ప్రముఖ కార్ల కంపెనీ 'వోక్స్‌వ్యాగన్ ఇండియా' సరికొత్త బ్రాండ్ డిజైన్, లోగోలను ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్ డిజైన్, లోగో త్వరలోనే భారతదేశంలోని 150 వోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లలో కనిపించనున్నాయి. కస్టమర్లకు సరికొత్త అనుభూతిని అందించడంతో పాటు కొనుగోలుదారులతో కనెక్ట్ అవ్వడానికి సరికొత్త బ్రాండ్ డిజైన్ ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త డిజైన్‌తో తమ కార్లు.. కొనుగోలుదారులకు మరింత చేరువవుతాయని కంపెనీ భావిస్తోంది. నూతన బ్రాండ్ డిజైన్ వోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లను మరింత "అధునాతనంగా, ఆకర్షణీయంగా, ఎమోషనల్ గా" మార్చుతుందని కంపెనీ చెబుతోంది. వోక్స్‌వ్యాగన్ కంపెనీ తమ న్యూ బ్రాండ్ డిజైన్ ను దశలవారీగా అమలు చేయనుంది. మొదటి దశలో ఇప్పటికే 30 టచ్ పాయింట్స్‌లలో అమలు చేసింది. మిగిలిన టచ్ పాయింట్లలో ఈ ఏడాది లోపు న్యూ బ్రాండ్ డిజైన్ ను ఏర్పాటు చేయనుంది.
వోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియాకి బ్రాండ్ డైరెక్టర్ అయిన ఆశిష్ గుప్తా కొత్త బ్రాండ్ డిజైన్ గురించి మాట్లాడారు. తమ డీలర్‌షిప్‌లలో కొత్త బ్రాండ్ డిజైన్ ను ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలోని వోక్స్‌వ్యాగన్ కు నూతన శకం ప్రారంభమవుతోందని ఆయన అన్నారు. క్రొత్త బ్రాండ్ డిజైన్, లోగోను అమలు చేసి మంచి కస్టమర్ ఎక్స్పీరియన్స్ సృష్టించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అన్ని డిజిటల్ ఛానల్స్ ద్వారా కస్టమర్లకు మంచి అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.
సరికొత్త బ్రాండ్ డిజైన్ తో సహా కస్టమర్స్ అనుభూతిని మెరుగుపరచడానికి ఈ కార్ల కంపెనీ అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. తమ ఉత్పత్తులతో కస్టమర్ల జీవితాలలో వెలుగులు నింపడానికి, యంగ్ అండ్ వైబ్రేంట్ ఐడెంటిటీ ఇవ్వడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఇప్పటికే, వోక్స్‌వ్యాగన్ కార్లను వినియోగిస్తున్న వినియోగదారులతో పాటు కొత్త వినియోగదారులకు కూడా మంచి అనుభూతిని అందించేందుకు కంపెనీ నడుంబిగించింది. అలాగే, సేల్స్ మెన్, సర్వీస్ సలహాదారులు వంటి ఫ్రంట్ లైన్ సిబ్బందికి కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలో ట్రైనింగ్ ఇవ్వనుంది.
ఇకపోతే అత్యంత త్వరలో కస్టమర్లు భారతదేశంలోని అన్ని వోక్స్‌వ్యాగన్ షోరూమ్‌లలో కొత్త బ్రాండ్ డిజైన్‌ను వీక్షించగలుగుతారు. కొత్త లోగో, బ్రాండ్ డిజైన్లతో పాటు సరికొత్త కార్లను కూడా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు వోక్స్‌వ్యాగన్ సిద్ధమైంది. ఈ కంపెనీ స్కోడా & వోక్స్‌వ్యాగన్ బ్రాండ్స్ పేర్లతో మెరుగైన కార్లను లాంచ్ చేయండి. మిడిల్ సైజ్ స్పోర్ట్స్ యుటిలిటీ ఎస్‌యూవీని కూడా త్వరలోనే లాంచ్ చేయనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.