హోమ్ /వార్తలు /బిజినెస్ /

Volkswagen: వోక్స్‌వ్యాగన్ టైగన్ మోడల్ కార్ల ధరలు పెంపు.. అమల్లోకి వచ్చిన సవరించిన ధరలు ఇవే..!

Volkswagen: వోక్స్‌వ్యాగన్ టైగన్ మోడల్ కార్ల ధరలు పెంపు.. అమల్లోకి వచ్చిన సవరించిన ధరలు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ దేశీయ మార్కెట్‌లో తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచింది. వేరియంట్‌లను బట్టి టైగన్, టిగువాన్ మోడళ్ల ధరలను 2.5 శాతం నుంచి 4 శాతం వరకు పెంచుతున్నట్లు వోక్స్ వ్యాగన్ ప్రకటించింది.

జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్(Volkswagen) దేశీయ మార్కెట్‌లో(Market) తన ప్యాసింజర్(Passenger) వాహనాల ధరలను పెంచింది. వేరియంట్‌లను బట్టి టైగన్(Taigun), టిగువాన్(Tiguan) మోడళ్ల ధరలను 2.5 శాతం నుంచి 4 శాతం వరకు పెంచుతున్నట్లు వోక్స్ వ్యాగన్ ప్రకటించింది. ఈ సవరించిన ధరలు మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి. కరోనా(Corona) కారణంగా ఆటోమొబైల్(Auto Mobile) రంగానికి చెందిన కీలకమైన ముడి పదార్థాల ధరలు పెరిగాయి. మరోవైపు సెమీకండక్టర్ల(Semi Conductors) కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఆటోమోటివ్ సప్లై చెయిన్‌లో(Auto Motive Supply Chain) తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా కార్ల ధరలను కంపెనీలు(Companies) పెంచుతున్నాయి. పెరిగిన ఇన్‌పుట్ ధరలను పాక్షికంగా భర్తీ చేయడం కోసం ధరల పెంపు అనివార్యమైందని వోక్స్‌వ్యాగన్ పేర్కొంది. ఇంతకు ముందు టాటా మోటార్స్, టయోటా, మహీంద్రా, హ్యుందాయ్, కియా, వోల్వో తదితర ఆటోమేకర్ సంస్థలు దాదాపు ఇలాంటి కారణాలనే చూపుతూ తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.

టైగన్ SUV కోసం అనేక ఫీచర్లను మరింత మెరుగుపర్చినట్లు వోక్స్‌వ్యాగన్ ప్రకటించింది. ప్రీమియమ్ SUV ఇప్పుడు ఇంజిన్ ఐడిల్ స్టార్ట్/స్టాప్, టైర్ ప్రెజర్ డిఫ్లేషన్ వార్నింగ్ వంటి ఫీచర్లతో లభిస్తుంది. అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌లు, పర్ఫార్మెన్స్ లైన్ అండ్ డైనమిక్ లైన్ ఫీచర్లు ప్రవేశపెట్టినట్లు వోక్స్‌వాగన్ పేర్కొంది.

Gadgets: సమ్మర్‌లో స్మార్ట్ గాడ్జెట్స్ హీట్ అవుతున్నాయా..? మీ డివైజ్‌లను సేఫ్‌గా, కూల్‌గా ఉంచే టిప్స్ పాటించండి..


* అమ్మకాలపై పడనున్న ప్రభావం

మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది వాహన కొనుగోలుదారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలోనే వోక్స్‌వ్యాగన్ కార్ల ధరలను పెంచింది. ఒక పక్క కార్ల ధరలు, మరోపక్క చమురు ధరలు పెరగుతుండడంతో ఇది చివరికి వాహన అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఆటోమొబైల్ రంగాన్ని నిశితంగా పరిశీలిస్తే గత ఏడాది నుంచి సెమీకండక్టర్లు, ఇతర భాగాల కొరత కారణంగా ఆటోమోటివ్ సప్లై చెయిన్లో వాహన తయారీ సంస్థలు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆటోమోటివ్ సప్లై చైయిన్‌లో రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం కూడా ఆటోమొబైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Kia Carens CNG: కియా నుంచి త్వరలో సీఎన్‌జీ కారు లాంచ్.. దీని గురించి ఈ విషయాలను తెలుసుకోండి..


సప్లై చెయిన్ సవాళ్ల కారణంగా మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి వాహన తయారీ కంపెనీలు ఉత్పాదక సమస్యలను ఎదుర్కొన్నాయి. దీంతో ఏప్రిల్‌లో వాహన అమ్మకాలు క్షీణించాయి. అయితే టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఆటో వంటి కార్ల తయారీదారులు గత నెలలో వాహనాల పంపిణీలో బలమైన వృద్ధిని సాధించారు. మారుతీ సుజుకీ దేశీయ విక్రయాలు ఏప్రిల్ 2021లో 1,42,454 యూనిట్ల నుండి 7 శాతం క్షీణించి 1,32,248 యూనిట్లకు పడిపోయాయి. ఆల్టో అండ్ S-ప్రెస్సోతో మినీ కార్ల అమ్మకాలు 32 శాతం తగ్గి 17,137 యూనిట్లకు పడిపోయాయి. ఇకపోతే కాంపాక్ట్ కార్ సెగ్మెంట్‌లో స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో అండ్ డిజైర్ వంటి మోడళ్ల అమ్మకాలు ఏప్రిల్ 2021లో 72,318 నుండి 18 శాతం క్షీణించి 59,184 యూనిట్లకు పడిపోయాయి. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఉత్పత్తిపై స్వల్ప ప్రభావం చూపిందని వాహన తయారీ సంస్థ పేర్కొంది.

Published by:Veera Babu
First published:

Tags: Auto motives, Car prices, Germany, Tigan, Volkswagen

ఉత్తమ కథలు