Vodafone-Idea: ఐయూసీ ఛార్జీలు వేయం అని ప్రకటించిన వొడాఫోన్ ఐడియా

Vodafone Idea | వొడాఫోన్ ఐడియా మాత్రం ఐయూసీ ఛార్జీల భారాన్ని కస్టమర్లపై మోపొద్దని భావిస్తోంది.

news18-telugu
Updated: October 10, 2019, 12:31 PM IST
Vodafone-Idea: ఐయూసీ ఛార్జీలు వేయం అని ప్రకటించిన వొడాఫోన్ ఐడియా
Vodafone-Idea: ఐయూసీ ఛార్జీలు వేయం అని ప్రకటించిన వొడాఫోన్ ఐడియా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 10, 2019, 12:31 PM IST
ఇతర నెట్‌వర్క్‌కు కాల్ చేసే కస్టమర్ల నుంచి ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీ-IUC వసూలు చేస్తామని రిలయెన్స్ జియో ప్రకటించిన కొన్ని గంటల్లోనే వొడాఫోన్ ఐడియా స్పందించింది. వొడాఫోన్ ఐడియా నుంచి ఇతర నెట్‌వర్క్‌కు కాల్ చేసే కస్టమర్లకు తాము ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీలు వేయమని ప్రకటించింది. కస్టమర్లు తాము చేసే ప్రతీ కాల్‌కు ఛార్జీలు పడతాయా లేక ఉచిత కాల్స్ చేస్తున్నామా అని అయోమయానికి గురికావాల్సిన అవసరం లేకుండా చేయడమే తమ ఉద్దేశమని వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌ పెయిడ్ కస్టమర్లు చేసే కాల్స్‌ ఏ నెట్‌వర్క్‌కు వెళ్తున్నాయని వొడాఫోన్, ఐడియా నెట్‌వర్క్స్ పట్టించుకోవని స్పష్టం చేసింది కంపెనీ. వొడాఫోన్ ఐడియా భారతదేశంలో 2జీ, 3జీ, 4జీ సేవల్ని అందిస్తోంది. భారతదేశంలో ఫీచర్ ఫోన్స్‌లో 2జీ నెట్‌వర్క్ ఉపయోగిస్తున్నవారు 50% పైనే ఉన్నారని వొడాఫోన్ ఐడియా వాదన. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సేవల్ని అందించడం తమకు లాభదాయకం కాకపోయినా సేవల్ని కొనసాగిస్తున్నామని చెబుతోంది వొడాఫోన్ ఐడియా.

జియో కస్టమర్లు సొంత నెట్‌వర్క్‌కు కాకుండా ఇతర నెట్‌వర్క్‌కు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసల చొప్పున ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీ వసూలు చేయాలని రిలయెన్స్ జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ వొడాఫోన్ ఐడియా మాత్రం ఐయూసీ ఛార్జీల భారాన్ని కస్టమర్లపై మోపొద్దని భావిస్తోంది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI నిబంధనల ప్రకారం IUC వ్యవహారాన్ని మొబైల్ కంపెనీలు తమలో తాము తేల్చుకోవాల్సిన విషయమని, దీనికి వినియోగదారులతో ఎలాంటి సంబంధం లేదన్నది వొడాఫోన్ ఐడియా వాదన. మరి ఐయూసీ ఛార్జీల వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Railway Jobs: మొత్తం 3,500 పైగా రైల్వే జాబ్స్... ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేశారా?

Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు... లేటెస్ట్ రేట్స్ ఇవే
Loading...
Aadhaar: ఆధార్ అప్‌డేట్ చేయించాలా? ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేయొచ్చు ఇలా

 
First published: October 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...