• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • VIVO V21 LAUNCH IN INDIA CLAIMED FOR APRIL 27 TO FEATURE 44MP EYE AF FRONT CAMERA MK GH

Vivo V21: వివో నుంచి 5 కెమెరాల ఫోన్...ధర ఎంతో తెలిస్తే...అస్సలు నమ్మలేరు...

Vivo V21: వివో నుంచి 5 కెమెరాల ఫోన్...ధర ఎంతో తెలిస్తే...అస్సలు నమ్మలేరు...

ViVO V20 2021: వివో వీ20 2021 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.24,990 కాగా ఆఫర్ ధర రూ.22,990. డిస్కౌంట్ రూ.2,000.

గతేడాది వీవో వి​ 20 సిరీస్​లో మూడు మోడళ్లను విడుదల చేసిన వివో.. ఇప్పుడు వీవో వి 21 సిరీస్​ లాంఛింగ్​కు సన్నాహాలు చేస్తోంది. వివో వి 21 స్మార్ట్​ఫోన్​ను​ ఏప్రిల్ 27న భారత మార్కెట్​లోకి లాంఛ్​ చేయనుంది.

  • Share this:
ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ వివో వరుసగా స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తూ భారత మార్కెట్​లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. గతేడాది వీవో వి​ 20 సిరీస్​లో మూడు మోడళ్లను విడుదల చేసిన వివో.. ఇప్పుడు వీవో వి 21 సిరీస్​ లాంఛింగ్​కు సన్నాహాలు చేస్తోంది. వివో వి 21 స్మార్ట్​ఫోన్​ను​ ఏప్రిల్ 27న భారత మార్కెట్​లోకి లాంఛ్​ చేయనుంది. మనీ కంట్రోల్ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం ‘‘స్మార్ట్​ఫోన్ ప్రియులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న వివో వి 21 స్మార్ట్​ఫోన్​ ఈ నెల చివర్లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. అదే రోజున ఈ స్మార్ట్​ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లలోకి కూడా రానుంది. ఇది ఒప్పో A74, రియల్​మీ 8 5 జి, షియోమి ఎంఐ 11 వంటి స్మార్ట్​ఫోన్లకు గట్టి పోటీనివ్వనుంది. గత ఏడాది విడుదలైన వివో వి సిరీస్​తో పోల్చితే, తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న వివో వి 21 సిరీస్​లో అనేక అప్​డేటెడ్​ ఫీచర్లను జోడించింది.” అని తెలిపింది. కాగా, వివో గతేడాది ఇదే సమయంలో వివో వి 20, వి 20 ఎస్‌ఈ, వి 20 ప్రో మోడళ్లను భారత మార్కెట్​లోకి లాంఛ్ చేసింది. అయితే, విడుదలకు సిద్ధంగా ఉన్న వివో వి 21 సిరీస్​లో ప్రస్తుతం ఒక్క మోడల్​ మాత్రమే లాంఛ్ అవ్వనుందని, ఈ సిరీస్‌లోని వివో వి 21 ప్రో, ఇతర వేరియంట్‌లను కూడా త్వరలో లాంఛ్ చేసే అవకాశం ఉందని నివేదిక స్పషం చేసింది.

ఐ ట్రాకింగ్ ఆటోఫోకస్‌ ఫీచర్​తో..
వివో వి 21 స్మార్ట్​ఫోన్​లోని ఫీచర్లపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేనప్పటికీ.. కొన్ని నివేదికల్లో పేర్కొన్న ఫీచర్లను బట్టి చేస్తే.. వివో వి 21 స్మార్ట్​ఫోన్​లో ఐ ట్రాకింగ్ ఆటోఫోకస్‌​తో కూడిన 44 ఎంపి ఫ్రంట్ కెమెరాను జోడించినట్లు తెలుస్తోంది. ఇక, గతేడాది వివో నుండి విడుదలైన వి 20 సిరీస్‌లో కూడా ఐ ట్రాకింగ్ ఆటోఫోకస్‌ ఫీచర్​ను అందించడం విశేషం. V21 సిరీస్​లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, నైట్ మోడ్ కలిగిన 64MP క్వాడ్ రియర్ కెమెరాలను చేర్చింది. భవిష్యత్తులో కూడా స్లిమ్ బాడీతో కూడిన 5జీ స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తిని పెంచనున్నామని వివో స్పష్టం చేసింది. కాగా, వివో నుంచి ఇటీవల విడుదలైన X60 ప్రో, X60 ప్రో ప్లస్​ వంటి స్మార్ట్​ఫోన్లలో గింబాల్ స్టెబిలైజేషన్ వంటి అడ్వాన్స్​డ్​ ఫీచర్లను జోడించింది. దీంతో, ఈ స్మార్ట్​ఫోన్లకు మంచి డిమాండ్​ ఏర్పడింది. చాలా తక్కువ సమయంలొనే గణనీయమైన బుకింగ్స్​ను సొంతం చేసుకుంది. ఇక, వివో వి 21 మోడల్ ధర విషయానికి వస్తే ఇది రూ .30,000 ధరల శ్రేణిలో లభించనుందని తెలుస్తోంది. ఇది ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా విడుదల కానుందని, మునుపటి వేరియంట్ మాదిరిగా కెమెరా సెంట్రిక్ వినియోగ అనుభవాన్ని అందిస్తుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, ఈ స్మార్ట్​ఫోన్​కు సంబంధించిన ధర, ఫీచర్ల వివరాలు ఇంకా అధికారింగా వెల్లడి కాలేదు. దీంతో, ఏప్రిల్​ 27న జరగబోయే లాంఛింగ్​ ఈవెంట్​లోనే అన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
First published: