Vodafone: వొడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... 5జీబీ డేటా ఎక్కువ వాడుకోవచ్చు ఇలా

Vodafone Idea Plans | వొడాఫోన్ యూజర్లకు అదనంగా 4జీ డేటా అందిస్తోంది కంపెనీ. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 23, 2020, 12:31 PM IST
Vodafone: వొడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... 5జీబీ డేటా ఎక్కువ వాడుకోవచ్చు ఇలా
Vodafone: వొడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... 5జీబీ డేటా ఎక్కువ వాడుకోవచ్చు ఇలా (ప్రతీకాత్మకచిత్రం)
  • Share this:
వొడాఫోన్ ఐడియా యూజర్లకు శుభవార్త. తమ యూజర్లకు 2జీబీ నుంచి 5జీబీ వరకు అదనంగా డేటా అందిస్తోంది కంపెనీ. ప్రస్తుతం ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. వొడాఫోన్ యాప్ లేదా వెబ్‌సైట్ నుంచి రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. ఇప్పటికే వొడాఫోన్ డబుల్ డేటా ఆఫర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తమ వెబ్‌సైట్, యాప్ ద్వారా రీఛార్జ్ చేసేవారికి 5జీబీ వరకు అదనంగా డేటా అందిస్తుండటం విశేషం. అంటే మీకు ప్రస్తుతం లభిస్తున్న డేటా కన్నా 5జీబీ వరకు ఎక్కువ డేటా ఉపయోగించుకోవచ్చు. రూ.149, రూ.219, రూ.249, రూ.399, రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉపయోగించేవారికి ఈ ఆఫర్ లభిస్తుంది.

Vodafone Rs 149 Plan: రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 2జీబీ డేటా లభిస్తుంది. యూజర్లకు 1జీబీ డేటా అదనంగా అందిస్తోంది కంపెనీ. ఈ ప్లాన్ వేలిడిటీ 28 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వొడాఫోన్ ప్లే, జీ5 సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం.

Vodafone Rs 219 Plan: రూ.219 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 1జీబీ డేటా లభిస్తుంది. యూజర్లకు 2జీబీ డేటా అదనంగా అందిస్తోంది కంపెనీ. ఈ ప్లాన్ వేలిడిటీ 28 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వొడాఫోన్ ప్లే, జీ5 సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం.

Vodafone Rs 249 Plan: రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది. యూజర్లకు 5జీబీ డేటా అదనంగా అందిస్తోంది కంపెనీ. ఈ ప్లాన్ వేలిడిటీ 28 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వొడాఫోన్ ప్లే, జీ5 సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం.

Vodafone Rs 399 Plan: రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది. యూజర్లకు 5జీబీ డేటా అదనంగా అందిస్తోంది కంపెనీ. ఈ ప్లాన్ వేలిడిటీ 56 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వొడాఫోన్ ప్లే, జీ5 సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం.

Vodafone Rs 599 Plan: రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది. యూజర్లకు 5జీబీ డేటా అదనంగా అందిస్తోంది కంపెనీ. ఈ ప్లాన్ వేలిడిటీ 84 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వొడాఫోన్ ప్లే, జీ5 సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం.

ఇవి కూడా చదవండి:

Flipkart Sale: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.20,000 డిస్కౌంట్

PAN-Aadhaar Link: జూన్ 30 లోగా పాన్, ఆధార్ లింక్ చేయకపోతే ఈ చిక్కులు తప్పవు

SBI Gold Loan: స్మార్ట్‌ఫోన్‌లో ఎస్‌బీఐ గోల్డ్ లోన్... తీసుకోండి ఇలా
First published: June 23, 2020, 12:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading