Home /News /business /

VOLVO PRICE HIKE VOLVO CARS SHOCK TO CONSUMERS UP TO RS 3 LAKH ON VOLATILE FOREX MODELS GH EVK

Volvo Price Hike: వినియోగదారుల‌కు "వోల్వో" షాక్‌.. ఆ మోడళ్లపై రూ.3 లక్షల వరకు పెంపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Volvo Price Hike | లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్స్‌ ఇండియా (Volvo Cars India) వివిధ మోడళ్లపై రూ. 3 లక్షల వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు ఇండియాలో ఇప్పటికే అమలులోకి వచ్చింది

కార్ల తయారీ కంపెనీలు (Carmakers) వాహనదారులకు వరుసగా షాకులు ఇస్తున్నాయి. కొద్దిరోజులుగా వాహనాల తయారీలో వాడే ముడి సరుకుల (Raw Materials) కాస్ట్స్ పెరుగుతున్నాయి. కార్ల తయారీ కంపెనీలు ఈ పెరుగుదలను హ్యాండిల్ చేయలేక తమ అన్ని మోడల్ కార్ల ధరలను పెంచుతున్నాయి. ఇన్‌పుట్ కాస్ట్ (Input Cost) పెరుగుతున్నందున ధరల పెంచడం తప్ప మరో మార్గం లేదని ఈ కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్స్‌ ఇండియా (Volvo Cars India) వివిధ మోడళ్లపై రూ. 3 లక్షల వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు ఇండియాలో ఇప్పటికే అమలులోకి వచ్చింది. తయారీకి సంబంధించిన ఇన్‌పుట్ కాస్ట్ పెరగడం వల్లనే ధర పెంచాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. ఏప్రిల్ 12 కంటే ముందు కారును బుక్ చేసుకున్న కస్టమర్లు మాత్రం పాత ధరల ప్రకారం మనీ చెల్లిస్తే సరిపోతుంది.

Amazon: ఇక అమెజాన్‌లో మ‌రింత ఎంట‌ర్‌టైన్మెంట్‌.. త్వ‌ర‌లో కొత్త సబ్‌స్క్రిప్షన్ సర్వీస్


ఈ స్వీడిష్ కంపెనీ ఇండియాలో ధరల పెంపును ప్రకటించడం ఇది రెండవసారి. ఈ ఏడాది ప్రారంభంలో ఇది మొదటిసారిగా ధర పెంచింది. రెండోసారి భారీగా ధరలు పెంచడంతో కొనుగోలుదారులు ఉసూరుమంటున్నారు. గ్లోబల్ సప్లై చెన్‌లో అంతరాయం, అధిక లాజిస్టిక్ ఖర్చులు, అస్థిర ఫారెక్స్ (Volatile Forex) పరిస్థితి కారణంగా కంపెనీ ధరలను పెంచింది. సవరించిన ధరల ప్రకారం, ఇండియాలో వోల్వో మోడళ్ల ధరల పెరుగుదల రూ. 1 నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటుంది. సవరించిన రేట్ల ప్రకారం, ఇప్పుడు ఎక్స్‌సీ40 ఎక్స్-షోరూమ్ ధర 3 శాతం పెరిగి రూ.44.5 లక్షలకు చేరుకుంది. ఎక్స్‌సీ60 ధర 4 శాతం పెరిగి రూ.65.9 లక్షలకు చేరుకోగా ఎస్90 2 శాతం పెరిగి రూ.65.9 లక్షలకు ఎగబాకింది. ఎక్స్‌సీ90 ధర 3 శాతం అధికమై రూ.93.9 లక్షలకు సేల్ అవుతుంది.

“గత కొన్ని నెలలుగా గ్లోబల్ సప్లై చెన్‌లో అంతరాయం ఏర్పడుతుండటంతో ఇన్‌పుట్‌, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగాయి. ఇది మొత్తం భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమపై మాత్రమే కాదు వోల్వో కార్ ఇండియాపై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. ఈ ధరల పెరుగుదల మా అన్ని ప్రొడక్ట్స్ పై ఎక్స్-షోరూమ్ ధరలను పెంచేలా ఒత్తిడి చేసింది" అని వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా అన్నారు.

Kia Sonet: ఇండియ‌న్ మార్కెట్‌లోకి త్వ‌ర‌లో టాప్ క్లాస్ ఫీచ‌ర్స్‌తో.. సీఎన్‌జీ వేరియంట్ కార్‌


ఇటీవల, వోల్వో కార్ ఇండియా మొత్తం-పెట్రోల్ పోర్ట్‌ఫోలియోకి మారింది. అన్ని డీజిల్ మోడల్‌లు దశలవారీగా నిలిపి వేస్తోంది. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లు తీసుకొచ్చేందుకు వోల్వో ప్లాన్ చేస్తోంది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, సిట్రోయెన్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు జనవరి నుంచి ధరలు పెంచుతూ వస్తున్నాయి. స్టీల్తో పాటు సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఆటోమొబైల్ (Automobile)  ఇండస్ట్రీ మీదే కాకుండా రియల్ ఎస్టేట్ పరిశ్రమ పై కూడా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతోంది.
Published by:Sharath Chandra
First published:

Tags: Automobiles, Cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు