Flipkart | ఫ్లిప్‌కార్ట్ సంచలన నిర్ణయం..

Flipkart : కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నందున ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వాల్‌మార్ట్‌ ఇండియాకు చెందిన ఈ సంస్థ.. తన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

news18-telugu
Updated: March 25, 2020, 9:51 AM IST
Flipkart | ఫ్లిప్‌కార్ట్ సంచలన నిర్ణయం..
ఫ్లిప్‌కార్ట్
  • Share this:
కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నందున ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వాల్‌మార్ట్‌ ఇండియాకు చెందిన ఈ సంస్థ.. తన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారుల అవసరాలను తీర్చడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని, సాధ్యమైనంత త్వరలో మళ్లీ వినియోగదారుల ముందుకు వస్తామని హామీ ఇస్తున్నామని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం కష్ట కాలంలో ఉన్నందున, సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. అందరం ఇంట్లోనే ఉంటూ జాతికి సాయపడాలని ప్రకటన జారీ చేసింది. అటు.. అమెజాన్ కూడా తన సర్వీసులను నిలిపివేసింది. అత్యవసర సరుకులు మినహా మిగతా అన్ని రకాల సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
First published: March 25, 2020, 9:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading