హోమ్ /వార్తలు /బిజినెస్ /

Volkswagen Car: వోక్స్ వాగన్ కారుపై బంపర్ ఆఫర్... రూ.1.60 లక్షలు డిస్కౌంట్...

Volkswagen Car: వోక్స్ వాగన్ కారుపై బంపర్ ఆఫర్... రూ.1.60 లక్షలు డిస్కౌంట్...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

వోక్స్ వాగన్ వెంటో కంఫర్ట్ లైన్(volkswagen vento) ధర రూ.9.99 లక్షలు కాగా ఈ నెలలో కంపెనీ దీని ధరను రూ .1.6 లక్షల మేర తగ్గించింది. ప్రస్తుతం ఈ కారును రూ.8.39 లక్షలకు పొందవచ్చు.

Volkswagen Car:   ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్ వాగన్ తమ కార్ల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ నెలాఖరులోగా ఎంపిక చేసిన మోడళ్లపై ఈ ఆఫర్ వర్తించనుంది. దీంతో వోక్స్ వాగన్ కూడా ఇతర కార్ల తయారీదారుల లీగ్ లో చేరింది. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదొడుకులు ఎదుర్కొంటుండటంతో ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేవు. దీంతో పాటు కంపెనీల మధ్య పోటీ పెరగడంతో సంస్థ ఈ కొత్త ఆఫర్తో ముందుకొచ్చింది. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసుకున్న పోలో లేదా వెంటో వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఇది ముఖ్యంగా మిడ్ రేంజ్ కార్ల కోసం చూసేవారికి శుభవార్తనే చెప్పాలి. ఇదివరకు వోక్స్ వాగన్ వెంటో కంఫర్ట్ లైన్(volkswagen vento) ధర రూ.9.99 లక్షలు కాగా ఈ నెలలో కంపెనీ దీని ధరను రూ .1.6 లక్షల మేర తగ్గించింది. ప్రస్తుతం ఈ కారును రూ.8.39 లక్షలకు పొందవచ్చు. ఎక్స్-షోరూమ్ ధర రూ .12.08 లక్షలు అయిన వెంటో హైలైన్ ప్లస్ ఎంటీ(volkswagen vento highline plus MT) ధరలో కూడా 1.99 లక్షల డిస్కౌంట్ ప్రకటించింది. మరోవైపు Volkswagen Polo Trendline (నాన్-మెటాలిక్), మిడ్-volkswagen polo frontline comfortline (నాన్-మెటాలిక్), టాప్ volkswagen highline plus మూడు వేరియంట్లలో భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. కాగా ఈ మూడు వేరియంట్లలో volkswagen polo trendline (నాన్-మెటాలిక్) ఎక్కువ డిస్కౌంట్తో కార్ల ప్రేమికులను ఆకర్షిస్తుంది. ఈ కారుకు కంపెనీ ధరను రూ.29,000 తగ్గించింది. ప్రస్తుతం ఈ కారును రూ.55.59 లక్షలకు పొందవచ్చు. ఇంతకుముందు రూ.6.82 లక్షలు ఉండే volkswagen polo frontline comfortline (నాన్-మెటాలిక్)కు రూ.23,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు ఇప్పుడు రూ .6.59 లక్షలకే వస్తుంది. రూ. 8.09 లక్షలుగా ఉన్న volkswagen highline plus ధర రూ.20,000 తగ్గి రూ.7.89 లక్షలకే వస్తుంది.

volkswagen vento 1.0 టర్బో-పెట్రోల్ కంఫర్ట్లైన్ వేరియంట్కు మొత్తం రూ2.02 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఆఫర్లో భాగంగా రూ.1.6 లక్షల నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.7 వేలుతో భారీ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు వైద్యులకు అదనపు డిస్కౌంట్ ప్రకటించింది. వారు రూ.15 వేల ఎడిషనల్ డిస్కౌంట్ ఎక్కువగా పొందే అవకాశం ఉంది.

First published:

Tags: Automobiles, Business, Cars

ఉత్తమ కథలు