Vodafone: వొడాఫోన్‌లో ఈ ప్లాన్‌పై డబుల్ డేటా

Vodafone | వొడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. డబుల్ డేటాతో సరికొత్త ప్లాన్ ప్రకటించింది వొడాఫోన్. గతంలో ఉన్న ప్లాన్‌కు డబుల్ డేటా అందిస్తోంది.

news18-telugu
Updated: May 25, 2020, 3:52 PM IST
Vodafone: వొడాఫోన్‌లో ఈ ప్లాన్‌పై డబుల్ డేటా
Vodafone: వొడాఫోన్‌లో ఈ ప్లాన్‌పై డబుల్ డేటా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వొడాఫోన్ యూజర్లకు శుభవార్త. రూ.98 ప్లాన్‌పై బెనిఫిట్స్‌ని మార్చింది వొడాఫోన్. ఈ ప్లాన్‌పై గతంలో ఇచ్చిన డేటా కన్నా డబుల్ డేటాను కస్టమర్లకు అందిస్తోంది. గతంలో రూ.98 రీఛార్జ్ చేసేవారికి 28 రోజుల వేలిడిటీతో 6జీబీ డేటా మాత్రమే లభించేది. అదనపు లాభాలను అందిస్తూ ఈ ప్లాన్‌లో మార్పులు చేసింది వొడాఫోన్. రూ.98 రీఛార్జ్ చేసేవారికి ఇకపై 12జీబీ డేటా లభించనుంది. ప్రస్తుతం ఈ ప్లాన్ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా సర్కిళ్లతో పాటు ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో కూడా లభిస్తుంది. ఇది యాడ్ ఆన్ ప్యాక్. అంటే రూ.98 రీఛార్జ్ చేసుకుంటే 12జీబీ 4జీ డేటా మాత్రమే వస్తుంది. ఎక్కువ డేటా వాడేవారికి మాత్రమే ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఏవీ లభించవు. జీ5 లేదా వొడాఫోన్ ప్లే లాంటి కాంప్లిమెంటరీ కంటెంట్ బెనిఫిట్స్ కూడా ఉండవు.

ఇటీవల ఎయిర్‌టెల్ కూడా రూ.98 ప్లాన్‌పై డబుల్ డేటా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వొడాఫోన్ కూడా ఇదే నిర్ణయం తసుకుంది. రూ.98 ప్లాన్‌లో కేవలం 12 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇక ఎయిర్‌టెల్ రూ.251 రీఛార్జ్ చేసిన వారికి 50 జీబీ డేటా లభిస్తుంది. రిలయెన్స్ జియో కూడా రూ.151 ప్లాన్‌పై 30జీబీ, రూ.201 ప్లాన్‌పై 40జీబీ, రూ.251 ప్లాన్‌పై 50 జీబీ డేటా 30 రోజుల వేలిడిటీతో ప్లాన్స్ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

Realme Smart TV: రియల్‌మీ స్మార్ట్ టీవీ వచ్చేసింది... ధర ఎంతో తెలుసా

Mobile Apps: లాక్‌డౌన్‌లో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన 10 యాప్స్ ఇవే

Jio New Plans: ఎక్కువ 4జీ డేటాతో జియో ప్రకటించిన ప్లాన్స్‌ ఇవే
Published by: Santhosh Kumar S
First published: May 25, 2020, 3:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading