Home /News /business /

WALMART PARTNERS WITH MICROSOFT FOR TIKTOK BID SS

TikTok: టిక్‌టాక్‌ను మేం కొంటాం... ముందుకొచ్చిన మరో కంపెనీ

TikTok: టిక్‌టాక్‌ను మేం కొంటాం... ముందుకొచ్చిన మరో కంపెనీ
(ప్రతీకాత్మక చిత్రం)

TikTok: టిక్‌టాక్‌ను మేం కొంటాం... ముందుకొచ్చిన మరో కంపెనీ (ప్రతీకాత్మక చిత్రం)

TikTok | భారతదేశంలో నిషేధానికి గురైన టిక్‌టాక్‌ను కొనేందుకు కంపెనలు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు మరో కంపెనీ రేస్‌లోకి వచ్చింది.

    టిక్‌టాక్... ఇటీవల వార్తల్లో ఉన్న వీడియో షేరింగ్ యాప్. మోదీ ప్రభుత్వం టిక్‌టాక్‌ను బ్యాన్ చేసినప్పటి నుంచి ఈ యాప్ వార్తల్లో ఉంది. అంతేకాదు... ట్రంప్ ప్రభుత్వం కూడా టిక్‌టాక్‌పై ఆగ్రహంతో ఉంది. సెప్టెంబర్ 15 లోగా అమెరికాలోని కార్యకలాపాలను అమ్మాలని, లేకపోతే నిషేధం తప్పదని ట్రంప్ ప్రభుత్వం డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ గండం నుంచి బయటపడేందుకు బైట్ డ్యాన్స్ తిప్పలు పడుతోంది. టిక్‌టాక్ యూఎస్ బిజినెస్‌ను కొనేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంప్యూటర్ టెక్నాలజీ కార్పొరేషన్ ఒరాకిల్ కూడా రేస్‌లో ఉంది. ఇప్పుడు అమెరికాకు చెందిన మల్టీనేషనల్ రీటైల్ కంపెనీ వాల్‌మార్ట్ కూడా టిక్‌టాక్‌ను కొనే రేస్‌లోకి వచ్చింది. అడ్వర్టైజింగ్ వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు మైక్రోసాఫ్ట్, టిక్‌టాక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వాల్‌మార్ట్ ప్రకటించింది.

    Redmi 9: రెడ్‌మీ 9 వచ్చేసింది... తక్కువ ధరకే 4GB+128GB స్మార్ట్‌ఫోన్‌తో షావోమీ సంచలనం

    Realme 7: రియల్‌మీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్... రియల్‌మీ 7 రిలీజ్ డేట్ ఫిక్స్

    ఇప్పటికే మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్ బిజినెస్ పార్ట్‌నర్స్‌గా ఉన్న సంగతి తెలిసిందే. వాల్‌మార్ట్ రీటైల్ స్టోర్స్, ఆన్‌లైన్ షాపింగ్ కోసం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అందిస్తోంది. 2018 లో ఈ రెండు కంపెనీలు ఐదేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌కు పోటీ ఇస్తున్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌తో కలిసి టిక్‌టాక్‌ను కొనేందుకు వాల్‌మార్ట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక ఇప్పటికే టిక్‌టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా చేసిన కాసేపట్లోనే వాల్‌మార్ట్ ఈ ప్రకటన విడుదల చేసింది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Business, BUSINESS NEWS, Microsoft, Tiktok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు