Home /News /business /

WANT A LOAN OR CREDIT CARD FILE YOUR INCOME TAX RETURN FIRST UMG GH

ITR: మీకు బ్యాంక్ లోన్, క్రెడిట్ కార్డు కావాలా..? అయితే ముందు ఈ పని చేసేయండీ..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) నిబంధనల ప్రకారం నిర్ణీత మొత్తం ఆదాయం పొందేవారు ఆదాయ పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడం తప్పనిసరి. ఐటీఆర్‌కు సంబంధించిన నిబంధనలను సీబీడీటీ తరచుగా సవరిస్తుంది, లేదా కొత్త నియమాలు విధిస్తుంది.

ఇంకా చదవండి ...
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) నిబంధనల ప్రకారం నిర్ణీత మొత్తం ఆదాయం పొందేవారు ఆదాయ పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడం తప్పనిసరి. ఐటీఆర్‌కు సంబంధించిన నిబంధనలను సీబీడీటీ తరచుగా సవరిస్తుంది, లేదా కొత్త నియమాలు విధిస్తుంది. ఇటీవల 2022 ఏప్రిల్ 21న, CBDT ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇందులో బిజినెస్‌ టర్నోవర్, ప్రొఫెషనల్ రసీదులు, బ్యాంక్ డిపాజిట్లు, ఖర్చులకు సంబంధించి నాలుగు కొత్త షరతులను పేర్కొంది. ITR ఫైల్ చేయడం తప్పనిసరి అని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తీసుకొచ్చిన ఈ షరతులు అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2022-23 నుంచి వర్తిస్తాయి. ITR ఫైల్ చేయడం తప్పనిసరి చేసే అనేక ఇతర షరతులు ఉన్నాయి. అయితే తప్పనిసరిగా ITR ఫైల్ చేయాల్సిన అవసరం లేకపోయినా, ITR ఫైల్ చేయడం వల్ల మెరిట్‌లు, ప్రయోజనాలు ఉన్నాయి.

* ఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరి
ఆదాయ పన్ను చట్టం, 1961 ప్రకారం, ఒక వ్యక్తి ఆదాయం ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని మించిపోయినప్పుడు ఆదాయ పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయాల్సి ఉంటుంది. 60 ఏళ్లలోపు వారు రూ.2.50 లక్షల వరకు ఆదాయంపై ప్రాథమిక మినహాయింపు పొందుతారు. 60 ఏళ్లు పైబడిన వారికి, 80 ఏళ్లలోపు వారికి ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.3 లక్షలు. సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు పైబడిన వారికి), ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.5 లక్షలు.

ఇదీ చదవండి: పొరిగింటోళ్లకి రూ.19 లక్షల గిఫ్ట్ ఇచ్చిన మహిళ.. ఎందుకో తెలుసా..? ఈ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే


దీనికి సంబంధించి AKM గ్లోబల్, టాక్స్ మార్కెట్స్, కన్‌సల్టింగ్‌ కంపెనీ హెడ్ యీషు సెహగల్ మాట్లాడుతూ.. ‘మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి ముందు పన్ను చెల్లింపుదారుడి మొత్తం ఆదాయం రూ.2.50 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, ఆ వ్యక్తి తప్పనిసరిగా వార్షిక పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాలి. విదేశీ ప్రయాణాలపై రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయడం, ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేసే విద్యుత్ వినియోగం, విదేశీ ఆదాయం లేదా ఆస్తులు వంటి నిర్దిష్ట పరిస్థితుల్లో పన్ను రిటర్న్‌లను తప్పనిసరిగా దాఖలు చేయాలని చట్టం సూచిస్తుంది. స్థూల మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. సంవత్సరంలో బ్యాంక్ కరెంట్ అకౌంట్‌లో రూ.1 కోటి కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, ITR ఫైల్ చేయడం తప్పనిసరి. దానితో పాటు, ఒక వ్యక్తి (సీనియర్ సిటిజన్, సూపర్ సీనియర్ సిటిజన్ కాకుండా) మొత్తంగా చెల్లించే టీడీఎస్‌(TDS), టీసీఎస్‌(TCS), రూ.25,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ITR ఫైల్ చేయడం తప్పనిసరి. ఈ మొత్తం సీనియర్‌ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్ల విషయంలో రూ.50,000గా ఉంటుంది’ అని సెహగల్ తెలిపారు.

* క్రెడిట్ కార్డ్‌లు, రుణాలు, పన్ను రీఫండ్‌లు, వీసా దరఖాస్తులు.. అన్నింటికీ ITR కావాలి
కొన్ని సందర్భాల్లో ITR ఫైల్ చేయడం తప్పనిసరి కాకపోయినా, కొన్ని అదనపు ప్రయోజనాల కోసం ITR ఫైల్ చేయవచ్చు. ఉదాహరణకు TDSగా చెల్లించిన అదనపు పన్నుల వాపసును తిరిగి పొందే ఏకైక మార్గం సమయానికి ITR ఫైల్ చేయడం. డిడక్షన్‌కి అర్హత పొందే నిర్దిష్ట ఖర్చులు లేదా పెట్టుబడుల కోసం మినహాయింపును క్లెయిమ్ చేయాలనుకుంటే, రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి స్వీకరించిన చెల్లింపులపై TDS వాపసును క్లెయిమ్ చేయడానికి ITR ఫైలింగ్ అవసరం. ఒక వ్యక్తి ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే ఎక్కువగా ఉండి, రూ.5 లక్షల కంటే తక్కువ ఉంటే.. సెక్షన్ 87A కింద రూ.12,500 వరకు డిడక్షన్స్ క్లెయిమ్ చేయడానికి అర్హులు.



మరోవైపు, ITR అనేది రుణాలు, క్రెడిట్ కార్డ్‌లు, అనేక ఇతర ప్రయోజనాల కోసం దరఖాస్తు చేయడానికి ఒక సాధారణ అవసరం. వీసా దరఖాస్తు ఆమోదాలకు అసెస్సీ ట్యాక్స్-కంప్లైంట్‌గా ఉండాలి, ఎందుకంటే ఈ డాక్యుమెంట్లు దరఖాస్తుదారుల ఆదాయ రుజువుగా పనిచేస్తాయి. భారీ పెనాల్టీలను నివారించడానికి పన్ను చెల్లింపుదారులు, సమయానికి ITR ఫైల్ చేయడం కూడా తప్పనిసరి. అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2022-23 కోసం ITRని గడువు తేదీ(2022 జులై 31) కంటే ముందే ఫైల్ చేసేలా చర్యలు తీసుకోవడం మంచిది.
Published by:Mahesh
First published:

Tags: Credit card, IT Returns, ITR, ITR Filing

తదుపరి వార్తలు