డెబిట్ కార్డ్ తరహాలో చాలా మంది క్రెడిట్ కార్డ్ (Credit Card) కూడా వినియోగిస్తున్నారు. అయితే చాలా కార్డులకు యాన్యువల్ ఫీజు (Annual Fees) చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కార్డులకు అధిక రివార్డు పాయింట్లతో (Reward Points) అధిక వార్షిక రుసుమును బ్యాంకు వసూలు చేస్తుంది. మరికొన్ని బ్యాంకులు రీజనబుల్ రివార్డు పాయింట్లతో సున్నా వార్షిక రుసుముతో కూడా క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తున్నాయి. క్రెడిట్ కార్డును తక్కువగా ఉపయోగించే వారు జీరో- యాన్యువల్ ఫీజులతో కార్డులను దీర్ఘకాలం వినియోగించుకోవచ్చు. ఇది మీ అప్పులను అదుపులో ఉంచడంతోపాటు, క్రెడిట్ స్కోరు పెంచుకోవడానికి కూడా ఉపకరిస్తుంది. ప్రస్తుతం వార్షిక రుసుము వసూలు చేయకుండా అందుబాటులో ఉన్న క్రెడిట్ కార్డులను పరిశీలిద్దాం.
ఐసీఐసీఐ బ్యాంకు అమెజాన్ పే భాగస్వామ్యంతో అందిస్తున్న క్రెడిట్ కార్డు ద్వారా వినియోగదారులు మంచి లబ్ధి పొందవచ్చు. అమెజాన్ పే ప్రైమ్ సభ్యులు, నాన్ ప్రైమ్ సభ్యులకు వరుసగా 5, 3 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఈ కార్డు అందిస్తోంది. షాపింగ్, డైనింగ్, ఇన్సూరెన్స్, ప్రయాణ ఖర్చులపై 1 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపులతో పాటు మరెన్నో ప్రయోజనాలు పొందవచ్చు.
Jio New Plans: నేటి నుంచి జియో కొత్త ప్లాన్స్... ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే
బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన వారికి యాక్సిస్ బ్యాంకు ఇన్‌స్టా ఈజీ క్రెడిట్ కార్డులను (Axix Bank Insta Easy Credit Card) జారీ చేస్తోంది. వీటికి ఫిక్స్‌డ్ డిపాజిట్ విలువలో 80 శాతం వరకు క్రెడిట్ లిమిట్ ఉంటుంది. క్రెడిట్ లిమిట్‌లో 100 శాతం క్యాష్ విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ కార్డులకు ఎలాంటి యాన్యువల్ చార్జీలు వర్తించవు. రెస్టారెంట్లలో 15 శాతం తగ్గింపు, 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపులు అందిస్తోంది.
హెచ్‌ఎస్‌బీసీ వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్ కూడా జీరో యాన్యువల్ ఫీజుతో లభిస్తుంది. దీని ద్వారా ఇంధన వినియోగంపై సంవత్సరానికి రూ.3,000 ప్రయోజనం పొందవచ్చు. టాటా క్లిక్(TATA CliQ)లో షాపింగ్ చేసేటప్పుడు 15 శాతం తగ్గింపు లభిస్తుంది. బుక్ మై షో (Bookmyshow)లో సినిమా టిక్కెట్లను బుక్ చేసుకుంటే ఆఫర్లు అందిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల లాంజ్‌లలో మూడుసార్లు కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. ఈ కార్డు పొందాలంటే కనీస వార్షిక ఆదాయం రూ.4 లక్షలు ఉండాలి.
Post Office Scheme: రోజూ రూ.50 దాచుకుంటే... రూ.35 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు
ఐసీఐసీఐ ప్లాటినం చిప్ కార్డ్ ద్వారా రిటైల్ కొనుగోళ్లపై రూ.100 ఖర్చు చేస్తే 2 శాతం పేబ్యాక్ పాయింట్లు లభిస్తాయి.యుటిలిటీస్, బీమా కేటగిరీలపై రూ.100 ఖర్చు చేస్తే 1 పాయింట్ పేబ్యాక్ లభిస్తుంది. 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు లభిస్తుంది. 12 ప్రధాన నగరాల్లో డైనింగ్ బిల్లులపై 15 శాతం ఆదా చేసుకోవచ్చు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యాపారులకు ప్రత్యేకంగా కోటక్ గోల్డ్ ఫార్చ్యూన్ క్రెడిట్ కార్డ్ ( Kotak Gold fortune Credit Card) అందిస్తోంది. ఏటా రూ.1.5 లక్షల ఖర్చులపై పీవీఆర్ మూవీ టిక్కెట్లను ఉచితంగా అందిస్తోంది. 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాంపులతో పాటు మరెన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఈ కార్డు పొందాలంటే కనీస వార్షిక ఆదాయం రూ.3లక్షలు ఉండాలి.
Post Office Scheme: రూ.1 కోటి రిటర్న్స్ కావాలా? ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ మీకోసమే
క్రెడిట్ కార్డులను ఆర్థిక క్రమశిక్షణతో ఉపయోగించుకోవాలి. క్రెడిట్ కార్డుల ద్వారా వడ్డీ రహిత నగదు పొందవచ్చు. దీని వల్ల ఎక్కువ ఖర్చు చేసే ధోరణి పెరిగిపోవచ్చు. తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం కన్నా ఎక్కువ ఖర్చు చేసి, సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోతే 28-49 శాతం వరకు వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా చెల్లింపులు చేయడం వల్ల అదనపు రుసుములు కూడా విధిస్తారు. క్రెడిట్ కార్డు ఫీజులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సంస్థల అధికారిక వెబ్‌సైట్లు సందర్శించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit cards, Personal Finance