Home /News /business /

WAIT FOR 5G IS OVER KNOW WHEN AND IN WHICH CITIES TO LAUNCH FIRST MK

5G wait is over: 5G కోసం ఎదురుచూస్తున్నారా..అయితే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అప్ డేట్ ఇదే...ఈ నగరాలకే తొలి 5G అనుభవం సొంతం...

ప్రతీకాత్మక చిత్రం (File Photo)

ప్రతీకాత్మక చిత్రం (File Photo)

5G టెక్నాలజీ గురించి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వార్త వచ్చింది. గురుగ్రామ్, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ , పూణేతో సహా మెట్రోలు , పెద్ద నగరాలు వచ్చే ఏడాది మొదటిగా 5G సేవలను పొందుతాయని టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) సోమవారం తన అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఇంకా చదవండి ...
    5G wait is over: 5G టెక్నాలజీ గురించి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వార్త వచ్చింది. గురుగ్రామ్, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ , పూణేతో సహా మెట్రోలు , పెద్ద నగరాలు వచ్చే ఏడాది మొదటిగా 5G సేవలను పొందుతాయని టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) సోమవారం తన అధికారిక ప్రకటనలో తెలిపింది. 5G కోసం స్పెక్ట్రమ్ వేలం మార్చి-ఏప్రిల్ 2022లో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో, స్పెక్ట్రమ్ వేలంపై టెలికాం రంగ నియంత్రణ సంస్థ TRAI నుండి DoT సిఫార్సులు కోరింది, ఇందులో ప్రధానంగా రిజర్వ్ ధర, బ్యాండ్ ప్లాన్, బ్లాక్ పరిమాణం, స్పెక్ట్రమ్ క్వాంటం మొదలైనవి ఉన్నాయి. TRAI తన వంతుగా ఈ సమస్యపై పరిశ్రమలోని వాటాదారులతో సంప్రదింపులు ప్రారంభించింది.

    కంపెనీలు ఎక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నాయి?

    భారతదేశంలో 5G ట్రయల్ గత రెండేళ్లుగా కొనసాగుతోంది. మే 2022 వరకు, దేశంలో 5G ట్రయల్ నడుస్తుందన్న విషయం గమనించాలి. 5G  కమర్షియల్ స్థాయిలో ప్రారంభం కోసం దేశం మొత్తం వేచి ఉంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇప్పుడు ముందుగా 5G సేవను పొందాలని ప్రకటించిన నగరాల్లో, Jio, Airtel , Vodafone-idea తమ 5G నెట్‌వర్క్‌ను పరీక్షిస్తున్నాయి. టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో , వొడాఫోన్ ఐడియా లాంటి సంస్థలు గురుగ్రామ్, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, చండీగఢ్, ఢిల్లీ, జామ్‌నగర్, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీ నగర్ నగరాల్లో 5G టెస్టింగ్ సైట్‌లను ఏర్పాటు చేశాయి.

    5G వేగం గురించి...

    దేశంలో 5జీ అమలులోకి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ల ప్రపంచం మారనుంది. ఒక అంచనా ప్రకారం, 5G వేగం 4G కంటే 10 రెట్లు ఎక్కువ. 5G సేవ ప్రారంభం డిజిటల్ విప్లవానికి కొత్త కోణాన్ని ఇస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. ఈ-గవర్నెన్స్ విస్తరిస్తుంది. కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్‌పై ఆధారపడే విధానం పెరిగింది. ఆ దృష్ట్యా, 5G వచ్చిన తర్వాత, ఇది ప్రతి వ్యక్తి జీవితాన్ని మరింత మెరుగ్గా , సరళంగా మార్చడంలో సహాయపడుతుంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: 5G Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు