• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • WANT MEDICAL COVER FOR YOUR DOG INSURE YOUR FURRY BUDDY AT RS 315 PREMIUM STORY MK GH

Pet insurance: మీ పెంపుడు కుక్క భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకున్నారా...అయితే ఇది మీకోసం...

Pet insurance: మీ పెంపుడు కుక్క భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకున్నారా...అయితే ఇది మీకోసం...

ప్రతీకాత్మక చిత్రం

బీమా సంస్థలు పెంపుడు కుక్క(dog)లకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగ భీమా సంస్థలైన న్యూ ఇండియా అస్యూరెన్స్ (New India Assurance), ఓరియంటల్ ఇన్సూరెన్స్ (Oriental Insurance)లు చాలా కాలం నుండి కుక్కలకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

  • Share this:
ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే ఇళ్లంతా కలకలలాడుతుంది. అందువల్ల, రోజురోజుకు పెంపుడు జంతువులపై ప్రజలకు ప్రేమ పెరుగుతోంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో వీటి పెంపకం విస్తరిస్తోంది. అయితే, అమితంగా ఇష్టపడి పెంచుకునే జంతువులకు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కొంతమంది యజమానులు తట్టుకోలేక వాటి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు సైతం వెనకాడడం లేదు. ఇందులో భాగంగానే పెంపుడు జంతువులకూ, మనుషుల వలే ఆరోగ్య బీమా అందుబాటులోకి వచ్చింది. కేవలం విదేశాల్లోనే అందుబాటులో ఉన్న ఈ విధానం ఇప్పుడు భారతదేశంలోని నగరాల్లో, పట్టనాల్లో విస్తరిస్తోంది. దీనిలో భాగంగానే, అనేక బీమా సంస్థలు పెంపుడు కుక్క(dog)లకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగ భీమా సంస్థలైన న్యూ ఇండియా అస్యూరెన్స్ (New India Assurance), ఓరియంటల్ ఇన్సూరెన్స్ (Oriental Insurance)లు చాలా కాలం నుండి కుక్కలకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ పాలసీలు పెంపుడు కుక్కలకు జీవిత బీమా రక్షణ, యాక్సిడెంటల్ కవరేజీ, ఏదైనా వ్యాధుల కారణంగా మరణం సంభవిస్తే కవరేజిని అందిస్తాయి.

ప్రైవేట్ బీమా సంస్థ బజాజ్ అల్లియన్స్ (Bajaj Allianz General Insurance) కూడా ఇటీవలే పెంపుడు కుక్కల బీమా పాలసీని ప్రారంభించింది. దీని ద్వారా మరణానికే కాకుండా శస్త్రచికిత్స ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు, టెర్మినల్ వ్యాధులు, దీర్ఘకాలిక సంరక్షణ, OPD ఖర్చులు, దొంగతనం వంటి వాటికి కవరేజీ లభిస్తుంది. దీనిపై బజాజ్ అల్లియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ (Bajaj Allianz General Insurance) చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ టిఎ రామలింగం మాట్లాడుతూ " పెంపుడు కుక్కలకు భీమా పాలసీని ఆగస్టు నెలలో ప్రారంభించాం. ఈ పాలసీకి పెద్ద ఎత్తున సానుకూల స్పందన వచ్చింది. ఇదే స్పూర్తితో భవిష్యత్తులో ఇతర పెంపుడు జంతువులకు కూడా బీమా పాలసీని కల్పించనున్నాం" అని అన్నారు.

License for pet dogs, Greater Hyderabad Municipal Corporation, GHMC, Online licencing system for pet dogs, Online licencing for dogs, పెంపుడు కుక్కలకు లైసెన్స్, ఆన్‌లైన్ లైసెన్సింగ్ వ్యవస్థ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జీహెచ్‌ఎంసీ
ప్రతీకాత్మక చిత్రం


పెంపుడు కుక్కలకు అందిస్తున్న కవరేజి ప్లాన్లు..

