీ తత్కాల్ పద్ధతి ద్వారానే 7 నుంచి 10 శాతం వరకు రైలు టికెట్లు బుక్ అవుతుంటాయి. తత్కాల్ టికెట్లకు కూడా పోటీ ఎక్కువ. అందుకే ఈ టికెట్లు కూడా అంత సులువుగా దొరకవు. యూజర్లకు ఎక్కువగా 503 Error వస్తుంది. అయితే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా తత్కాల్ టికెట్లు విజయవంతంగా బుక్ అయ్యేలా చేయొచ్చు.
PAN Card: మీ స్మార్ట్‌ఫోన్‌లో పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

వివరాలు సిద్ధంగా ఉన్నాయా?


రైల్వే ప్రయాణికులు ముందుగానే కొన్ని వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. తత్కాల్ టికెట్ బుక్ చేసే సమయంలో వివరాల కోసం తడుముకోకుండా ముందుగానే లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ముందుగానే లాగిన్ అయి మై ప్రొఫైల్ సెక్షన్‌లో మాస్టర్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి. అందులో ప్రయాణికుల వివరాలన్నీ ఉండాలి. మాస్టర్ లిస్ట్‌లోని వివరాలతో ఎప్పుడైనా టికెట్లు బుక్ చేయొచ్చు.
మీరు తత్కాల్ టికెట్ బుక్ చేయాలనుకుంటే ప్రతీ ట్రిప్‌కు ట్రావెల్ లిస్ట్ ప్రత్యేకంగా ప్రిపేర్ చేయండి. బుకింగ్ సమయంలో ఈ వివరాలే ఆటోమెటిక్‌గా ఫిల్ అవుతాయి. మీరు ప్రత్యేకంగా వివరాలన్నీ మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం లేదు. తత్కాల్ టికెట్ బుక్ చేసేప్పుడు చాలామంది చేసే పొరపాటు స్టేషన్ కోడ్ సరిగ్గా ఎంటర్ చేయకపోవడం.
Credit Card: క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి

బెర్త్ విషయంలో ఇలా


తత్కాల్ బుకింగ్ ప్రారంభం కాకముందే స్టేషన్ కోడ్స్ సెర్చ్ చేసి నోట్ చేసి పెట్టుకోవాలి. అవసరమైతే నోట్‌ప్యాడ్ ఫైల్‌లో కాపీ చేసి పెట్టుకోవాలి. అంతేకాదు, బెర్త్ ప్రిఫరెన్స్ కూడా ముందుగానే ఆలోచించి పెట్టుకోవాలి. అత్యవసర ప్రయాణం కాబట్టి బెర్త్ ప్రిఫరెన్స్ ఎంచుకోకపోవడమే మంచిది. ఏ బెర్త్ దొరికితే ఆ బెర్తులో వెళ్లేందుకు సిద్ధంగా ఉండటమే మంచిది. వృద్ధులు, మహిళలు, గర్భిణీల కోసం తత్కాల్ టికెట్లు బుక్ చేస్తుంటే మాత్రం లోయర్ బెర్త్ సెలెక్ట్ చేయక తప్పదు. ఏ బెర్త్ అయినా ఫర్వాలేదు అనుకుంటే బెర్త్ ప్రిఫరెన్స్ ఎంచుకోకూడదు.


తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్స్ చూస్తే ఏసీ క్లాస్‌కు ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ క్లాసులకు ఉదయం 11 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది. ఏ రైలుకైనా ముందు రోజే తత్కాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అంటే రేపు బయల్దేరాల్సిన రైలుకు మాత్రమే ఇవాళ తత్కాల్ టికెట్లు తీసుకోవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Indian Railways, IRCTC, Train tickets

ఉత్తమ కథలు