ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలను(Electric Vehicles) తయారుచేస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతోంది. పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్స్ కూడా ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. అయితే ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లతో(Electric Scooter) ఇండియాలో పాపులర్ అయిన ఓలా కంపెనీ(Company) త్వరలో ఎలక్ట్రిక్ కారును సైతం రిలీజ్ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే కంపెనీ నుంచి ఒక ఇ-బైక్ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరంలో కమ్యూటర్ స్కూటర్లు, మోటార్‌బైక్స్, స్పోర్ట్స్ బైక్స్(Sports Bikes) వంటి అన్ని రకాల టూవీలర్ కేటగిరీస్‌లో EV బైక్స్ తయారుచేస్తామని భవీష్ అగర్వాల్ గతంలో చెప్పారు. దీంతో ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ గురించి చర్చలు ప్రారంభమయ్యాయి.
సీఈఓ ట్వీట్
ఓలా ఎలక్ట్రిక్ త్వరలో ఇ-బైక్స్ ప్రొడక్షన్ ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ వెల్లడించారు. ఆయన చేసిన తాజా ట్వీట్ ప్రకారం, కంపెనీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీపై దృష్టి సారించింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో చేసిన ఒక పోస్ట్‌లో ‘బిల్డింగ్ సమ్ మోటార్‌సైకిల్స్’ అని రాశారు. అంతేకాక యూజర్లు ఎలాంటి స్టైల్లో ఇ-బైక్‌ను ఇష్టపడతారో అడుగుతూ పోల్ కూడా నిర్వహించారు. ఈ పోల్‌లో స్పోర్ట్స్, క్రూయిజర్, అడ్వెంచర్, కేఫ్ రేసర్ వంటి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి.
Building some ????️????️!!
— Bhavish Aggarwal (@bhash) November 10, 2022
ఈ ఏడాది దీపావళి నాడు ఓలా S1 ఎయిర్ లాంచ్ సందర్భంగా భవిష్ మాట్లాడుతూ.. రాబోయే 12 నెలల్లో అన్ని టూవీలర్ కేటగిరీలలో EVలను తయారు చేస్తామని చెప్పారు. ‘ICE వెహికల్స్‌కు బదులుగా EVలను ఎంచుకునేలా వీటిని రూపొందిస్తాం. కమ్యూటర్ స్కూటర్స్, మోటార్‌బైక్స్, స్పోర్ట్స్ బైక్స్.. ఇలా అన్ని విభాగాల్లో కంపెనీ నుంచి ఈవీలు వస్తాయి’ అని వివరించారు.
* లైనప్‌లో మూడు వెహికల్స్
ప్రస్తుతం ఓలా కంపెనీ ఓలా S1, ఓలా S1 ప్రో, ఓలా S1 ఎయిర్ వంటి మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2022 అక్టోబర్‌లో చౌకైన ఓలా S1 ఎయిర్ వేరియంట్‌ను లైనప్‌లో చేర్చింది. ఈవెంట్లోనే MoveOS 3ని కూడా కంపెనీ పరిచయం చేసింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఓలా ఇ-స్కూటర్లకు ప్రాక్సిమిటీ అన్‌లాక్, ఫాస్ట్ ఛార్జింగ్, పార్టీ మోడ్ వంటి ఫీచర్లను అందిస్తుంది.
ఎలక్ట్రిక్ కారు కంటే ముందే..
ఓలా ఇప్పటి వరకు ఇ-బైక్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రాబోయే ఎలక్ట్రిక్ బైక్ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. ఓలా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును 2024 నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. అయితే కొన్ని ఆన్లైన్ రిపోర్ట్స్ ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ కారు కంటే ముందే ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Electric Bikes, Electric Vehicle, Ola