హోమ్ /వార్తలు /బిజినెస్ /

Volkswagen Virtus Car Launch: ఇండియాలో వోక్స్‌వ్యాగన్‌ విర్టస్‌ కారు లాంచ్‌.. ధర ఎంతో తెలుసా..

Volkswagen Virtus Car Launch: ఇండియాలో వోక్స్‌వ్యాగన్‌ విర్టస్‌ కారు లాంచ్‌.. ధర ఎంతో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వోక్స్‌వ్యాగన్‌ (Volkswagon) కంపెనీ ఇండియాలో సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ విర్టస్‌ను (Virtus) రెండు వేరియంట్‌లలో లాంచ్‌ చేసింది. వాటి ధర రూ.11.21 లక్షల నుంచి రూ.17.91 లక్షల మధ్య ఉన్నట్లు 2022 జూన్ 9న కంపెనీ వెల్లడించింది.

వోక్స్‌వ్యాగన్‌ (Volkswagen) కంపెనీ ఇండియాలో సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ విర్టస్‌ను (Virtus) రెండు వేరియంట్‌లలో లాంచ్‌ చేసింది. వాటి ధర రూ.11.21 లక్షల నుంచి రూ.17.91 లక్షల మధ్య ఉన్నట్లు 2022 జూన్ 9న కంపెనీ(Company) వెల్లడించింది. విర్టస్‌ తన పవర్‌ట్రైన్(Power Train), ప్లాట్‌ఫారమ్‌ను స్కోడా(Skoda) స్లావియా, టైగన్‌తో పంచుకుంది. విర్టస్‌ స్కోడా వోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(Volkswagen India Pvt Ltd) స్థానికంగా తీసుకొచ్చిన MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. దాదాపు 95 శాతం భాగాలు స్థానికంగా తయారయ్యాయి. VW Virtus 25 దేశాలకు ఎగుమతి(Export) కానున్నట్లు సంస్థ పేర్కొంది.

వోక్స్‌వ్యాగన్‌ విర్టస్‌ రెండు పవర్‌ట్రెయిన్‌లతో వస్తుంది. 1.0-లీటర్ TSI 114bhp మేకింగ్, మరింత శక్తివంతమైన 1.5-లీటర్ TSI పటిష్టమైన 148bhp pf శక్తిని అందిస్తుంది. గత సంవత్సరం వోక్స్‌వ్యాగన్‌ దాదాపు 27,000 కార్లను విక్రయించింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 15,000 యూనిట్ల అమ్మకాలను చేపట్టింది.

వోక్స్‌వ్యాగన్‌ విర్టస్‌ ఫీచర్లు

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్కోడా స్లావియా మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది 10-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో వస్తుంది. ఇది యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు ముందు ప్రయాణీకులకు వెంటిలేటెడ్ సీట్లతో సౌకర్యవంతంగా ఉంటుంది. విర్టస్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి.

AP Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

రెండు ఇంజిన్‌ వేరియంట్‌లలో లాంచ్‌

కొత్త వోక్స్‌వ్యాగన్‌ విర్టస్‌ భారతదేశంలో రెండు ఇంజిన్‌ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఇది 6-స్పీడ్ MT, ATతో జత చేసిన 1.0-లీటర్ TSIతో వస్తుంది. 7-స్పీడ్ DSGతో జతచేసిన 1.5-లీటర్ TSI మోటార్ కూడా ఉంటుంది. వోక్స్‌వ్యాగన్‌ విర్టస్‌ జర్మన్ ఇంజినీరింగ్‌ అద్భుతం. డైనమిక్, పెర్‌ఫార్మెన్స్‌ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. వోక్స్‌వ్యాగన్‌ విర్టస్‌ను రూ.11.21 లక్షల ప్రారంభ ధరతో లాంచ్‌ చేశారు. ఇది గరిష్టంగా 1020 mm ముందు , 920 mm వెనుక లెగ్ రూమ్‌ను అందిస్తుంది. సెడాన్ సెగ్మెంట్‌లో సరికొత్త వర్టస్ సెడాన్ అతిపెద్ద, అత్యంత విశాలమైన మోడల్ అని వోక్స్‌వ్యాగన్ పేర్కొంది.

Govt Jobs 2022: డిప్లొమా, ఇంజినీరింగ్ చేసిని వారికి బెస్ట్ చాన్స్.. నెలకు రూ.18,000 వేతనంతో అప్రెంటీస్ జాబ్స్

40 కంటే ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్లు

వోక్స్‌వ్యాగన్‌ విర్టస్‌ ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, 6 వరకు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, EBDతో కూడిన ABS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మల్టీ-కొలిజన్ బ్రేక్‌లు, హిల్-హోల్డ్ కంట్రోల్ వంటి 40 కంటే ఎక్కువ యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్‌లను అందిస్తుంది. వెనుక పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. వోక్స్‌వ్యాగన్‌ విర్టస్‌ 95 శాతం స్థానికీకరణ స్థాయితో MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. వోక్స్‌వ్యాగన్ వర్టస్ డైనమిక్, ఫ్యూచరిస్టిక్, ఏజ్లెస్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

Published by:Veera Babu
First published:

Tags: New cars, New features, Volkswagen

ఉత్తమ కథలు