శస్త్రచికిత్స ఖర్చులు, హాస్పిటలైజేషన్ కవర్ల కోసం కనీస వార్షిక ప్రీమియం కింద రూ.315 చెల్లిస్తే, రూ .65,000 మేర కవరేజీ లభిస్తుంది. కాగా, మూడు నెలల నుండి 10 సంవత్సరాల వయస్సు వరకు గల పెంపుడు కుక్కలపై ఈ పాలసీ కవరేజీని అందిస్తుంది. అయితే, పాలసీ కొనుగోలు సమయంలో మీ పెంపుడు కుక్కకు టీకాలు వేయడాన్ని నిర్ధారించుకోండి.

హాస్పిటలైజేషన్ కవరేజి

శస్త్రచికిత్స ఖర్చులు, హాస్పిటలైజేషన్ ఖర్చులు, నష్టపరిహార ఖర్చులకు సంబంధించిన మెడికల్ బిల్లులను బీమా సంస్థలకు సమర్పిస్తే ఈ మొత్తాన్ని ఆయా సంస్థలు మీకు తిరిగి చెల్లిస్తాయి.

టెర్మినల్ డిసీజ్ కవరేజి

టెర్మినల్ డిసీజ్ కవర్ కింద క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యం, గుండె జబ్బులు వంటి వ్యాధులకు రూ .30,000 బీమా కవరేజి లభిస్తుంది. ఈ కవరేజి ఒక స్థిరమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. దీని ద్వారా వ్యాధిని గుర్తించిన రోజు నుండి 30 రోజులకు మించి కుక్క బతికి ఉంటే, బీమా కవరేజీ మొత్తాన్ని సంస్థ పాలసీదారునికి చెల్లిస్తుంది. దీని కోసం ఆసుపత్రి బిల్లులు సమర్పించాల్సిన అవసరం లేదు.

దీర్ఘకాలిక సంరక్షణ కవరేజి

దీర్ఘకాలిక సంరక్షణ కవరేజీ రూ .25 వేల బీమాతో వస్తుంది. ఈ కవరేజీ కింద మూర్ఛ, ప్యాంక్రియాటైటిస్, కుషింగ్స్ సిండ్రోమ్, డయాబెటిస్, థైరాయిడ్ వంటి వ్యాధులకు రూ.25 వేల బీమా వస్తుంది. కుక్కకు వ్యాధి నిర్ధారణ అయినట్లయితే, మీకు వెంటనే రూ .25 వేల మొత్తం బీమా చెల్లిస్తాయి బీమా సంస్థలు.

ప్రతీకాత్మకచిత్రం


OPD కవరేజి

OPD కవర్ గరిష్టంగా రూ .30,000 భీమాతో వస్తుంది. మెనింజైటిస్, హెపటైటిస్ /కాలేయం పనిచేయకపోవడం, న్యుమోనియా, కంటి సంబంధిత సమస్యలు (గ్లాకోమా మినహా) వంటి వాటికి ఈ కవరేజీ కింద నష్టపరిహారం లభిస్తుంది.

థెఫ్ట్/లాస్ట్/స్ట్రేయింగ్ కవరేజి

-మీ కుక్క దొంగిలించబడిన సందర్బంలో ఈ కవరేజీని పొందవచ్చు. అది దొంగలించబడం గురించి బీమా సంస్థకు సమాచారం ఇచ్చిన తేదీ నుండి 45 రోజుల్లో అది కనుగొనబడకపోతే, మీరు బీమా మొత్తాన్ని పొందుతారు.

ఇతర కవరేజి ప్లాన్లు

కొన్ని సాధారణ భీమా సంస్థలు గృహ భీమా పాలసీ క్రింద పెంపుడు జంతువులకు కవరేజీని అందిస్తాయి. అయితే ఇవి మరణం లేదా దొంగతనం ప్రయోజనానికి మాత్రమే పరిమితం చేయబడుతుంది.
Published by:Krishna Adithya
First published:

అగ్ర కథనాలు