లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్... ప్రభుత్వానికి చెందిన ఈ బీమా సంస్థలో అన్ని వర్గాలకు కావాల్సిన ఇన్స్యూరెన్స్ పాలసీలు ఉంటాయి. వాటిలో ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి(Plan 818) పెన్షన్ ప్లాన్. మీరు కొన్నేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే చాలు. మెచ్యూరిటీ తర్వాత నెలనెలా పెన్షన్ లభిస్తుంది. ఈ పాలసీలో రెండు ప్రీమియం ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ ప్రీమియం, రెండోది రెగ్యులర్ ప్రీమియం. సింగిల్ ప్రీమియం ఆప్షన్ ఎంచుకుంటే మీరు ఒకసారి ప్రీమియం చెల్లిస్తే చాలు. రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్లో ఏటేటా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్నవారికి లోన్ సదుపాయం కూడా ఉంటుంది. ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Read this:
LIC Policy: రోజుకు రూ.206 పొదుపుతో 20 ఏళ్లలో రూ.27 లక్షలు

LIC New Jeevan Nidhi: ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి ప్లాన్ వివరాలు ఇవే...
వయస్సు: కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా సింగిల్ ప్రీమియం అయితే 58 ఏళ్లు, రెగ్యులర్ ప్రీమియంకు 60 ఏళ్లు.
పాలసీ టర్మ్: కనీసం 5 ఏళ్లు, గరిష్టంగా 35 ఏళ్లు.
మెచ్యూరిటీ వయస్సు: 55 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య.
ప్రీమియం చెల్లింపు: నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికోసారి.
పాలసీ హామీ మొత్తం(Sum Assured): సింగిల్ ప్రీమియంకు కనీసం రూ.1 లక్ష, రెగ్యులర్ ప్రీమియంకు కనీసం రూ.1.5 లక్షలు. గరిష్ట పరిమితి లేదు.
LIC New Jeevan Nidhi: ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి ప్లాన్ బెనిఫిట్స్ ఇవే...
పాలసీ హోల్డర్ మెచ్యూరిటీ తేదీ కన్నా ముందే చనిపోతే నామినీకి డెత్ బెనిఫిట్ లభిస్తుంది.
పాలసీ తీసుకున్న 5 ఏళ్లలోపు చనిపోతే సమ్ అష్యూర్డ్+గ్యారెంటీ అడిషన్స్ లభిస్తాయి.
పాలసీ తీసుకున్న 5 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ తేదీ కన్నా ముందు చనిపోతే సమ్ అష్యూర్డ్+గ్యారెంటీ అడిషన్స్+సింపుల్ రివర్షనరీ బోనస్+ఫైనల్ అడిషనల్ బోనస్ లభిస్తుంది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCC కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
Read this:
LIC Online Policy: ఆన్లైన్లో ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే డిస్కౌంట్

LIC New Jeevan Nidhi: ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి ప్లాన్ మెచ్యూరిటీ లాభాలు
మెచ్యూరిటీ సమయంలో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం 1/3 భాగం విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా డబ్బుతో యాన్యుటీ ప్లాన్ (LIC Jeevan Akshay, LIC Jeevan Shanti) తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మొత్తం డబ్బుతో యాన్యుటీ ప్లాన్ (LIC Jeevan Shanti) తీసుకోవచ్చు. మొత్తం డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండదు.
LIC New Jeevan Nidhi: ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి ప్లాన్ ఉదాహరణ
30 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి రెగ్యులర్ ప్రీమియం పేమెంట్‌తో పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ వయస్సు 60 ఏళ్లు. సమ్ అష్యూర్డ్ రూ.10 లక్షలు. ప్రీమియం 30 ఏళ్ల పాటు చెల్లించాలి. మొదటి ఏడాది జీఎస్టీతో కలిపి ప్రీమియం రూ.32,166. రెండో ఏడాది నుంచి జీఎస్టీతో కలిపి రూ.31,474 చెల్లించాలి. మెచ్యూరిటీ తర్వాత గ్యారెంటీ అడిషన్స్ రూ.2.5 లక్షలు, సింపుల్ రివర్షనరీ బోనస్ రూ.12.5 లక్షలు, ఫైనల్ అడిషనల్ బోనస్ రూ.2 లక్షలు రావొచ్చని అంచనా. మొత్తం రూ.10 లక్షలు+రూ.2.5 లక్షలు+రూ.12.5 లక్షలు+రూ.2 లక్షలు= రూ.27 లక్షలు అవుతుంది. మీరు రూ.9 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా రూ.18 లక్షలతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి. 9% వడ్డీ లెక్కేసినా సంవత్సరానికి రూ.1.62 లక్షలు అంటే నెలకు రూ.13,500 జీవితాంతం లభిస్తుంది.
ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి ప్లాన్ తీసుకునే ముందు పూర్తి వివరాలు ఎల్ఐసీ వెబ్సైట్లో చూడండి. ఎ
ల్ఐసీ న్యూ జీవన్ నిధి ప్లాన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Photos: అదిరిపోయిన ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్
ఇవి కూడా చదవండి:
SBI Loans: ఎస్బీఐ ఆఫర్ చేస్తున్న లోన్స్ ఇవే...
Amazon Summer Sale: అమెజాన్‌లో సమ్మర్ సేల్... ఆఫర్లు ఇవే...
Jio GigaFiber: నెలకు రూ.600 చెల్లిస్తే బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్