హోమ్ /వార్తలు /బిజినెస్ /

Airtel: కస్టమర్లకు ఎయిర్‌టెల్ షాక్? వొడాఫోన్ ఐడియా యూజర్లకు బ్యాడ్ న్యూస్?

Airtel: కస్టమర్లకు ఎయిర్‌టెల్ షాక్? వొడాఫోన్ ఐడియా యూజర్లకు బ్యాడ్ న్యూస్?

కస్టమర్లకు ఎయిర్‌టెల్ షాక్? వొడాఫోన్ ఐడియా యూజర్లకు బ్యాడ్ న్యూస్?

కస్టమర్లకు ఎయిర్‌టెల్ షాక్? వొడాఫోన్ ఐడియా యూజర్లకు బ్యాడ్ న్యూస్?

5G Sevices | మీరు ఎయిర్‌టెల్ సిమ్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు ఝలక్ తప్పేలా లేదు. లేదంటే మీరు వొడాఫోన్ ఐడియా కస్టమరా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. కంపెనీ బకాయిలు కట్టకపోతే టవర్లపై యాక్సెస్ కోల్పోయే ప్రమాదం ఉంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Vi | ప్రముఖ టెలికం కంపెనీలు కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) కస్టమర్లకు ఝలక్ తప్పేలా లేదు. ఎందుకని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. ఎయిర్‌టెల్ కంపెనీ టారిఫ్ ధరలు పెంచేందుకు సన్నద్ధం అవుతోంది. అలాగే వొడాఫోన్ ఐడియా మాత్రం చెల్లింపులు చేయకపోతే టవర్లపై యాక్సెస్‌ను కోల్పోయే అవకాశం ఉంది.

  దీంతో ఈ రెండు కంపెనీల కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. వొడాఫోన్‌ ఐడియా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. బకాయిలను చెల్లించకపోతే వొడాపోన్ ఐడియా కంపెనీ తన మొబైల్ టవర్లపై యాక్సెస్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇండస్ టవర్స్‌కు ఈ యాక్సెస్‌ను పొందనుంది. తీర్చాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని లేదంటే మొబైల్ టవర్లపై యాక్సెస్‌ను కోల్పోవలసి వస్తుందని ఇండస్ టవర్స్ ఇప్పటికే వొడాఫోన్ ఐడియాకు తెలియజేసింది.

  7 నెలల కనిష్టానికి పడిపోయిన బంగారం ధర.. పతనమైన వెండి!

  ఇండస్ టవర్స్ సోమవారం రోజున బోర్డు మీటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులోనే వొడాఫోన్ ఐడియా అంశంపై చర్చ జరిగింది. ఇండస్ టవర్స్ బోర్డులోని ఇండిపెండెంట్ డైరెక్టర్లు వొడాఫోన్ ఐడియా బకాయిలు చెల్లించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు బకాయిలను వెంటనే తీర్చాలని ఇండస్ టవర్స్.. వొడాపోన్ ఐడియాను కోరిందని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.

  రేషన్ కార్డు కలిగిన వారికి కేంద్రం అదిరే శుభవార్త! కీలక ప్రకటన!

  కాగా వొడాఫోన్ ఐడియా మొత్తం టవర్ బకాయిలు రూ. 10 వేల కోట్లకు పైనే ఉన్నాయి. ఇందులో కంపెనీ ఇండస్ టవర్స్‌కు రూ. 7 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. అమెరికన్ టవర్ కంపెనీకి రూ. 3 వేలు కోట్లు ఇవ్వాలి. మరోవైపు వొడాఫోన్ ఐడియా రూ. 20 వేల కోట్లు సమీకరించాలనే ఆలోచనలో ఉంది. కాగా ఇండస్ టవర్స్ సంస్థ వొడాఫోన్‌కు చెందిన 1,86,474 టవర్లను నిర్వహిస్తోంది. ఇండస్ టవర్స్‌లో ఎయిర్‌టెల్‌కు 47.76 శాతం వాటా ఉంది. వొడాఫోన్ గ్రూప్‌కు 21.05 శాతం వాటా ఉంది. అయితే ఇండస్ టవర్స్ కంపెనీ భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో విలీనం కావడంతో వీఐ తన వాటాను విక్రయించింది. కాగా వొడాఫోన్ రుణ భారం రూ.1.98 లక్షల కోట్లుగా ఉంది.

  మరోవైపు ఎయిర్‌టెల్ టారిఫ్ ధరలను పెంచేందుకు రెడీ అవుతోంది. సమీప కాలంలో రీచార్జ్ ప్లాన్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్‌పీయూ) పెంచుకోవడం కోసం కంపెనీ ఈ మేరకు ధరలను పెంచనుంది. 5జీ సేవల మానిటైజేషన్ కోసం ఏఆర్‌పీయూ కీలకమని జేపీ మోర్గాన్ సదస్సులో ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విఠల్ పేర్కొన్నారు. అంటే టారిఫ్ ధరలు మరోసారి పెరగనున్నాయని అర్థం చేసుకోవచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: 5G, AIRTEL, Airtel recharge plans, VODAFONE, Vodafone Idea

  ఉత్తమ కథలు