Vodafone: వొడాఫోన్ ఐడియా నుంచి కొత్తగా రెండు రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే...

(ప్రతీకాత్మక చిత్రం)

భారత టెలికాం రంగంలో మూడో స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా (Vi) కొత్త కొత్త ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. జియో, ఎయిర్​టెల్​కు ధీటుగా తక్కువ ధరలోనే అద్భుతమైన ప్లాన్లు ప్రవేశపెడుతోంది. వీఐ తాజాగా రూ .1,699, రూ .2,299 విలువ గల రెండు కొత్త రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్లను ప్రారంభించింది. దీని కింద మూడు నుంచి ఐదుగురు కుటుంబ సభ్యులు ప్లాన్​ ప్రయోజనాలను పొందవచ్చు.

  • Share this:
భారత టెలికాం రంగంలో మూడో స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా (Vi) కొత్త కొత్త ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. జియో, ఎయిర్​టెల్​కు ధీటుగా తక్కువ ధరలోనే అద్భుతమైన ప్లాన్లు ప్రవేశపెడుతోంది. వీఐ తాజాగా రూ .1,699, రూ .2,299 విలువ గల రెండు కొత్త రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్లను ప్రారంభించింది. దీని కింద మూడు నుంచి ఐదుగురు కుటుంబ సభ్యులు ప్లాన్​ ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ సరికొత్త ఫ్యామిలీ ప్లాన్​పై వీఐ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగా వర్క్​ ఫ్రం హోమ్​, ఆన్‌లైన్ క్లాసులకు ప్రాధాన్యత పెరిగింది. మరోవైపు థియేటర్లు కూడా పూర్తిగా తెరుచుకోకపోవడంతో ఆన్​లైన్​లోనే ఎంటర్​టైన్​మెంట్​ వెతుక్కుంటున్నారు. ఫలితంగా ఒకే కుటుంబంలోని ఎక్కువ మంది సభ్యులు అధిక డేటాను వినియోగిస్తున్నందున, వారందరికీ కామన్​గా రెడ్​ఎక్స్​​ ప్లాన్​ను ప్రవేశపెట్టాం. దీని కింద అన్​లిమిటెడ్​ కాలింగ్​, అన్​లిమిటెడ్​ డేటా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్​ కుటుంబ సభ్యులందరి కాలింగ్​, డేటా అవసరాలను తీర్చగలదు” అని చెప్పారు. వీఐ ప్రతి కనెక్షన్‌పై అపరిమిత 4G డేటాతో పాటు, కొత్త రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్‌లు ప్రైమరీ, సెకండరీ నంబర్లలో అపరిమిత వాయిస్ కాల్‌లను కూడా అందిస్తున్నాయి.

ప్రముఖ ఓటీటీలకు ఉచిత సబ్​స్క్రిప్షన్​

కొత్త రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్ల కింద ఏడాది పాటు నెట్‌ఫ్లిక్స్​, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి వంటి ఓటీటీ ప్లాట్​ఫామ్​లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. వీటితో పాటు విఐ మూవీస్ & టీవీకి వీఐపీ యాక్సెస్​ను కూడా పొందవచ్చు. ప్రైమరీ, సెకండరీ యూజర్లకు జీ5 ప్రీమియం యాక్సెస్ కూడా అందిస్తుంది. వీటికి అదనంగా వొడాఫోన్​ 7 రోజుల పాటు రూ. 2,999 విలువైన అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను కూడా ఉచితంగా అందిస్తుంది. ప్రైమరీ మెంబర్స్​ కోసం ఇంటర్నేషనల్, యూఎస్​, యూకే, మిడిల్ ఈస్ట్‌తో సహా 14 దేశాలకు ప్రత్యేక ఐఎస్​డీ రేట్లు అందుబాటులో ఉంటాయి.

"రెడ్​ ఎక్స్ పోస్ట్​పెయిడ్​​ ప్లాన్ నిజంగా విభిన్నమైనది. ఎందుకంటే ఇది మా కస్టమర్లకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మా పోస్ట్​పెయిడ్​ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుతుంది” అని తెలిపారు విఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా. వొడాఫోన్ ఐడియా గతంలో రూ. 598, రూ. 749 విలువ గల రెండు పోస్ట్‌పెయిడ్ ప్లాన్​ టారిఫ్‌లని రూ. 50 మేర పెంచింది. ఇప్పుడు ఈ ప్లాన్లు రూ .649, రూ .799 వద్ద లభిస్తున్నాయి.
Published by:Krishna Adithya
First published: