Home /News /business /

VOLKSWAGEN TIGUAN FACELIFT SUV LAUNCHED IN INDIA HERE PRICE AND OTHER DETAILS NS GH

Volkswagen Tiguan: భారత మార్కెట్​లోకి వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ ఎస్​యూవీ​.. ధర, అదిరే ఫీచర్ల వివరాలివే!

భారత మార్కెట్​లోకి వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ ఎస్​యూవీ​.. ధర, ఫీచర్ల వివరాలివే!

భారత మార్కెట్​లోకి వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ ఎస్​యూవీ​.. ధర, ఫీచర్ల వివరాలివే!

జర్మనీ(Remove term: Germany Germany)కి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్​ వ్యాగన్(Volkswagen)​ భారత మార్కెట్​లోకి అప్​డేటెడ్​ టిగువాన్ ఫేస్​లిఫ్ట్ కారును లాంఛ్ చేసింది. కంపెనీ ఈ కొత్త కారును రూ. 31.99 లక్షల (ఎక్స్​షోరూమ్​, ఇండియా) ధర వద్ద విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
జర్మనీ (Germany) కార్ల తయారీ సంస్థ వోక్స్​ వ్యాగన్ (Volkswage)​ భారత మార్కెట్​లోకి అప్​డేటెడ్​ టిగువాన్ ఫేస్​లిఫ్ట్ కారును ఆవిష్కరించింది. కంపెనీ ఈ కొత్త కారును రూ. 31.99 లక్షల (ఎక్స్​షోరూమ్​, ఇండియా-ex-showroom) ధర వద్ద ప్రవేశపెట్టింది. ఈ ఫేస్​లిఫ్ట్ ఎస్​యూవీ కారు(Car) ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు వోక్స్​వాగన్​ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా అధీకృత డీలర్‌షిప్‌ సెంటర్లలో నమోదు చేసుకోవచ్చు. ఈ ఎస్​యూవీని బుక్​ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ వచ్చే జనవరి నుంచి కారు డెలివరీలను ప్రారంభిస్తుంది. అయితే, ఇది కేవలం పెట్రోల్ వేరియంట్​లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఒక్క వేరియంట్​లోనే కంపెనీ ఫుల్లీ లోడెడ్​ ఫీచర్లను చేర్చింది. గతేడాది తొలిసారి మార్కెట్​లోకి వచ్చిన టిగువాన్ ఫేస్​లిఫ్ట్​–2021లో అనేక మార్పులు చేసి దీన్ని కస్టమర్ల ముందుకు తెచ్చింది. గతంలో వోక్స్​వ్యాగన్​ ఇండియా విక్రయించిన పాత తరం టిగువాన్​ మోడల్​ను కంపెనీ విదేశాల్లో తయారు చేసేది. వాటిని దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయించేది. అయితే ఇప్పుడు ఈ కొత్త 2022 వోక్స్​వాగన్​ టిగువాన్​ ఫేస్​ లిఫ్ట్​ మోడల్​ను కంపెనీ భారతదేశంలోనే అసెంబుల్​ చేస్తోంది. ఫలితంగా ఇది మునుపటి కంటే తక్కువ ధర వద్ద లభిస్తుంది.

కేవలం పెట్రోల్​ ఇంజిన్​ ఆప్షన్​లోనే..
కొత్త వోక్స్​వాగన్​ టిగువాన్​ కేవలం పెట్రోల్​ ఇంజిన్​ ఆప్షన్​లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో బిఎస్​ 6 వెర్షన్​ 2.0 లీటర్​ టిఎస్​ఐ పెట్రోల్ ఇంజిన్​ను ఉపయోగించారు. ఈ ఇంజిన్​ గరిష్టంగా 187 బిహెచ్​ఫి పవర్​ను, 320 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్​ డిఎస్​జి ఆటోమేటిక్​ గేర్​ బాక్స్​తో జతచేసి ఉంటుంది. వోక్స్​వాగన్​ బ్రాండ్​ సిగ్నేచర్​ ఆల్​వీల్​ డ్రైవ్​ టెక్నాలజీతో లభిస్తుంది. ఈ కారు లీటర్​కు 12.65 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ కారులో ఎల్​ఈడీ మ్యాట్రిక్స్​ హెడ్​లైట్లు, రెండు ఎల్​ ఆకారపు ఎల్​ఈడీ డే టైమ్​ రన్నింగ్​ లైట్లు, కొత్త ఫాగ్​ లైట్లు వంటి మార్పులు చేసింది. అలాగే, సైడ్స్​లో ప్రీమియం 19 ఇంచ్​ అల్లాయ్​ వీల్స్​, వెనుక భాగంలో సన్నటి ఎల్​ఈడీ టెయిల్​ లైట్లను అందించింది.
Car Loan: కార్ లోన్ తీసుకోవాలా? ఈ బ్యాంకుల్లో వడ్డీ రేటు తక్కువ

అదిరిపోయే ఇంటీరియర్ ఫీచర్లు
టిగువాన్​ ఫేస్​లిఫ్ట్​ ఇంటీరియర్​లో కూడా భారీ మార్పులు చేసింది. ఇందులో వర్చువల్​ కాక్​పిట్​, పెద్ద ఆండ్రాయిడ్​ ఆటో, ఆపిల్​ కార్​ప్లే కనెక్టివిటీతో కూడిన 8 ఇంచ్​ టచ్​ స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్​, హ్యాండ్​ హెల్డ్​ కంట్రోల్స్​, వియన్నా లెదర్​ సీట్లు, సాఫ్ట్​ టచ్​ ప్లాస్టిక్​తో కూడిన డ్యాష్​బోర్డ్​, 3 జోన్​ ఆటోమేటిక్​ క్లైమెట్​ కంట్రోల్ సిస్టమ్​ వంటివి అందించింది. మరోవైపు ఈ కారు 6 ఎయిర్​బ్యాగ్​లు, అన్ని చక్రాలపై డిస్క్​ బ్రేకులు, ఏబీఎస్​, హిల్​ స్టార్ట్ అసిస్ట్​, హిల్​ డిసెంట్​ కంట్రోల్​, ఆటో హోల్డ్​ వంటి సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: CAR, Germany

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు