ఉద్యోగాలు చేస్తున్నప్పుడే కొంత మొత్తం నిధులను పెట్టుబడిగా పెట్టడం వల్ల రిటైర్మెంట్(Retirement) తరువాత పెన్షన్ పొందవచ్చు. అనేక ఇన్సూరెన్స్ సంస్థలు ఇలాంటి పథకాలను అందిస్తున్నాయి. తాజాగా అవైవా లైఫ్ ఇన్సూరెన్స్(Aviva Life Insurance) ‘అవైవా సరల్ పెన్షన్ ప్లాన్’ పేరుతో కొత్త పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఇది నాన్-లింక్డ్, పార్టిసిపేషన్, సింగిల్ ప్రీమియం ఇండివిడ్యువల్ ఇమీడియెట్ యాన్యూటీ ప్లాన్ అని సంస్థ పేర్కొంది. వినియోగదారులు తమ అవసరాల ఆధారంగా పాలసీని ఎంచుకునే వీలును అవైవా లైఫ్ ఇన్సూరెన్స్( Insurance Policy) ప్రకటించింది. ఈ పాలసీ సెప్టెంబరు నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ కొత్త పెన్షన్(Pension) పథకం వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కేవలం ఒక పేమెంట్ తర్వాత కస్టమర్ జీవిత కాలానికి సాధారణ ఆదాయం పొందే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. కస్టమర్లకు నెలవారీ ప్రాతిపదికన లేదా త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన యాన్యుటీని అందిస్తుంది. దీంతో పాటు పాలసీపై లోన్ సదుపాయం కూడా అందిస్తుంది. బీమా చేసిన వ్యక్తి మరణించిన తర్వాత.. ఆ పాలసీ పేఅవుట్ ప్రయోజనాలను నామినీ అందుకుంటారు.
Ola Electric Scooter: త్వరలోనే అమెరికాకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎగుమతి...
సాధారణ ఫీచర్లతో స్టాండర్డ్ ఇమీడియెట్ యాన్యుటీ ప్రొడక్ట్‌ను అందించాలనే IRDAI ఇన్సూరెన్స్ సంస్థలకు సూచించింది. ఈ లక్ష్యానికి అనుగుణంగా అవైవా సరల్ పెన్షన్ ప్లాన్‌ను ప్రారంభించామని చెప్పారు సంస్థ ప్రతినిధి వినిత్ కపాహి(Vinit Kapahi).
* అవైవా సరల్ పెన్షన్ ప్లాన్ ప్రయోజనాలు
1) పాలసీ అందించే ‘పే ఓన్లీ వన్స్’ ఆప్షన్ ద్వారా పాలసీదారులు జీవితాంతం హామీ ఇచ్చే ఆదాయాన్ని పాలసీ అందిస్తుంది. 2021 సెప్టెంబర్ నుంచే ఈ రెగ్యులర్ ఆదాయాన్ని ఆస్వాదించవచ్చు.
2) ఈ పథకం అందించే ‘జాయింట్ లైఫ్’ ఆప్షన్ ద్వారా భవిష్యత్తులో అందే రెగ్యులర్ ఆదాయంతో జీవిత భాగస్వామి శ్రేయస్సుకు భరోసా అందించవచ్చు.
3) పాలసీ కొనుగోలు చేసిన ఆరు నెలల తర్వాత.. కస్టమర్లు పాలసీపై లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఇతర లోన్ ఆప్షన్‌లు మూసుకుపోయినప్పుడు ఈ పాలసీపై సంస్థ అందించే రుణం తీసుకోవచ్చు.
4) ఈ పథకంతో పాటు వచ్చే పన్ను ప్రయోజనాలను పాలసీదారులు చట్ట ప్రకారం ఆస్వాదించవచ్చు.
5) పాలసీదారుల జీవిత భాగస్వామి లేదా పిల్లలు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయితే.. పాలసీ తీసుకున్న ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా దాన్ని సరెండర్ చేయవచ్చు. అయితే పాలసీ డిపార్ట్‌మెంట్ పేర్కొన్న అనారోగ్యాల జాబితాకే ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్‌ను డాబర్ ఇన్వెస్ట్ కార్ప్, అవైవా ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థలు జాయింట్ వెంచర్‌గా ప్రారంభించాయి. బ్రిటన్ కేంద్రంగా పనిచేసే అవైవా ఇన్సూరెన్స్ సంస్థ.. 1834 నుంచి భారత్‌తో సంబంధాలు కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ 10 దేశాల్లో దాదాపు 33 మిలియన్ల మంది కస్టమర్లకు సేవలందిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Life Insurance, Pension Scheme